శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By Selvi
Last Updated : మంగళవారం, 7 ఏప్రియల్ 2015 (16:28 IST)

మీట్ బాల్స్ నూడిల్స్ ఎలా చేయాలి?

మటన్‌‍లో బీ గ్రూప్ విటమిన్స్ పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ కె. ప్రోటీన్స్, నేచురల్ ఫ్యాట్, అమినో యాసిడ్స్ ఉన్నాయి. ఇవి కొలెస్ట్రాల్ లెవల్స్‌ను బ్యాలెన్స్ చేస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. క్యాన్సర్ రిస్క్‌ను తగ్గిస్తాయి. అలాంటి మటన్ మీట్‌తో టేస్టీ నూడిల్స్ ట్రై చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు : 
మటన్ - పావు కేజీ 
ఆలివ్ ఆయిల్ - రెండు టీ స్పూన్లు 
ఉడికించిన నూడిల్స్ - ఒక కప్పు 
జీలకర్ర - అర టీ స్పూన్ 
పచ్చిమిర్చి తరుగు- ఒక టీ స్పూన్ 
వెల్లుల్లి అల్లం పేస్ట్ - రెండు టీ స్పూన్లు
ఆవాలు - అర టీ స్పూన్
మిరియాల పొడి - కొద్దిగా 
చీజ్ - టేబుల్ స్పూన్ 
బేసిల్ ఆకులు - 10 
ఉప్పు - తగినంత 
 
తయారీ విధానం : 
మటన్‌కి కొద్దిగా ఉప్పు జత చేసి ఉడికించాలి. వీటిని ఉండలుగా చేసి నూనెలో గోధుమ రంగులోకి వచ్చేంత వరకు వేయించాలి. బాణలిలో నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి తరుగు, వెల్లుల్లి వేసి వేయించాలి. ఉల్లి తరుగు, టొమాటా తరుగు జత చేయాలి. టొమాటా ముక్కలు మెత్తబడ్డాక ఉడికించిన న్యూడిల్స్ చేర్చి.. మీట్ బాల్స్, ఉప్పు వేసి కలపాలి. తర్వాత చీజ్ వేసి బాగా కలపాలి. మిరియాల పొడి చల్లి మరోసారి కలిపి వేడివేడిగా సర్వ్ చేయాలి.