గురువారం, 12 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 8 డిశెంబరు 2024 (14:10 IST)

Black Turmeric : అప్పుల బాధ.. ఆర్థిక సంక్షోభాన్ని నివారించే నల్ల పసుపు

Black Turmeric
ఆర్థిక సంక్షోభాన్ని నల్ల పసుపుతో నివారించవచ్చు. అప్పుల బాధలు వేధిస్తుంటే.. ఆర్థిక పరిస్థితి మెరగవ్వాలంటే, నల్ల పసుపును, గోమతి చక్రంతో, వెండి నాణెం, గవ్వతో కలిపి పసుపు రంగులో ఉండే వస్త్రంలో కలిపి చుట్టండి. దీనిని ఎవరూ తాకని చోట ఉంచితే ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగవుతుంది. నల్ల పసుపును, కుంకుమతో కలిపి ఎర్రని వస్త్రంతో చుట్టండి. 
 
గురువారం పుష్యమి నక్షత్ర కలిసిన రోజున ఆ వస్త్రపు మూటని డబ్బులు ఉంచే ప్రదేశంలో పెట్టండి. ఇలా చేయడం వల్ల డబ్బు ఇంటికి రావడం క్రమంగా పెరుగుతూ ఉంటుందని చాలా మంది విశ్వాసం. అనవసరమైన లేదా వృథా ఖర్చులను నివారించడానికి నల్ల పసుపుతో ఇలా చేయండి. 
 
ఈ పసుపును కాస్త కుంకుమతో కలిపి వెండిగిన్నెలో ఉంచండి. లక్ష్మీదేవి విగ్రహం దగ్గరకు పాదాలను తాకించి ఇంట్లో డబ్బులు ఉంచే ప్రదేశంలో పెట్టండి. వ్యక్తిగత జీవితాన్ని పట్టిపీడిస్తున్న ఆర్థిక సమస్యలు తొలగిపోయి సానుకూల పరిస్థితులను కలగజేస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కొన్నేళ్లుగా పట్టిపీడిస్తున్న అప్పుల సమస్యల నుంచి గట్టెక్కించే శక్తి పసుపుకు ఉందట.