మటన్ కర్రీ ఎలా చేయాలి?  
                                       
                  
				  				  
				   
                  				  మటన్‌లో బి విటమిన్, విటమిన్ కె, ప్రోటీన్స్, అమినో యాసిడ్స్, మినరల్స్, సోడియం, పొటాషియం పుష్కలంగా ఉంటుంది. మటన్ కొలెస్ట్రాల్ లెవల్‌ను సక్రమంగా ఉంచుతుంది. హృద్రోగ వ్యాధులను దూరం చేస్తుంది. వ్యాధినిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. అలాంటి మటన్‌తో కర్రీ ట్రై చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం.. 
				  											
																													
									  
	 
	కావలసిన పదార్థాలు : 
	మటన్ - అరకేజీ 
	దాల్చిన చెక్క, పచ్చిమిర్చి, అల్లం ముక్ పేస్ట్ - రెండు స్పూన్లు 
				  
	కొబ్బరి పాలు - అర కప్పు, 
	మిరియాల పొడి - ఒక టీ స్పూన్
	నూనె, ఉప్పు - తగినంత 
				  																								
	 
 
 
  
	
	
																		
									  
	 
	నానబెట్టేందుకు.. అల్లం వెల్లుల్లి పేస్ట్.. ఒక టీ స్పూన్
	నిమ్మరసం - ఒక టీ స్పూన్
				  																		
											
									  
	ఉప్పు - తగినంత 
	 
	తయారీ విధానం : 
	ముందుగా శుభ్రం చేసుకున్న మటన్ ముక్కలకు ఉప్పు, అల్లం-వెల్లుల్లి పేస్టు నిమ్మరసం కలిపి 20 నిమిషాలసేపు నానబెట్టాలి. నూనె వేడిచేసి దాల్చినచెక్క, పచ్చిమిర్చి, కరివేపాకు ముక్కలు వేసి రెండు నిమిషాలు వేయించి, ఉల్లి, టమోటా అరకప్పు చేర్చి వేగాక మటన్ ముక్కల్ని బాగా ఉడికించాలి. 
				  																	
									  
	 
	తర్వాత కొబ్బరి పాలు పోసి మాంసాన్ని మెత్తగా ఉడక నివ్వాలి. తర్వాత మిరియాలపొడిని కలపాలి. ఉప్పు వేసి మరో ఐదు నిమిషాలు ఉడికించి, వేడివేడిగా వడ్డించాలి.