శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 25 జూన్ 2020 (22:23 IST)

నైట్ షిఫ్ట్ అధికారులకు నాట్స్ భోజనం, కరోనాపై ముందుండి పోరాడే వారికి ప్రోత్సాహం

టెంపాబే: అమెరికాలో కరోనాపై ముందుండి పోరాడుతున్న వారిని ప్రోత్సాహించేందుకు నాట్స్ వరుసగా వారికి భోజన ఏర్పాట్లు చేసి గౌరవిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా టెంపాబేలోని పస్కో కౌంటీ షిరీఫ్ ఆఫీస్ డిస్ట్రిక్ట్2లోని నైట్ షిఫ్టు అధికారులకు నాట్స్ భోజనం ఏర్పాటు చేసింది. నాట్స్ టెంపాబే నాయకత్వం దాదాపు 50 మందికి భోజన ప్యాకెట్లు సిద్ధం చేసి వారి కార్యాలయంలో అందించింది.
 
కరోనాపై పోరులో కౌంటీ అధికారుల శ్రమను గుర్తించి ఇలా భోజనాలు అందించినందుకు కౌంటీ కమిషనర్ మైక్ మూరే నాట్స్‌ను అభినందించారు. ఇలాంటి కష్టకాలంలో ఇంత మంచి కార్యక్రమాలు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.. దీంతో పాటు నాట్స్ పకో కౌంటీలోని రెండు ఫైర్ స్టేషన్లు, పస్కో కౌంటీల్లో రెండు ఫైర్ స్టేషన్లలో 50 మంది సిబ్బందికి కూడా భోజన ప్యాకెట్లు అందించి వారిని ప్రోత్సాహించే ప్రయత్నం చేసింది.
 
రమ్య పిన్నమనేని, విజయ్, ఫణి దలయ్, సోమంచి కుటుంబం, డాక్టర్ పూర్ణ, తార బిక్కసాని, డాక్టర్ సుదర్శన్, రమ కామిశెట్టిలు ఈ ఆహారాన్ని అందించేందుకు అధిక సాయం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో నాట్స్ నాయకులు శ్రీనివాస్ గుత్తికొండ, ప్రశాంత్ పిన్నమనేని, శ్రీనివాస్ మల్లాది, రాజేశ్ కాండ్రు, ప్రసాద్ ఆరికట్ల, సతీశ్ పాలకుర్తి, నగేష్ నాయక్ తదితరులు కీలక పాత్ర పోషించారు.