శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By Kowsalya
Last Updated : శుక్రవారం, 7 సెప్టెంబరు 2018 (13:40 IST)

సేమియాతో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో తెలుసా?

కావలసిన పదార్థాలు: సేమియా - అర కేజి నిమ్మకాయ - 1 చికెన్ ‌- అర కేజి పచ్చిమిర్చి - 10 గ్రాములు దాల్చిన చెక్క - 1 లవంగాలు - 6 ఉల్లిపాయలు - 2 నూనె - తగినంత కొత్తిమీర - 6 రెబ్బలు అల్లం వెల్లుల్లి

కావలసిన పదార్థాలు: 
సేమియా - అర కేజి 
నిమ్మకాయ - 1 
చికెన్ ‌- అర కేజి 
పచ్చిమిర్చి - 10 గ్రాములు 
దాల్చిన చెక్క - 1 
లవంగాలు - 6 
ఉల్లిపాయలు - 2 
నూనె - తగినంత
కొత్తిమీర - 6 రెబ్బలు 
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 20 గ్రాములు 
ఉప్పు- తగినంత 
బిర్యానీ ఆకులు - 10 గ్రాములు 
యాలకులు -2
జీడిపప్పు - 200 గ్రాములు
పసుపు - చిటికెడు 
 
తయారీ విధానం:
ముందుగా బాణలిలో నీళ్లు పోసుకుని అందులో సేమియా వేసి కొద్దిగా నిమ్మరసం, నూనె వేసుకుని 5 నిమిషలా పాటు ఉడికించాలి. ఆ తరువాత సేమియాను తడి బట్టతో వడగట్టాలి. నీరంతా పోయిన తరువాత సేమియాను ఒక ప్లేటులోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మరో బాణలిలో కొద్దిగా నూనె వేసి శుభ్రంగా కడిగి ఉంచుకున్న చికెన్‌ ముక్కలను అందులో వేసి చిన్న మంటపై 5 నిమిషాలు ఉడికించాలి.

లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, పసుపు అన్ని కలిపి మిక్సీలో వేసి పొడి చేసి పెట్టుకోవాలి. ఈ పొడి చికెన్‌పై చల్లుకుని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. చిన్న మంటపై మరో 5 నిమిషాలు చికెన్‌ను ఉడికించి ఆపై సేమియా కూడా వేసి మళ్ళీ బాగా కలుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమానికి తగినంత ఉప్పు, కొత్తిమీర ఆకులు, బిర్యానీ ఆకు, జీడిపప్పు వేసి బాగా కలిపి దించేయాలి. అంతే... సేమియా చికెన్‌ బిర్యానీ రెడీ.