వింటర్‌లో మిర్చి ఘాటుతో వెరైటీ చికెన్ గ్రేవీ..
ముందుగా ఎండుమిర్చిని నీళ్లలో వేసుకుని ఉడికించి మెత్తగా పేస్టులా చేసుకోవాలి. చికెన్ ముక్కల్ని నూనెలో వేయించుకుని తీసుకోవాలి. స్టౌ మీద బాణలి పెట్టి అందులో ఆవనూనె వేసి వేడి చేయాలి. నూనెలో ఎండుమిర్చి పేస్
అసలే వింటర్. వేడి వేడి సూప్స్, స్నాక్ మీద మనస్సు మళ్లుతుంది. ఇలాంటి సమయంలో శరీరానికి వేడినిచ్చే చికెన్‌తో.. శరీరంలోని బ్యాక్టీరియాను నశింపజేసే మిర్చి కాంబోలో వెరైటీ చికెన్ గ్రేవీ ఎలా చేయాలో చూద్దాం..
కావలసిన పదార్థాలు :
చికెన్ - అర కేజీ
ఎండు మిర్చి - ఆరు
ఆవనూనె - నాలుగు టేబుల్ స్పూన్లు
దాల్చిన చెక్క- రెండు ముక్కలు
ఏలకులు - ఐదు
శొంఠి పొడి- అర టీ స్పూన్
సోంపు పొడి- టేబుల్ స్పూన్
కారం- చెంచా
పసుపు- అర చెంచా
ఉప్పు - తగినంత
నూనె, నీరు - తగినంత
తయారీ విధానం: ముందుగా ఎండుమిర్చిని నీళ్లలో వేసుకుని ఉడికించి మెత్తగా పేస్టులా చేసుకోవాలి. చికెన్ ముక్కల్ని నూనెలో వేయించుకుని తీసుకోవాలి. స్టౌ మీద బాణలి పెట్టి అందులో ఆవనూనె వేసి వేడి చేయాలి. నూనెలో ఎండుమిర్చి పేస్ట్, కారం వేసుకోవాలి. నిమిషం తర్వాత నీళ్లు పోసి.. అందులో చికెన్ తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి దోరగా వేపాలి. అన్నీ బాగా వేగాక.. చికెన్ ముక్కలు తగినంత నీరు పోసుకోవాలి. నీరు సగం అయ్యాక చికెన్ గ్రేవీలా అయ్యేంత వరకు ఉంచి దించేస్తే సరిపోతుంది. ఈ చికెన్ కూరను వేడి వేడి అన్నంలోకి లేదా రోటీల్లోకి తీసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది.