శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By Kowsalya
Last Updated : సోమవారం, 4 జూన్ 2018 (12:53 IST)

ఫిష్ 65 ఎలా చేయాలో తెలుసా?

చేపలు ఉత్తమ పోషకాల్ని అందిస్తాయి. గుండెజబ్బుతో బాధపడుతున్నవారు చేపల్ని తినడం మంచిది. ఇవి గుండెజబ్బులను కలిగించవు. చేపల్లో మంచి క్రొవ్వులు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉంటుంది. గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలను నివారించడానికి ఫిష్ తినడం చాలా అవసరం. చేపల

చేపలు ఉత్తమ పోషకాల్ని అందిస్తాయి. గుండెజబ్బుతో బాధపడుతున్నవారు చేపల్ని తినడం మంచిది. ఇవి గుండెజబ్బులను కలిగించవు. చేపల్లో మంచి క్రొవ్వులు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉంటుంది. గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలను నివారించడానికి ఫిష్ తినడం చాలా అవసరం. చేపలు తినడం వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని తగ్గిస్తుంది.
 
సూక్ష్మ పోషకాలైన విటమిన్‌ ఎ, డి చేపల్లో పుష్కలంగా ఉండడం వలన ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతాయి. థయామిన్‌, రిబోఫ్లేవిన్‌, నియోసిన్లు చేపల్లో అధికంగా ఉంటాయి. ఆకుకూరల ద్వారా లభించే విటమిన్‌ ఎ కన్నా చేపల్లో ఉన్న విటమిన్‌ ఎ తేలిగ్గా అందుతుంది. ఇది కంటిచూపును మెరుగుపరిచేందుకు దోహపడుతుంది. ఇక రుచికరమైన ఫిష్ 65 ఎలా చేయాలో చూద్దాం...
 
కావలసిన పదార్థాలు :
చేప ముక్కలు : ఆరు 
పెప్పర్ : చిటికెడు 
గుడ్లు : రెండు 
మైదా : రెండు టేబుల్ స్పూన్లు 
అల్లం వెల్లుల్లి పేస్ట్ : 1 స్పూన్ 
కారం : 2 స్పూన్స్ 
గరం మసాలా పౌడర్ : 1 స్పూన్
ధనియాల పొడి : కొద్దిగా 
ఉప్పు,నూనె : తగినంత 
 
తయారీ విధానం : 
ముందుగా శుభ్రం చేసుకున్న చేపముక్కల్ని ఓ బౌల్‌లోకి తీసుకుని నూనె తప్ప పైన తెలిపిన అన్నీ పదార్థాలను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తరువాత అందులో గుడ్డులోని పచ్చసొనను వేసి బాగా మిక్స్ చేయాలి.  ఇలా చేసిన తరువాత ఆ చేపముక్కలను అరగంట పాటు ఫ్రిజ్‌లో పెడితే మరింత టేస్ట్ ఉంటాయి. అరగంట తరువాత ఆ చేపముక్కలను తీసుకుని డీప్ ఫ్రైచేయడానికి పాన్‌లో నూనె పోసి వేడయ్యాక చేప ముక్కలను నూనెలో వేసి అతి తక్కువ మంట మీద ఇరువైపులా దోరగా వేపుకోవాలి. అంతే ఫిష్ 65 రెడీ.