Widgets Magazine

సెప్టెంబరు 10 నుంచి సెప్టెంబరు 16,2017 వరకూ మీ వార రాశి ఫలితాలు(వీడియో)

శనివారం, 9 సెప్టెంబరు 2017 (18:53 IST)

Widgets Magazine

కర్కాటకంలో శుక్ర, రాహువులు, సింహంలో కుజ, బుధ, రవి, కన్యలో బృహస్పతి, వృశ్చికంలో శని, మకరంలో కేతువు. మేష, వృషభ, మిథున, కర్కాటకంలో చంద్రుడు. 12న బృహస్పతి తుల యందు, 15న శుక్రుడు, 16న రవి కన్య యందు ప్రవేశం. 12 నుంచి కావేరి నది పుష్కరాలు.
 
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం 
ఈ వారం కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. బాధ్యతలు, వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. కొంత మొత్తం ధనం అందుతుంది. మానసికంగా కుదుటపడతారు. పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. పనులు హడావుడిగా సాగుతాయి. ప్రముఖుల కలయిక సాధ్యం కాదు. శకునాలు పట్టించుకోవద్దు. ఆశాదృక్పథంతో వ్యవహరించండి. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆరోగ్యం సంతృప్తికరం. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు, ఒత్తిడి, పనిభారం. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో నిలదొక్కుకుంటారు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు 
గృహమార్పు యత్నం సత్ఫలితాలనిస్తుంది. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. త్వరలో శుభవార్త వింటారు. రుణ బాధలు తొలగిపోతాయి. ఆది, సోమవారాల్లో ఒక వ్యవహారం స్వయంగా చూసుకోవాలి. బంధువుల వ్యాఖ్యలు మనస్తాపం కలిగిస్తాయి. అభియోగాలను పట్టించుకోవద్దు. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆత్మీయులతో సంప్రదింపులు జరుపుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. వృత్తి ఉపాధి పథకాల్లో రాణిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ప్రైవేట్ సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు. పరిచయాలు ఉన్నతికి దోహదపడతాయి. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. ఏకపక్ష నిర్ణయం తగదు. మీ శ్రీమతి సలహా పాటించండి. అవకాశాలు కలిసివస్తాయి. ఖర్చులు విపరీతం. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. మంగళ, బుధవారాల్లో ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలు, ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. హోల్ సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు ఉన్నత పదవీయోగం. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. వివాదాలు కొలిక్కివస్తాయి.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 
గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. సంప్రదింపులు ఫలిస్తాయి. వ్యవహారాల్లో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతిభకు గుర్తింపు, అవకాశాలు కలిసివస్తాయి. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. కొంత మొత్తం పొదుపు చేస్తారు. గురు, శుక్రవారాల్లో పెద్దమొత్తం ధనసహాయం తగదు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. కావలసిన వ్యక్తుల కలయిక సాధ్యం కాదు. బాధ్యతలు అప్పగించవద్దు. కొత్త విషయాలు గ్రహిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టి సారిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి నెలకొంటుంది. పెట్టుబడులకు అనుకూలం. టెండర్లు, ఏజెన్సీలు చేజిక్కించుకుంటారు. సాంకేతిక, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
పనులు ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. పరిచయస్తుల వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. విమర్శించిన వారే మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ధనలాభం, వస్త్రప్రాప్తి పొందుతారు. శనివారం నాడు చెల్లింపులు, చెక్కుల జారీలో జాగ్రత్త. వ్యాపారాలు ఊపందుకుంటాయి. వాగ్ధాటితో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. చిరువ్యాపారులకు ఆశాజనకం. నూతన పెట్టుబడులకు అనుకూలం. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. మార్కెట్ రంగాల వారికి ఆశాజనకం. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు 
ఖర్చులు అంచనాలను మించుతాయి. దుబారా వ్యయం అధికం. చేతిలో ధనం నిలబడదు. అవసరాలు, చెల్లింపులు వాయిదా పడతాయి. గృహమార్పు వల్ల ప్రయోజనం ఉండదు. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలోనే ఫలిస్తుంది. మీ శ్రీమతి సాయం అందుతుంది. ఆది, సోమవారాల్లో పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. ఆరోగ్యం సంతృప్తికరం. సంప్రదింపులు కొలిక్కి వస్తాయి. నూతన పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. విదేశీ విద్యాయత్నం ఫలించకపోవచ్చు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పనిభారం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. విందులు, వినోదాల్లో మితంగా ఉండాలి.
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు 
ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. ధనానికి ఇబ్బంది ఉండదు. అవసరాలు నెరవేరుతాయి. ఆత్మీయులకు ముఖ్య సమాచారం అందిస్తారు. సంతానం కదలికలపై దృష్టి సారించండి. అభియోగాలు, విమర్శలకు ధీటుగా స్పందిస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ఉపకారానికి ప్రత్యుపకారం పొందుతారు. మంగళ, బుధవారాల్లో పనుల్లో ఒత్తిడి, చికాకులు ఎదుర్కొంటారు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. అధికారులకు హోదామార్పు, అదనపు బాధ్యతలు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. మార్కెట్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. వ్యాపారాల్లో పురోభివృద్ధి, అనుభవం గడిస్తారు. ఆధ్యాత్మిక పట్ల ఆసక్తి నెలకొంటుంది.
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 
కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. కుటుంబీకుల ప్రోత్సాహం ఉంటుంది. గత తప్పిదాలు పునరావృతమయ్యే సూచనులున్నాయి. అప్రమత్తంగా ఉండాలి. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. ఖర్చులు భారమనిపించవు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. వాయిదా పడిన పనులు పూర్తవుతాయి. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. భేషజాలు, ఒత్తిళ్లకు లొంగవద్దు. ఆది, గురువారాల్లో మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. పదవులు, బాధ్యతల నుంచి తప్పుకుంటారు. ఉద్యోగస్తులకు అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాల్లో నిలదొక్కుకుంటారు. పెట్టుబడుల విషయంలో పునరాలోచన అవసరం. స్టాక్ మార్కెట్ రంగాల వారికి ఆశాజనకం. పుణ్యకార్యంలో పాల్గొంటారు.
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాఢ 1వ పాదం
లౌక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. అవసరాలకు ధనం అందుతుంది. చెల్లింపులు, చెక్కుల జారీలో జాగ్రత్త. అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండాలి. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. ఏకపక్ష నిర్ణయం తగదు. మంగళ, శనివారాల్లో అయిన వారే మీ వైఖరిని తప్పుపడతారు. మీ శ్రీమతి సలహా పాటించండి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. ఉద్యోగయత్నంలో నిరుత్సాహం తగదు. వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. సహోద్యోగులతో విందులు, వినోదాల్లో మితంగా ఉండాలి. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. కోర్టు వాయిదాలు చికాకుపరుస్తాయి.
 
