శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 14 జూన్ 2021 (21:20 IST)

తెలుగు విద్యార్ధుల కోసం నాట్స్ వెబినార్: నాట్స్ టెంపాబే విభాగం ఆధ్వర్యంలో నిర్వహణ

అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. తాజాగా తెలుగు విద్యార్ధుల కోసం వెబినార్ నిర్వహించింది. నాట్స్ టెంపాబే విభాగం ఆధ్వర్యంలో ది పాత్ టూ మెడికల్ స్కూల్ పేరిట నిర్వహించిన ఈ వెబినార్ మిడిల్, హైస్కూల్ విద్యార్ధులకు ఎన్నో విలువైన సూచనలు చేసింది.
 
 ముఖ్యంగా వైద్య కార్యక్రమాలు పాఠశాలల్లో ఎంత కీలకంగా మారాయి. వాటిని అసలు ఎలా అర్థం చేసుకోవాలనే అంశాలపై ఈ వెబినార్ ద్వారా అవగాహన కల్పించారు. యూనివర్సీటీ ఆఫ్ కన్సల్టెంట్ ఆఫ్ అమెరికా  సీఈఓ మిస్టర్ రాబర్ట్ లెవిన్ ఈ వెబినార్‌లో విద్యార్ధుల సందేహాలను నివృత్తి చేశారు. ముఖ్యంగా విద్యార్ధులు MCAT స్కోరు ఎలా సాధించాలి. ఇందులో ఉండే అంశాలను ఎలా వ్రాయాలనే దానిపై అవగాహన కల్పించారు.
 
 ప్రొగ్రామ్ అడ్మిషన్ల విషయంలో MCAT స్కోరు చాలా కీలకమని అందుకే ఈ విషయంలో మరింత నాలెడ్జ్ సంపాదించాలని విద్యార్ధులకు సూచించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ విషయంలో ఎలా సిద్ధం చేయాలనేది లెవిన్ వివరించారు. ఈ వెబినార్‌కు నాట్స్ బోర్డ్ డైరెక్టర్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ మల్లాదిలు అనుసంధానకర్తలుగా వ్యవహారించారు. దాదాపు 200 మందికి పైగా తెలుగు వారు ఈ వెబినార్ ద్వారా తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. విద్యార్ధుల కెరీర్ ఎంపికకు ఇలాంటి వెబినార్‌ ఎంతో దోహదం చేస్తుందని తెలుగువారు నాట్స్ పై ప్రశంసల వర్షం కురిపించారు.
 
ఈ వెబినార్ నిర్వహణలో నాట్స్ బోర్డు మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ గుతికొండ, నాట్స్ జోనల్ ప్రెసిడెంట్ రాజేష్ కాండ్రు, నాట్స్ ఎగ్జిక్యూటివ్ వెబ్ సెక్రటరీ సుధీర్ మిక్కిలినేని, నాట్స్ టెంపాబే  సమన్వయకర్త  ప్రసాద్ ఆరికట్ల, జాయింట్ కోఆర్డినేటర్  సురేశ్‌తో పాటు నాట్స్ టీమ్ సభ్యులు కీలక పాత్ర పోషించారు.
 
ఈ వెబినార్‌కు సహకరించినందుకు నాట్స్ బోర్డు చైర్మన్ శ్రీధర్ అప్పసాని, నాట్స్  అధ్యక్షుడు శేఖర్ అన్నే, నాట్స్ నాయకుడు రవి గుమ్మడిపూడి, శ్రీనివాస్ కాకుమను, రంజిత్ చాగంటి, మురళి మేడిచెర్ల తదితరులకు నాట్స్ టెంపాబే విభాగం కృతజ్ఞతలు తెలిపింది.