గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By Selvi
Last Updated : సోమవారం, 25 మే 2015 (18:41 IST)

హెల్దీ బ్రేక్ ఫాస్ట్: ఎగ్ పరోటా!

బ్రేక్ ‌ఫాస్ట్‌లో తప్పకుండా ఎగ్ తీసుకోండి. ఎప్పుడూ ఎగ్ దోసె, ఆమ్లెట్ అంటూ బోర్ కొట్టకుండా ఎగ్ పరోటా ట్రై చేయండి. దినచర్యను ఒక ఎగ్‌తో బ్రేక్ ఫాస్ట్‌తో ప్రారంభించినట్లైతే, ఆరోజంతటికీ సరిపడే, ఎనర్జీని మీరు పొందగలుగుతారు. ఎగ్ ద్వారా ఎనర్జీ లెవల్స్ మాత్రమే కాదు క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా గర్భిణీ మహిళలకు అవసరం అయ్యే క్యాల్షియం గుడ్డు నుండి పుష్కలంగా అందుతుంది. ఈ ఎగ్ పరోటా రిసీపీ ఎలా చేయాలో చేద్దాం.. 
 
కావల్సిన పదార్థాలు: 
గోధుమ పిండి- రెండు కప్పులు 
గుడ్లు- నాలుగు
నూనె, ఉప్పు, బటర్ - తగినంత 
 
తయారీ విధానం :
ముందుగా గోధుపిండిని కొన్ని నీళ్ళు పోసి కలిపి పెట్టుకోవాలి. తలిపి పెట్టుకున్న పిండికి పల్చని తడిగా ఉండే క్లాత్‌ను కప్పి అరగంట పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత గోధుమపిండిని చపాతీల్లా వత్తుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా వత్తుకొన్న చపాతీ మీద కొద్దిగా నూనె చిలకరించి చపాతీ మొత్తం స్ప్రెడ్ చేసి నచ్చిన షే‌ప్‌లో రోల్ ఫోల్డ్ చేసుకోవాలి. తిరిగి మరికొద్దిగా నూనె ఉపయోగించి తవాను వేడి చేసి, చపాతీని పాన్ మీద వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. 
 
కాలేటప్పుడు, చపాతీపై పొరలాగా తీసి నిధానంగా దాని మీద గుడ్డు పగులగొట్టి పోయాలి. ఇప్పుడు మరికొద్దిగా నూనెను చిలకరించి గోల్డ్ కలర్ వచ్చే వరకూ రెండు వైపులా కాల్చుకోవాలి. అదేవిధంగా పిండి మొత్తాన్ని మీకు కావల్సినన్ని ఎగ్ పరోటాలను తయారుచేసుకోవాలి. అంతే హెల్తీ బ్రేక్ ఫాస్ట్ కోసం ఎగ్ పరోటా రిసిపి రెడీ..