శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By Selvi
Last Updated : బుధవారం, 17 డిశెంబరు 2014 (19:45 IST)

వింటర్లో చికెన్ బిట్స్ టేస్ట్ చేయండి..!

వింటర్లో చికెనును గ్రేవీ, ఫ్రైల్లా కాకుండా వెరైటీగా చికెన్ బిట్స్ ట్రై చేయండి. ఈ చికెన్ బిట్స్‌ను పిల్లలు మరీ ఇష్టపడి తింటారు.
 
కావలసిన పదార్థాలు: 
బోన్ లెస్ చికెన్: అరకేజీ
గుడ్డు: ఒకటి
మొక్కజొన్న పిండి : పావు కప్పు
మైదా: పావు కప్పు, 
ధనియాలపొడి: ఒక టేబుల్ స్పూన్
జీలకర్రపొడి : అర టేబుల్ స్పూన్
కారం: ఒక టేబుల్ స్పూన్
మిరియాలపొడి: అర టేబుల్ స్పూన్
గరం మసాలా: అర టేబుల్ స్పూన్ 
నూనె: వేయించడానికి సరిపడా 
అల్లం, వెల్లుల్లి పేస్ట్: రెండు టీస్పూన్లు
ఒక ఉల్లికాడల తరుగు: ఒక కప్పు
పచ్చిమిర్చి ముక్కలు: ఒక టేబుల్ స్పూన్
టమోటో కెచప్: అరకప్పు
నీళ్ళు: ఒక కప్పు
ఉప్పు: రుచికి తగినంత 
 
తయారీ విధానం: ముందుగా ఓ గిన్నెలో ముక్కలు, గుడ్డుసొన, ధనియాలపొడి, జీలకర్రపొడి, కారం, గరం మసాలా, మిరియాలపొడి, మైదా మొక్కజొన్న పిండి, కొత్తిమీర తరుగు, తగినంత ఉప్పు తీసుకుని బాగా కలపాలి. తర్వాత పాన్‌లో నూనె తీసుకుని ఈ చికెన్ ముక్కల్ని అందులో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.

ఇప్పుడు మరో బాణలిలో రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేడి చేయాలి. తర్వాత అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసి వేయించాలి. రెండు మూడు నిమిషాల తర్వాత టమోటో కెచప్, ముందుగా వేయించుకున్న చికెన్ ముక్కల్ని వేసి వేయించాలి. కొద్దిగా నీళ్ళు చల్లి వేయించి రెండు, మూడు నిమషాల తర్వాత దింపేస్తే సరిపోతుంది. చికెన్ బిట్స్ రెడీ అయినట్లే.