శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. మాంసాహారం
Written By Selvi
Last Updated : శనివారం, 25 అక్టోబరు 2014 (19:50 IST)

వీకెండ్ స్పెషల్ : ఈజీ డిష్ బట్టర్ చికెన్ ట్రై చేయండి.

ఈ వీకెండ్ స్పెషల్ ఈజీ డిష్ బట్టర్ చికెన్ ట్రై చేయండి. ఆదివారంనాడు వేడి వేడి బిర్యానీతో బట్టర్ చికెన్ సైడ్ డిష్‌గా వడ్డించండి. పిల్లల పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడే జింక్, విటమిన్ ఇ... చికెన్‌లో ఉన్నాయి. విటమిన్ బి6 బి12 చికెన్‌లో పుష్కలంగా ఉన్నాయి. అందుచేత చికెన్‌తో ఈ వీకెండ్ ఎంజాయ్ చేయండి. బట్టర్ చికెన్ ఎలా చేయాలో చూద్దాం..
 
కావల్సిన పదార్థాలు: 
బోన్‌లెస్ చికెన్: అరకేజీ 
ఉల్లిపాయ పేస్ట్ : అరకప్పు
టమోటా గుజ్జు : అరకప్పు 
పసుపు పొడి: ఒక టీ స్పూన్ 
కారం పొడి: ఒక టీ స్పూన్ 
ధనియాల పొడి: ఒక టీ స్పూన్ 
మెంతుల పొడి: ఒక టేబుల్ స్పూన్ 
ఉప్పు: రుచికి సరిపడా
టమోటో సాస్: ఒక టేబుల్ స్పూన్ 
అల్లం-వెల్లుల్లి పేస్ట్: ఒక టేబుల్ స్పూన్ 
బట్టర్: రెండు టీ స్పూన్లు
కొత్తిమీర తరుగు: సరిపడినంత 
 
తయారీ విధానం :
స్టౌ మీద కుక్కర్‌లో పాత్ర పెట్టి వేడయ్యాక బట్టర్ వేసి హీట్ చేయాలి. అందులో ఉల్లిపాయ పేస్ట్ వేసి దోరగా వేపుకోవాలి. తర్వాత శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలు వేసి ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి. అందులో టమోటో గుజ్జు, పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఇందులో టమోటో సాస్ మెంతి పౌడర్ కూడా చేర్చి బాగా మిక్స్ చేస్తూ ఉడికించుకోవాలి. అందులో వేడి నీరు పోసి, మొత్తం కలగలిపి, మూత పెట్టి, చికెన్ ముక్కలు మెత్తబడే వరకూ మీడియం మంట మీద ఉడికించుకోవాలి.
 
మూడు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించి, తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. కుక్కర్‌లో ఆవిరి మొత్తం తగ్గే వరకూ అలాగే ఉంచి, కొద్దిసేపటి తర్వాత మూత తీసి చికెన్ మొత్తం ఉడికిందో లేదో తెలుసుకోవాలి. తర్వాత బౌల్‌లోకి తీసుకుని బటర్ చికెన్‌ను కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే బటర్ చికెన్ రెడీ. ఈ రుచికరమైన బటర్ చికెన్ రైస్ లేదా పరోటాలకు చాలా టేస్టీగా ఉంటుంది.