మకరం: ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు 
ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు. సంతానం భవిష్యత్‌పై శ్రద్ధ అవసరం. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. యత్నాలు ఫలించక, పరిస్థితులు అనుకూలించక నిరుత్సాహం చెందుతారు. అవకాశాలు చేజారిపోతాయి. గురు, శుక్రవారాల్లో ఏ విషయంపై ఆసక్తి ఉండదు. కుటుంబీకుల వైఖరి అసహనం కలిగిస్తుంది. విమర్శలు పట్టించుకోవద్దు. ఆశావదృక్పథంతో వ్యవహరించండి. ఆత్మీయులతో సంప్రదింపులు జరుపుతారు. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి నెలకొంటుంది. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. దైవకార్య సమావేశాల్లో పాల్గొంటారు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు 
కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. ధనమూలక సమస్యలు ఎదురవుతాయి. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన అవసరం. సంప్రదింపులు కొలిక్కి వస్తాయి. వ్యవహరాల్లో సముచిత నిర్ణయం తీసుకుంటారు. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్య సేవలు తప్పకపోవచ్చు. శనివారం నాడు పనులు ముగింపు దశలో మందకొడిగా సాగుతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ప్రకటనల వల్ల అవగాహన ప్రధానం. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు ఉండవు. వైద్య, న్యాయ, సాంకేతిక రంగాల వారికి ఆశాజనకం. వాహన చోదకులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. 
 
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి 
పరిచయాలు ఉన్నతికి దోహదపడతాయి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. ఆదాయం సంతృప్తికరం. దైవకార్యాలు, సేవా సంస్థలకు సాయం అందిస్తారు. మీ మాటకు స్పందన లభిస్తుంది. ఊహలు, అంచనాలు ఫలిస్తాయి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. సర్వత్రా అనుకూలతలు వుంటాయి. పదవులు, టెండర్లు చేజిక్కించుకుంటారు. విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త. అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండాలి. ఆది, సోమవారాల్లో బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. వృత్తి ఉపాధి పథకాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాల నుంచి బయటపడతారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు శుభవార్తా శ్రవణం. ప్రశంసలు, సత్కారాలు అందుకుంటారు. రచయితలు, క్రీడాకారులకు ప్రోత్సాహకరం. ప్రయాణం తలపెడతారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

భవిష్యవాణి

news

శుభోదయం : ఈ రోజు రాశి ఫలితాలు 09-09-17

మేషం : ఈ రోజు ఇంజనీరింగ్ రంగాల వారికి ఊహించని సమస్యలు తలెత్తుతాయి. కొత్త పనులు ...

news

స్త్రీలకు పుట్టుమచ్చలు అక్కడ ఉంటే...

మనిషి జీవితంలో పుట్టుమచ్చలు కీలక పాత్రను పోషిస్తాయి. ప్రత్యేకంగా స్త్రీలలో ముఖ్యంగా ...

news

భార్యాభర్తలు ఒకే రాశి ఉన్న వారైతే... లాభమా..? నష్టమా...?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం భార్యాభర్తలిద్దరూ ఒకే రాశి కలిగి వుంటే శ్రేయస్కరం కాదని ...

news

శుభోదయం : ఈ రోజు రాశి ఫలితాలు 08-09-17

మేషం : దైవదర్శనాలు, పుస్తకపఠనం, ఆత్మీయుల కలయిక వల్ల మనస్సుకు ప్రశాంతత చేకూరుతుంది. ఒక ...