శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By Selvi
Last Updated : శుక్రవారం, 13 ఫిబ్రవరి 2015 (17:25 IST)

చికెన్ టిక్కా ఎలా చేయాలో తెలుసా?

ఈ వీకెండ్ పిల్లలకు నచ్చే చికెన్ టిక్కా ఎలా చేయాలో తెలుసుకుందాం.. 
 
కావలసిన పదార్థాలు :
చికెన్- ముప్పావు కేజీ 
పెరుగు - అర కప్పు 
అల్లం, వెల్లుల్లి - రెండు టీ స్పూన్లు
మిరియాల పొడి -  అర టీ స్పూన్ 
జీలకర్ర పొడి - అర టీ స్పూన్ 
కారం - అర టీ స్పూన్ 
పసుపు పొడి- అర టీ స్పూన్ 
నిమ్మరసం -  నాలుగు టీ స్పూన్లు 
మినప్పిండి - రెండు టీ స్పూన్లు 
నూనె - ఐదు టీ స్పూన్లు 
బటర్- కాసింత 
జాజికాయ - కాసింత 
ఏలకులు - 3 
ఉప్పు - తగినంత 
 
తయారీ విధానం: 
బోన్ లెస్ చికెన్‌ను ముక్కలుగా కట్ చేసి చికెన్‌ను శుభ్రం చేసుకోవాలి. పెరుగును బాగా గిలకొట్టి, అల్లం, వెల్లుల్లి, మిరియాల పొడి, కారం, పసుపు, నిమ్మరసం, ఉప్పు, మినప్పిండి అన్నింటిని బౌల్‌లోకి తీసుకుని కాసింత నూనె పోసి కలుపుకోవాలి. 
 
ఏలకులు, జాజిపత్రి, జాజికాయ పౌడర్‌ను కూడా చేర్చుకోవాలి. పెరుగుతో కలిపి వుంచిన మసాలాను చికెన్ పీస్‌లకు బాగా పట్టించి సుమారు నాలుగు గంటల పాటు ఊరనివ్వాలి. తర్వాత చికెన్ ముక్కలను గ్రిల్ స్టిక్స్‌తో గుచ్చుకుని ఓవెన్‌లో 10 నిమిషాల పాటు ఉడికించి, 3 నిమిషాలకు ఒకసారి చికెన్ ముక్కలను తీసి నూనె రాసి తిరిగి ఉడికించుకోవాలి. 
 
బాగా ఉడికాక కొత్తిమీర, పుదీనా పేస్ట్ రాసి కాసేపుంచి సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుని వేడి వేడిగా టమోటా సాస్‌తో సర్స్ చేస్తే సరిపోతుంది.