శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By Selvi
Last Updated : బుధవారం, 1 ఏప్రియల్ 2015 (15:39 IST)

కొబ్బరిపాలతో చేపలకూర ఎలా చేయాలి?

కొబ్బరి పాలలో హై న్యూట్రీషన్ విలువలు పుష్కలంగా ఉన్నాయి. వీటిలో విటమిన్ సి, ఈ, బీ1, బీ3, బీ5, బీ6లతో పాటు మినెరల్స్, ఐరన్, సెలీనియం, సోడియం, క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ ఉన్నాయి. అలాంటి కొబ్బరి పాలతో చేపలకూర ఎలా చేయాలో తెలుసా.. 
 
కావలసిన పదార్థాలు:
చేపల ముక్కలు - 10 ముక్కలు 
ఉల్లి తరుగు - ఒక కప్పు 
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - రెండు టీస్పూన్లు 
టమోటా తరుగు - ఒకకప్పు 
నిమ్మరసం - అర టీ స్పూన్ 
ఆవాలు - తాలింపుకు తగినన్నీ
కొబ్బరి కాయ - ఒకటి 
ఉప్పు - తగినంత 
 
తయారీ విధానం : 
ముందుగా చేపల్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొబ్బరి తురిమి, రుబ్బుకుని అరకప్పు చిక్కని పాలు తీయాలి. రెండోసారి అరకప్పు, మూడోసారి అరకప్పు వంతున తీసుకోవాలి. నూనె వేడి చేసి పోపు వేసి అల్లం, వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఉల్లి ముక్కలు వేసి దోరగా వేపుకోవాలి. తర్వాత పసుపు, చేపల ముక్కలు, మూడోసారి తీసిన కొబ్బరి పాలు కలపాలి. బాగా మరిగాక 3నిమిషాల సిమ్‌లో వుంచు ముక్కల్ని నెమ్మదిగా తిరగెయ్యాలి.

ఉప్పు, టమోటా ముక్కలు, రెండోసారి తీసిన కొబ్బరి పాలు కలిపి మరో 3 నిమిషాలు సిమ్‌లో ఉంచాలి. మంట మీద నుంచి తీసేసి, ముందుగా తీసిన పాలు కలిపి, చిక్కబడే దాకా సన్నని సెగపై వుంచాలి. నిమ్మరసం చల్లి, కలియబెట్టి వేడివేడిగా అన్నంతో పాటు వడ్డించాలి.