శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By Selvi
Last Updated : గురువారం, 2 జులై 2015 (16:51 IST)

టేస్టీ చికెన్ లాలీ పాప్స్ ఎలా చేయాలి

చికెన్‌లోని విటమిన్ బీ3 మెటబాలిజం ప్రక్రియను మెరుగుపరుచుకోవచ్చు. ఇందులోని బీ6 వ్యాధినిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. చక్కెర స్థాయుల్ని నియంత్రిస్తుంది. రక్త కణాల వృద్ధికి చికెన్‌లోని విటమిన్ బి7 ఎంతగానో సహాయపడుతుంది. చికెన్‌లో ఐరన్, జింక్‌లు కూడా ఉన్నాయి. ఈ గుడ్ హెల్త్ బెనిఫిట్స్ కలిగిన చికెన్‌తో టేస్టీ లాలీ పాప్స్ ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు :
చికెన్ లాలీ పాప్స్ ముక్కలు - పావు కేజీ 
షేన్‌వాన్ సాస్  - రెండు స్పూన్లు 
నిమ్మరసం - అర కప్పు  
పసుపు పొడి - ఒక స్పూన్ 
అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ - రెండు స్పూన్లు 
చాట్ మసాలా పౌడర్ - ఒక స్పూన్ 
ఎండు మిర్చి పౌడర్- ఒక స్పూన్ 
ఉప్పు, నూనె - తగినంత 
పెరుగు - ఒక కప్పు 
 
తయారీ విధానం ముందుగా చికెన్ లాలీ పాప్స్‌కు శుభ్రం చేసిన చికెన్ ముక్కలకు నిమ్మరసం, అల్లం, వెల్లుల్లి, గ్రీన్ చిల్లీ పేస్ట్, షేన్‌వాన్ సాస్, పెరుగు, పసుపు పొడి, ఎండు మిర్చి పౌడర్, ఉప్పు చేర్చి బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ ముక్కలకు బాగా మసాలా అంటాక 10-20 నిమిషాల పాటు చికెన్‌ను మ్యారినేట్ చేసుకోవాలి. పాన్‌లో నూనె వేసి వేడయ్యాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలను బాగా దోరగా ఉడికేంత వరకు నూనెలో వేపుకోవాలి. వీటిని సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుని లెమన్ గార్నిష్‌తో టమోటా సాస్‌తో వేడి వేడిగా సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోద్ది.