సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 27 ఆగస్టు 2020 (10:43 IST)

గురువారం మహిళలు తలంటు స్నానం చేయకూడదట.. కానీ అరటి చెట్టును? (video)

Beauty
ఆర్థిక ఇబ్బందులను తొలగించుకోవాలంటే.. గురువారం పూట ఈ పనులు చేయకూడదని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. జీవితంలో కొన్ని పనులు మంచి ప్రభావాన్ని చూపించవని, ఇది ప్రతికూలతను వ్యాపింపజేస్తుందని వారు అంటున్నారు. చిన్న విషయాలు మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయో పౌరాణిక కథలలో కూడా ప్రస్తావించబడింది. అలాగే గురువారం  పూట ఇలాంటి పనులు చేయకుండా వుండటం ఉత్తమం అని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. 
 
గురువారం బృహస్పతికి ప్రీతికరమైన రోజు. ఈ గ్రహం మన శరీరానికి సంబంధించింది. ఈ రోజున ఇంటిల్లా పాది తుడిచిపెట్టే పనులు చేయకూడదు. వాస్తు ప్రకారం మన ఇంటి ఈశాన్య దిశ బృహస్పతి అని నమ్ముతారు. అలాగే, ఈ దిశ కుటుంబం, విద్య, పిల్లలకు సంబంధించినది. అందుకే ఈశాన్య దిశను గురువారం పూట పూర్తిగా తుడిచిపెట్టడం వంటివి చేయకూడదు. 
 
అలాగే గురువారం పూట మహిళలు తలంటు స్నానం చేయకూడదట. మహిళల జాతకంలో బృహస్పతి భర్త కారకం, అలాగే పిల్లల కారకం, ఈ కారణంగా బృహస్పతి గ్రహం ఆధిపత్యం వహించే గురువారం పూట తలంటు స్నానం చేయడం కూడదు. ఇలాచేస్తే శుభకార్యాలుండవని.. వ్యాధులు ఆవహిస్తాయట. ఇంకా గురువారం జుట్టు కత్తిరించకూడదని అంటారు.
 
ముఖ్యంగా గురువారం పూట మాంసాహారం తీసుకోకూడదు. జంతు హింస కూడదు. ఈ రోజున రొట్టెలను తీసుకోవడం మంచిది. ఇంకా గురువారం పూట ముదురు రంగు దుస్తులను ధరించడం కూడదు. కానీ పసుపు బట్టలు ధరించవచ్చు. గురువారం ఉదయం స్నానం చేసి ఇష్టదేవతా పూజ చేయొచ్చు. పసుపు వస్తువులు, పసుపు పువ్వులు పూజకు ఉపయోగించడం మరిచిపోకూడదు. 
Banana Tree
 
పసుపు స్వీట్లు, పసుపు బియ్యం, పసుపును సమర్పించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అరటి చెట్టును కూడా గురువారం రోజు పూజిస్తారు. అరటి చెట్టు పూజతో అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. అరటి చెట్టు వ్రేళ్ల వద్ద పసుపును నీటిని చల్లి... శెనగలు, పొడి ద్రాక్షలను అర్పించాలి.

అరటి చెట్టు వద్ద నేతి దీపం వెలిగించి హారతి ఇవ్వాలి. ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. కోరిన కోర్కెలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు.