శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By Selvi
Last Updated : శనివారం, 24 అక్టోబరు 2015 (15:09 IST)

పాలకూరతో ఎగ్ ఆమ్లెట్ ఎలా చేయాలి.?

పాలకూర, కోడిగుడ్డులో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ రెండింటి కాంబినేషన్‌లో ఎగ్ ఆమ్లెట్ ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావాల్సిన పదార్థాలు
కోడిగుడ్డు : రెండు 
ఉల్లిపాయ తరుగు : నాలుగు స్పూన్లు 
గరం మసాలా: చిటికెడు
పెప్పర్‌ పౌడర్‌ : చిటికెడు
ఉప్పు, నూనె : తగినంత 
పాలకూర తరుగు : నాలుగు స్పూన్లు 
పచ్చిమిర్చి తరుగు : రెండు టీ స్పూన్లు 
అల్లం వెల్లుల్లి ముద్ద:  పావు టీ స్పూన్ 
 
తయారీ విధానం:
ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి వేడయ్యాక చెంచా నూనె వేయాలి. అందులో ఉల్లిపాయ, పాలకూర, పచ్చిమిర్చి తరుగు వేసి వేపుకోవాలి. అల్లంవెల్లుల్లి ముద్ద వేసి  వేపుకుని పాన్‌ను దించేయాలి. ఒక గిన్నెలో ఉప్పు, మిరియాల పొడి, గరం మసాలా పొడి, చెంచాడు నీళ్లు వేసి కలిపి వేయించిన ఉల్లి, పాలకూర మిశ్రమం వేసి కలపాలి. ఇందులో గుడ్లు వేసి బాగా నురగ వచ్చేలా గిలక్కొట్టాలి. ఇందాకటి పాన్‌లో మిగతా నూనె వేసి వేడయ్యాక గుడ్డు మిశ్రమంతో కొద్దిగా మందంగా ఆమ్లెట్‌ వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే పాలకూరతో ఎగ్ ఆమ్లెట్ రెడీ..