1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 23 జనవరి 2017 (21:40 IST)

ఇంగ్లాండ్ ప్రవాస తెలంగాణ తెలుగు కేలండర్ ఆవిష్కరణ

ఈ రోజు (23/01/2016) సాంస్కృతిక సారథి భవన్ (మాదాపూర్‌లో) శ్రీ సాంస్కృతిక సారథి చైర్మన్ శ్రీ రసమయి బాలకిషన్ గారిచే తెలంగాణ NRI ఫోరమ్ (TeNF) వారి 2017 తెలుగు కేలండర్ ఆవిష్కరించారు. మొట్టమొదటిసారిగా NRIలు మొదటి తెలుగు కేలండర్ ఆవిష్కరించడం అభినందనీయం

ఈ రోజు (23/01/2016) సాంస్కృతిక సారథి భవన్ (మాదాపూర్‌లో) శ్రీ సాంస్కృతిక సారథి చైర్మన్ శ్రీ రసమయి బాలకిషన్ గారిచే    తెలంగాణ NRI  ఫోరమ్ (TeNF) వారి 2017 తెలుగు కేలండర్ ఆవిష్కరించారు. మొట్టమొదటిసారిగా NRIలు మొదటి తెలుగు కేలండర్  ఆవిష్కరించడం అభినందనీయం అని సారథి చైర్మన్ బాలకిషన్‌గారు కొనియాడారు. 
 
కేలండర్ తెలంగాణ సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాల చిత్రాలు పెట్టి ప్రముఖ పంచాంగ సిద్ధాంతి గారిచే రాయబడిన తెలుగు పండుగలు, వారాలు, ఫలాలు, పుణ్యకాలాలు, రాహు కాలము, వర్జ్యాలు, గ్రహణాలతో కూడిన మన సాంప్రదాయ కేలండర్ ఆవిష్కరించడం ఇదే మొదటిసారి. 
 
విదేశాల్లో తెలంగాణ భాష, సాంస్కృతి, సాంప్రదాయాలని వ్యాప్తిలో భాగంగా తెలుగు కేలండర్‌ని పరిచయం చేస్తున్నామని TeNF సంస్థ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో TeNF సభ్యుడు వంగ అజయ్ గౌడ్‌తో పాటు TeNF  ఇండియా కో-ఆర్డినేటర్స్ సిక్కా శ్రీధర్ గౌడ్ న్యాయవాది శశాంక్, ఓం ప్రకాష్‌లు క్యాలెండర్ ఆవిష్కరణలో పాల్గొన్నారు.