శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By Selvi
Last Updated : బుధవారం, 24 జూన్ 2015 (17:12 IST)

అసలే చినుకులు.. వేడి వేడి చికెన్ గారెలు టేస్ట్ చేస్తే?

చికెన్ తీసుకోవడం ద్వారా ఎముకలకు ఆరోగ్యాన్నిస్తుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆరోగ్యానికి మేలు చేసే అలాంటి చికెన్‌తో వేడి వేడి గారెలు ఎలా చేయాలో చూద్దాం.. చినుకులు పడుతుండగా.. వేడి వేడి గారెలు టేస్ట్ చేస్తే.. 
 
కావలసిన పదార్థాలు :
చికెన్ - పావు కేజీ 
కోడిగుడ్డు - ఒకటి 
పచ్చిమిర్చి తరుగు- ఒక టీ స్పూన్ 
ఉల్లి తరుగు - ఒక కప్పు 
అల్లం పేస్ట్ - అర టీ స్పూన్ 
కొబ్బరి తురుము - ఒకటిన్నర కప్పు 
పసుపు పొడి - అర టీ స్పూన్ 
మిరపపొడి - ఒక టేబుల్ స్పూన్ 
కరివేపాకు తరుగు - కాసింత 
నూనె, ఉప్పు - తగినంత 
 
తయారీ విధానం :
ముందుగా పచ్చిమిర్చి, ఉల్లి తరుగు, కొబ్బరి తురుము, అల్లంను మిక్సీలో రుబ్బుకోవాలి. వెడల్పాటి బౌల్‌లో ఉడికించి రుబ్బుకున్న చికెన్, ఉల్లి ముక్కలు, కోడిగుడ్డు చేర్చి గిలకొట్టుకోవాలి. ఇందులో కరివేపాకు, పచ్చిమిర్చి చేర్చి.. మిక్సీలో రుబ్బి పెట్టుకున్న కొబ్బరి తురుము మిక్స్‌ను చేర్చాలి. ఉప్పు తగినంత చేర్చి గారెల పిండిలా సిద్ధం చేసుకోవాలి. మరో బాణలిలో నూనె వేడయ్యాక గారెల్లా చికెన్ మిశ్రమాన్ని దోరగా వేపుకోవాలి. అంతే చికెన్ గారెలు రెడీ అయినట్లే.