శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : శనివారం, 27 మే 2017 (22:45 IST)

28-05-17 రాశి ఫలితాలు...ఇతరుల జోక్యానికి తావివ్వడం మంచిది కాదు...

మేషం: వైద్యులు శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహిస్తారు. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీపై అధిక ప్రభావం చూపుతాయి. సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షించారు. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వ

మేషం: వైద్యులు శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహిస్తారు. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీపై అధిక ప్రభావం చూపుతాయి. సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షించారు. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వడం మంచిదికాదని గమనించండి. రావలసిన ధనంలో కొంతభాగం వసూలు కాగలదు. 
 
వృషభం: అవసరానికి సహకరించని మిత్రులతీరు నిరుత్సాహానికి గురిచేస్తుంది. మీ సంతానం విద్యా, ఆరోగ్య విషయాల పట్ల ప్రత్యేకశ్రద్ధ కనుపరుస్తారు. గత అనుభవాలు మీ లక్ష్యసాధనకు ఉపకరిస్తాయి. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. కొత్తపనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధవహించండి. 
 
మిధునం: స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. క్రయవిక్రయాలు సామాన్యం, స్థిరచరాస్తుల క్రయవిక్రయాల్లో పునరాలోచన మంచింది. కార్యసాధనల్లో అనుకూలత. కుటుంబసౌఖ్యం పొందుతారు. లీజు, ఏజెన్సీలు, నూతన కాంట్రాక్టులు అనుకూలిస్తాయి. దైవ, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
కర్కాటకం: ఆపరేషన్ల సమయంలో వైద్యులకు ఏకాగ్రతముఖ్యం. స్త్రీల అభిప్రాయాలకు మిశ్రమ స్పందనలభిస్తుంది. ఎంతశ్రమించినా సామాన్య ఫలితాలే పొందుతారు. ప్రతివిషయంలోనూ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ఉన్నతస్థాయి అధికారుల ఒత్తిడి, ప్రలోభాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. 
 
సింహం: ఆకస్మిక ఖర్చులు, తప్పనిసరిగా ఇబ్బంది కలిగిస్తాయి. స్త్రీలు, భేషజాలకుపోకుండా లౌక్యంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రముఖుల కలయికతో మీ సమస్యపరిష్కారం కాగలదు. ఉద్యోగస్తులకు రావలసిన ప్రమోషన్, బదిలీలకు కొంతమంది అవరోధం కలిగిస్తారు. చేపట్టిన పనులు ఒకంతట పూర్తికావు. 
 
కన్య: రియల్ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లలో ప్రతికూలతలు ఎదుర్కోవలసి వస్తుంది. సంకల్పబలంతో కొన్ని లక్ష్యాలు సాధిస్తారు. ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయాల్సి ఉంటుంది. ఖర్చులు పెరిగినా ప్రయోజనకరంగా ఉంటాయి. కుటుంబసౌఖ్యం, వాహన యోగం పొందుతారు. విదేశీయాన యాత్నాలు ఫలిస్తాయి. 
 
తుల: వస్త్రం, ఫ్యాన్సీ, గృహోపకరణ వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. వాహనం నడుపుతున్నపుడు మెలకువ వహించండి. ఉపాధ్యాయులకు, రిప్రజెంటేటివ్‌లకు ఒత్తిడి పెరుగుతుంది. స్త్రీలకు అయినవారికి నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. వైద్య, ఇంజనీరింగ్, శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి కలిసిరాగలదు. 
 
వృశ్చికం: ఖాదీ, చేనేత, నూలు వస్త్ర వ్యాపారులకు పురోభివృద్ధి. నూతన టెండర్లు చేజిక్కించుకుంటారు. విద్యార్థులు శుభవార్తా శ్రవణం. ప్రేమికుల ఆలోచనలు పలువిధాలుగా ఉంటాయి. ఉద్యోగస్తులకు రావలసిన ప్రమోషన్‌లో జాప్యంతప్పదు. తరచూ సభలు, దైవకార్యాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు చికాకు పరుస్తాయి. 
 
ధనుస్సు: వ్యాపారాభివృద్ధికి చేయుకృషిలో సఫలీకృతులవుతారు. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా మెలగండి. పాత మిత్రుల కలయిక ఉత్సాహం కలిగిస్తుంది. ప్రేమికులు అతిగా వ్యవహరించి చిక్కుల్లో పడతారు. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత ముఖ్యం. వృత్తుల వారికి ఆశించిన పురోభివృద్ధి. 
 
మకరం: కొబ్బరి, పండ్లు, కూరగాయల వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. వృత్తుల వారు ఎంత శ్రమించినా ఆదాయం అంతంతమాత్రంగానే ఉంటుంది. షేర్ల క్రయవిక్రయాల్లో పునరాలోచన అవరం. ఉద్యోగస్తుల శక్తిసామర్థ్యాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఖర్చుల చెల్లింపుల్లో ఏకాగ్రత అవసరం. 
 
కుంభం: వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన మార్పులు లేకపోవడంతో ఒకింత నిరుత్సాహానికి లోనవుతారు. స్త్రీలకు నడుము, నరాలు, ఎముకలకు సంబంధించిన చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. దూరప్రయాణాలు వాయిదా పడతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు చేపట్టిన ఉపాధి పథకాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. 
 
మీనం: భాగస్వామిక వ్యవహారాలు, ఆర్థికలావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. ప్రతి విషయంలోనూ స్వయంకృషిపైనే ఆధారపడటం మంచిది. మీ సంతానం ఉన్నత విద్యల గురించి ఒక నిర్ణయానికి వస్తారు. చేపట్టిన పనులు ఆర్థాంతంగా ముగించాల్సి వస్తుంది. స్త్రీలకు బంధువర్గాలతో పట్టింపులు, చికాకులు అధికమవుతాయి.