Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రత్నాకర్ సెట్టిపల్లి కుటుంబానికి నాట్స్ అండ... 13 వేల డాలర్ల ఆర్థిక సహాయం

మంగళవారం, 6 జూన్ 2017 (16:41 IST)

Widgets Magazine

డల్లాస్: అమెరికాలోని తెలుగు వారికి నాట్స్ హెల్ప్ లైన్ ద్వారా ఎల్లపుడు అందుబాటులో ఉండే నాట్స్ గత నవంబరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రత్నాకర్ సెట్టిపల్లి మరియు అతని కుటుంబ సభ్యుల వైద్య సహాయం కొరకు వేల డాలర్ల నిధులను సమీకరించింది. 
NATS-helping
 
గత ఆదివారం ఇర్వింగ్ నగరంలోని 'బిర్యానీ అండ్ మోర్' రెస్టారెంట్లో 13 వేల డాల్లర్ల చెక్‌ను నాట్స్ హెల్ప్ లైన్ టీం స్థానిక టెక్సాస్ స్టేట్ హౌస్ ప్రతినిధి, మాట్ రినాల్డి సమక్షంలో రత్నాకర్ సెట్టిపల్లి మరియు అతని కుటుంబ సభ్యులకు అందజేయటం జరిగింది. రత్నాకర్ సెట్టిపల్లి మరియు అతని కుటుంబ సభ్యులు మాట్లాడుతూ నాట్స్ అండతో తమ కుటుంబం కొంత కోలుకునే అవకాశం లభించిందని, నాట్స్ అందించిన సహాయానికి చాలా కృతజ్ఞతలు తెలియచేశారు.
 
ఈ సందర్భంగా స్టేట్ హౌస్ రెప్రెజంటేటివ్ మాట్ రినాల్డి మాట్లాడుతూ నాట్స్ సంస్థ తన హెల్ప్ లైన్ ద్వారా చేస్తున్న సేవలను కొనియాడారు. నాట్స్ వైస్ ప్రెసిడెంట్ బాపు నూతి మాట్లాడుతూ రత్నాకర్ సెట్టిపల్లి కుటుంబానికి జరిగిన నష్టం చాలా  బాధాకరమని, వారి కుటుంబానికి నాట్స్ సంస్థ ఎలాంటి సహాయం కావాల్సినా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. 
NATS-helping
 
ఇంకా ఈ కార్యక్రమంలో నాట్స్ బోర్డు డైరెక్టర్స్ డాక్టర్ చౌదరి ఆచంట మరియు రాజేంద్ర మాదాల, నాట్స్ హెల్ప్‌లైన్ ముఖ్య కార్యకర్తలు ఆది గెల్లి మరియు బాపు నూతి, డల్లాస్ చాప్టర్ కో-ఆర్డినేటర్ రామకృష్ణ మార్నేని, మహిళా విభాగం కో-ఆర్డినేటర్  జ్యోతి వనం, నాట్స్ డల్లాస్ ముఖ్య సభ్యులు కిషోర్ వీరగంధం, రాజా మాగంటి, రవి బొజ్జురి, కిరణ్ మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
13 Help Nats 000 Dollars Usa Road Accident Ratnakar Settipalli Family

Loading comments ...

ఎన్.ఆర్.ఐ.

news

డల్లాస్‌లో తమ్మారెడ్డి అభిమానుల ఆత్మీయ సమావేశం

ప్రముఖ దర్శకుడు నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ అమెరికా పర్యటన సందర్భంగా డల్లాస్‌లో గుంటూరు ...

news

లండన్‌లో ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది సంబరాలు

ఉస్మానియా విశ్వవిద్యాలయం 100 సంవత్సరాల పూర్తి సందర్భంగా లండన్‌లో ఉస్మానియా ...

news

"అమెరికాలో షిరిడీ" నిర్మాణం... షిరిడీ నిర్మాణ ఆకృతుల కోసం 'లగాన్' ఆర్ట్ డైరక్టర్

"అమెరికాలో షిరిడీ" నిర్మాణమనే మహాసంకల్పంతో అడుగులు వేస్తున్న న్యూజెర్సీలో సాయిదత్త పీఠం.. ...

news

బే ఏరియాలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) ఆత్మీయ సమావేశం

భాషే రమ్యం సేవే గమ్యం నినాదంతో దూసుకుపోతూ తెలుగు ప్రజలందరికి చేరువైన నాట్స్ ...

Widgets Magazine