గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By
Last Updated : శనివారం, 17 నవంబరు 2018 (14:45 IST)

చికెన్ మంచూరియా ఎలా చేయాలంటే..?

చికెన్ శరీర వేడిని పెంచుతుందని కొందరి నమ్మకం. దీని వలన చాలామంది అంతగా చికెన్ తీసుకోవడానికి ఇష్టపడరు. చికెన్‌లోని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే.. తప్పకుండా తినాలనిపిస్తుందని నిపుణులు చెప్తున్నారు. మరి అవేంటో ఓసారి పరిశీలిద్దాం..
 
చికెన్ చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించి అధిక బరువును తగ్గిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు చికెన్ చాలా ఉపయోగపడుతుంది. చికెన్‌లోని ప్రోటీన్స్, న్యూట్రియన్స్ వంటి పదార్థాలు శరీరానికి కావలసిన ఎనర్జీని అందిస్తాయి. కొందరు చిన్న వయస్సులోని కంటి సమస్యలతో బాధపడుతుంటారు. అందుకు చెక్ పెట్టాలంటే.. చికెన్ తీసుకుంటే మంచిది. చికెన్ రోజూ తీసుకోవడం అంత మంచిది కాదు. కనుక వారంలోని ఒకటి రెండుసార్లు తీసుకుంటే ఫలితం ఉంటుంది. ఇటువంటి చికెన్ మంచూరియా ఎలా చేయాలో చూద్దాం..
 
కావలసిన పదార్థాలు:
చికెన్ - 350 గ్రా
గుడ్లు - 2
మెుక్కజొన్నపిండి - 2 స్పూన్స్
ఉప్పు, మిరియాల పొడి - 2 సూన్స్
వెనిగర్ - 1 స్పూన్
సోయాసాస్ - కొద్దిగా
అల్లం వెల్లుల్లి తరుగు - కొద్దిగా
పచ్చిమిర్చి - 2
చికెన్ ఉడికించిన నీరు - 1 కప్పు
నీళ్లు - పావుకప్పు
ఉల్లికాడలు - 1 కట్ట
నూనె - సరిపడా. 
 
తయారీ విధానం:
ముందుగా గుడ్డులోని తెల్లసొన తీసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రంలో చికెన్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనెను పోసి వేడయ్యాక ఆ చికెన్ ముక్కలు వేసి వేయించుకోవాలి. అదే బాణలిలో కొద్దిగా నూనెను తీసి అల్లం వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి, ఉల్లికాడలు వేసి వేయించి ఆ తరువాత చికెన్ ఉడికించిన నీరు అందులో పోసి మెుక్కజొన్న పిండి, ఉప్పు, మిరియాల పొడి, వెనిగర్ వేసి బాగా కలిపి 5 నిమిషాల పాటు ఉడికించి ముందుగా తయారుచేసున్న చికెన్ ముక్కలు వేసి కలుపుకోవాలి. అంతే... చికెన్ మంచూరియా రెడీ.