ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By pnr
Last Updated : శుక్రవారం, 30 మార్చి 2018 (08:41 IST)

శుక్రవారం (30-03-2018) దినఫలాలు : రుణాలు చేయాలనే మీ....

మేషం: విలువైన వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. తలపెట్టిన పనులు త్వరిగతిన పూర్తి చేస్తారు. కీలక సమస్యలను తెలివితో పరిష్కరిస్తారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులకు గురికాకండి. రుణాలు చేయాలనే ఆలోచన స్ఫురి

మేషం: విలువైన వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. తలపెట్టిన పనులు త్వరిగతిన పూర్తి చేస్తారు. కీలక సమస్యలను తెలివితో పరిష్కరిస్తారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులకు గురికాకండి. రుణాలు చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. ప్లీడర్లకు ఒత్తిడి, అక్కౌంట్స్ రంగాల వారికి పనిభారం, చికాకులు అధికమవుతాయి.
 
వృషభం: స్త్రీలకు అధిక శ్రమ, ఒత్తిడి వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. బ్యాంకింగ్, చిట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. ముఖ్య విషయాల్లో భాగస్వామి సలహా పాటించటం మంచిది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత అవసరం. రాజకీయ నాయకులకు ప్రయాణాల్లో మెళకువ ఏకాగ్రత చాలా అవసరం.
 
మిథునం: కిరాణా, ఫ్యాన్సీ, స్టేషనరీ, గృహోపకరణ వ్యాపారులు పురోభివృద్ధి పొందుతారు. ఊహించని ఖర్చుల వల్ల చేబదుళ్ళు తప్పవు. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. పత్రికా రంగంలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. 
 
కర్కాటకం: కుటుంబీకుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. రవాణా రంగాల వారికి మెళకువ, ఏకాగ్రత అవసరం. మీ ఉన్నతి చాటుకోవడం కోసం ధనం బాగా ఖర్చు చేస్తారు. చిరకాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయి. రాజకీయనాయకులు సభలు సమావేశాల్లో మంచి గుర్తింపు పొందుతారు.
 
సింహం: ధనవ్యయం, చెల్లింపుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. ముందుగానే ధనం సర్దుబాటు చేసుకోవటానికి యత్నించండి. వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు మెళకువ ఏకాగ్రత చాలా అవసరం. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు.
 
కన్య: కొబ్బరి, పండ్లు, పూలు, పానీయ వ్యాపారులకు కలిసివస్తుంది. సోదరుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. శాంతియుతంగా వ్యవహరిస్తే మీ సమస్యలు సానుకూలమవుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. బంధువుల ఆకస్మిక రాకతో ఖర్చులు అధికమవుతాయి.
 
తుల: వ్యాపారంలో పెరిగిన పోటీ వాతావరణం ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలు విదేశీ వస్తువల పట్ల ఆకర్షితులౌతారు. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆలయాలను సందర్శిస్తారు. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. 
 
వృశ్చికం: వ్యాపారాల అభివృద్ధికి స్కీములు, ప్రణాళికలు రూపొందిస్తారు. ప్రైవేట్ సంస్థల వారికి రిప్రజెంటేటివ్‌లకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. పోస్టల్ ఏజెంట్లు, రిప్రజెంటేటివ్‌లు టార్గెట్లను అధిగమిస్తారు. ధనసహాయం చేసే విషయంలో అప్రమత్తత అవసరం. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. 
 
ధనస్సు: ప్రేమ వ్యవహారాల్లో మితంగా వ్యవహరించండి. దైవ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. స్త్రీలకు చాలా యోగప్రదంగా వుండగలదు. ఫర్నీచర్ అమరికలకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాళ్ళు, నరాలకు సంబంధించిన చికాకులు వంటివి ఎదుర్కొంటారు. 
 
మకరం: పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. రుణం తీర్చి తాకట్టు వస్తువులు విడిపించుకుంటారు. వ్యాపారాల్లో ఆకర్షణీయమైన పథకాలతో వినియోగదారులను ఆకట్టుకుంటారు. చిన్నారుల మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. బంధువుల రాకవల్ల గృహంలో అసౌకర్యానికి లోనవుతారు.
 
కుంభం: కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీ అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. స్త్రీలకు ఉద్యోగ యత్నంలో బిడియం, బేషజం తగవు. నిరుద్యోగులకు ఉపాధి పథకాల వల్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు ఉన్నత విద్యల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళాల్సి వుంటుంది. మీ వాక్చాతుర్యం అందరినీ ఆకట్టుకుంటుంది.
 
మీనం: స్త్రీల తొందరపాటుతనానికి ఊహించని చికాకులు తలెత్తవచ్చు. ఏమరుపాటుగా వాహనం నడపడం వల్ల ఊహించని సమస్యలు తలెత్తుతాయి. మీ సంతానానికి కోరుకున్న సదవకాశాలు లభిస్తాయి. పెట్టిపోతలు, ఇచ్చిపుచ్చుకునే విషయాల్లో కచ్చితంగా వ్యవహరించండి. వాహనం నడుపునప్పుడు జాగ్రత్త అవసరం.