Widgets Magazine

మంగళవారం (13-02-18) దినఫలితాలు.. రహస్యాలు దాచడం వల్ల...

మేషం : మీ శ్రీమతికి చెప్పకుండా రహస్యములు దాచినందుకు కలహాలు తప్పవు. ఫైనాన్సు, చిట్‌ఫండ్ వ్యాపారస్తులు అపవాదులు, అపనిందలు ఎదుర్కొంటారు. రోళ్ళు, పాడి, పరిశ్రమల రంగాల్లో వారికి పనివారితో ఇబ్బందులు ఎదుర్కొ

daily horoscope
raman| Last Updated: మంగళవారం, 13 మార్చి 2018 (08:34 IST)
మేషం : మీ శ్రీమతికి చెప్పకుండా రహస్యములు దాచినందుకు కలహాలు తప్పవు. ఫైనాన్సు, చిట్‌ఫండ్ వ్యాపారస్తులు అపవాదులు, అపనిందలు ఎదుర్కొంటారు. రోళ్ళు, పాడి, పరిశ్రమల రంగాల్లో వారికి పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు ఎటువంటి సదవకాశం లభించిన సద్వినియోగం చేసుకోండి.
వృషభం : కొంతమంది వ్యాపారాల్లో మిమ్మల్ని తప్పుదోవ పట్టించవచ్చు. మనస్సుకు సంతోషం కలిగించే వార్తలు వింటారు. వృత్తుల వారు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవటం మంచిది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. కంప్యూటర్ రంగాల వారికి చికాకులు, అసహనంతప్పవు.

మిథునం : ఉద్యోగ, విదేశీయాన, రుణ యత్నాలు ఫలిస్తాయి. ఎదుటువారిలో తప్పులు వెతికే ప్రయత్నం విరమించండి. ధనం వ్యయంలో మితం పాటించండి. గృహంలో మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి. ఉపాధ్యాయులకు, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులు తప్పవు. స్త్రీలు విదేశీ వస్తువులపై ఆకర్షితులవుతారు.
కర్కాటకం : కిరణా, ఫ్యాన్సీ, నిత్యవసర వస్తు వ్యాపారులకు, స్టాకిస్టులకు కలసి వస్తుంది. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు, అధికారిక పర్యటనలు అధికమవుతాయి. కొంత మంది మీ నుంచి ధనసహాయం అర్థించవచ్చు జాగ్రత్త వహించండి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వాతావరణంలో మార్పువల్ల స్వల్పఆటంకాలను ఎదుర్కొంటారు.

సింహం : స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి సదవకాశాలు లభిస్తాయి. మీ ఆశయాలకు, అభిరుచులకు తగిన వ్యక్తులతో సంబంధాలు బలపడతాయి. స్త్రీలు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. బ్యాంకింగ్ వ్యవహారాలు, హామీలు, ఇతరులకు ధనసహాయం చేసే విషయంలో పునరాలోచన అవసరం.
కన్య : విదేశీయానాలకై చేయు యత్నాలు ఒక కొలికి వస్తాయి. రిప్రజెంటివ్‌లకు ప్రైవేటు సంస్థల్లోవారికి కలసి వచ్చేకాలం. మీ కళాత్ర మొండివైఖరి మీ కెంతో చికాకు కలిగిస్తుంది. కాంట్రాక్టర్లు చేపట్టిన పనిలో అంతరాయం ఎదుర్కొనక తప్పదు. మాట్లాటలేనిచోట మౌనం వహించటం మంచిది. పాత రుణాలు తీరుస్తారు.

తుల : టాన్స్‌పోర్టు, ఎక్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి పురోభివృద్ధి. సోదరి, సోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఆర్థికంగా ఎదగాలనే మా ఆశయం నిదానంగా ఫలిస్తుంది. విద్యార్ధులు భయాందోళనలు విడనాడి శ్రమించిన తమ లక్ష్యం సాధించగలరు. ఖర్చులు అధికమవుతాయి.
వృశ్చికం : నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. స్త్రీలకు స్వీయ ఆర్జన, సేవాకార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. బంధుమిత్రుల రాకతో గృహంలోసందడి వాతావరణం నెలకొంటుంది. వైద్య, ఇంజినీరింగ్ రంగాలవారికి పురోభివృద్ది. ప్రముఖులను కలుసుకుంటారు.

ధనస్సు : కీలకమైన వ్యవహారాల్లో మీరే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిది. మార్కెటింగ్ రంగాల వారికి, పత్రికా, ప్రవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఉపాధ్యాయులకు విద్యార్ధుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు, ఒకరికి సహాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు.
మకరం : చేపట్టిన పనులు అవాంతరాలు ఎదురైనా ఆత్మస్ధయిర్యంతో అడుగు ముందుకేయండి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులకు గురవుతారు. రాజకీయ నాయకులు సభ సమావేశాలలో పాల్గొంటారు. ఆలయాలు సందర్శిస్తారు.

కుంభం : గతంలో నిలిపి వేసిన వ్యాపారాలు, పనులు పునఃప్రారంభించటానికి చేయు యత్నాలు కలసివస్తాయి. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. మీ సంతానం కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు. ప్రతిక్షణం కుటుంబీకుల క్షేమం గురించి ఆలోచిస్తారు.
మీనం : ఖాతాదారులు, క్లయింట్‌లతో సంబంధాలు బలపడతాయి. ప్రతి క్షణం కుటుంబీకుల క్షేమం గురించి ఆలోచిస్తారు. మీ మాట నెగ్గకపోయినా మీ గౌరవానికి భంగం కలగదు. కోర్టు వ్యవహారాలలో పరిచయంలేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. ఆర్థిక విషయాల్లో ముందుచూపు అవసరమని గమనించండి.


దీనిపై మరింత చదవండి :