సోమవారం, 6 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 12 మే 2021 (19:39 IST)

అక్షయ తృతీయ రోజున కోపాన్ని పక్కనబెట్టండి..

Akshaya Tritiya
అక్షయ తృతీయ రోజున ప్రయాణాలు చేయకపోవడమే మంచిది. ఈ రోజున మీరు ఏదైనా జర్నీ ప్లాన్ చేసుకుని ఉంటే.. వాయిదా వేసుకోవడం మంచిది. అక్షయ తృతీయ రోజున మీ మనసులో ఏదైనా ప్రతికూలత ఉంటే.. దాన్ని అలాగే ఉంచండి. దాన్ని కోపం రూపంలో బయటికి రానివ్వదు. 
 
ఎందుకంటే ఈ పవిత్రమైన రోజు కోపం పడితే.. లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్లిపోతుంది. ఎవరి ఇల్లు అయితే ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుందో ఆ ఇంట్లోనే లక్ష్మీదేవి అడుగు పెడుగుతుంది  ఈరోజున మీ ఇంటిని ముఖ్యంగా పూజా మందిరాన్ని చాలా శుభ్రంగా ఉంచుకోవాలని గుర్తుంచుకోండి. 
 
ఇలా చేస్తేనే మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి.ఇంకా అక్షయ తృతీయ రోజున శ్రీ మహావిష్ణువును, తన భార్య శ్రీ మహాలక్ష్మీని విడివిడిగా పూజించకండి. ఈ పవిత్రమైన రోజున ఈ దేవుళ్లకు కలిపి పూజలు చేయాలి. దీని వల్ల మీకు, మీ కుటుంబానికి సందప, శ్రేయస్సు, ఆశీర్వాదంతో పాటు అక్షయ పుణ్యం లభిస్తుంది. 
 
అలాగే అక్షయ తృతీయ రోజున మజ్జిగ, కొబ్బరి నీళ్లు, తాగు నీరు వంటివి దానం చేస్తే పూర్వ జన్మల పాపాలు తొలగిపోతాయి. అక్షయ తృతీయ రోజున స్థోమతకు తగినంత వెండిని కొనుగోలు చేయడం ద్వారా నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. 
 
అలాగే చర్మ వ్యాధులుండవు. మానసిక ఆందోళనలు, మానసిక ఒత్తిడి తొలగిపోతాయి. 11 మందికి పెరుగన్నం దానం చేయడం ద్వారా.. అన్నానికి ఢోకా వుండదని.. భావితరాలకు అన్నపూర్ణమ్మ అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం.