గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి

అష్టమి నుంచి పౌర్ణమి వరకు చంద్రునికి పెరుగన్నం పెడితే..?

అష్టమి నుంచి పౌర్ణమి వరకు చంద్రునికి పెరుగన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తే.. గొప్ప ధనవంతులు అవుతారు. ప్రతిరోజూ రాత్రి పెరుగు అన్నాన్ని చంద్రునికి నైవేద్యంగా సమర్పించాలి. వీలైనంతవరకు అరటి ఆకులో పెట్టాలి. అది లేకపోతే.. చిన్నపాటి వెండిగిన్నెలో పెట్టవచ్చు. అలాగే వీలైనంత వరకు అష్టమి నుంచి ప్రారంభించకపోయినా ద్వాదశి తిథి నుంచి పెరుగన్నంను చంద్రునికి నైవేద్యంగా సమర్పించవచ్చు. 
 
అలాగే పేదలకు వస్త్రదానం చేయవచ్చు. వస్త్రాలు దానం చేయలేకపోయినా.. తువ్వాలు అయినా దానం చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. లేకుంటే నీలం రంగు రుమాలు దానం చేయడం ఉత్తమం. పౌర్ణమి రోజున మహానైవేద్యం చంద్రునికి పళ్ళెంలో పెట్టి, దానిని స్వయంగా భుజించాలి. ఎంతో నైవేద్యం పెట్టారో అది మాత్రమే తినాలి. ఇతర పదార్థాలు తీసుకోకూడదు. ఆ రోజున ఉపవసించాలి. 
 
చంద్రుడు ప్రారబ్ధానికి దేవత. ఆయనకి నైవేద్యం పెట్టడం చేస్తే సంతృప్తి చెందుతాడు. తద్వారా ధనలాభం కలుగుతుంది. ఇంకా నైవేద్యం చేసేటప్పుడు స్వచ్ఛమైన నేతి దీపం వెలిగించాలి. కిటికీ నుంచి లేదా ఇంటి పైకప్పు పైకి వెళ్లి చంద్రుణ్ణి చూసి నైవేద్యం సమర్పించాలి. ఇలా చేస్తే సంపద వృద్ధి చెందుతుందని... అయితే వృత్తిపరంగా సాధకుడు ప్రయత్నాలు చేస్తూ వుండాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.