మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By pnr
Last Updated : శుక్రవారం, 13 ఏప్రియల్ 2018 (08:55 IST)

శుక్రవారం (13-04-18) దినఫలాలు : ఓర్పు - పట్టుదలకు పరీక్షా సమయం..

మేషం : విద్యార్థులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత, ప్రేమ విషయాల మీద విరక్తి నెలకొంటాయి. రాజకీయనాయకులు సభ, సమావేశాల్లో పాల్గొంటారు. మీ ఓర్పు, పట్టుదలకు ఇది పరీక్షా సమయం. సన్నిహితుల సలహాలు, సూచనలు మీపై మంచి ప్రభ

మేషం : విద్యార్థులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత, ప్రేమ విషయాల మీద విరక్తి నెలకొంటాయి. రాజకీయనాయకులు సభ, సమావేశాల్లో పాల్గొంటారు. మీ ఓర్పు, పట్టుదలకు ఇది పరీక్షా సమయం. సన్నిహితుల సలహాలు, సూచనలు మీపై మంచి ప్రభావం చూపుతాయి. నూతన పరిచయాలేర్పడుతాయి.
 
వృషభం : బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ఇతరుల విషయంలో జోక్యం చేసుకొని భంగపాటుకు గురవుతారు. స్త్రీలకు షాపింగ్‌లో జాగ్రత్తలు అవసరం. దంపతుల మధ్య పలు విషయాలు చర్చకు వస్తాయి. ఉపాధ్యాయులప విశ్రాంతికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి.
 
మిథునం : నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి, సద్వినియోగం చేసుకోండి. దైవదీక్షల పట్ల ఆసక్తి నెలకొంటుంది. రావలసిన ధనం వసూలు కాపోవడంతో స్వల్ప ఒడిదుడుకులు ఎదుర్కుంటారు. దూరప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ వహించండి. స్త్రీలకు పనివారలతో ఇబ్బందులు తప్పవు.
 
కర్కాటకం : ప్రింటింగ్ రంగాల వారికి పనివారితో సమస్యలు, చికాకులు తప్పవు. ఆస్తి వివాదాలు, భూ తగాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. సయయానికి సహకరించని సోదరులు, మిత్రుల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. విజ్ఞతగా వ్యవహరించి ఒక సమస్యను సునాయసంగా పరిష్కరిస్తారు. దైవ దర్శనాలు చేసుకుంటారు.
 
సింహం : ఆర్థిక లావాదేవీలు, ఉమ్మడి వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు ఫలిస్తాయి. ప్రియతముల ఆకస్మిక రాక ఆశ్చర్యానందాలు కలిగిస్తాయి. మీ జీవితభాగస్వామి సలహా మీకు ఎంతో సహకరిస్తుంది. మీ ఆశయానికి, అభిరుచులకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి.
 
కన్య : స్త్రీలకు బంధువుల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలు ఎదురవుతాయి. ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. పెద్దల ఆరోగ్యంలో సంతృప్తికాన వస్తుంది. నూతన ప్రదేశాలు సందర్శిస్తారు. ఎప్పటికప్పుడు వాయిదాపడుతూ వస్తున్న పనులు అనుకోకుండా పూర్తి చేస్తారు.
 
తుల : ఒక స్థిరాస్తిని అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులు ఎదుర్కుంటారు. మీ కుటుంబీకులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టిన వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. ప్రత్యర్థులను తక్కువగా అంచనావేయకండి.
 
వృశ్చికం : మత్స్య కోళ్ల వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. పాత మిత్రుల కలయిక మీకు ఎంతో ఉల్లాసాన్ని కలిగిస్తుంది. నూతన వ్యక్తులకు అతి చనువు ఇవ్వటం మంచిది కాదు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. దైవ సేవ, కార్యక్రమాలకు ధనం ఖర్చు చేస్తారు.
 
ధనస్సు : హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కుంటారు. దంపతుల మధ్య అన్యోన్యత లోపిస్తుంది. చిరువ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. స్నేహితుల ద్వారా కొత్త విషయాలు గ్రహిస్తారు. కొన్ని వ్యవహారాలు స్వయంగా మీరే చూసుకోవడం శ్రేయస్కరం.
 
మకరం : విందులు, వేడుకలలో ప్రముఖంగా వ్యవహరిస్తారు. ముఖ్యమైన విషయాలను కుటుంబీకులకు తెలియజేయటం మంచిది. వ్యవసాయ, తోటల రంగాల వారికి ఆశాజనరం. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి యత్నాలు సాగించిన సత్ఫలితాలు లభిస్తాయి. ఆకస్మికంగా దూరప్రయాణాలు చేయవలసి వస్తుంది.
 
కుంభం : నిరుద్యోగులు నిరుత్సాహం వీడి యత్నాలు సాగించిన సత్ఫలితాలు లభిస్తాయి. మీతో స్నేహం నటిస్తూనే మిమ్మల్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తారు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. పత్రికా రంగంలోని వారికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. స్త్రీలకు పరిచయాలు వ్యాపకాలు అధికం.
 
మీనం : స్త్రీలు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి చూపుతారు. కుటుంబీకుల మధ్య ప్రేమానుబంధాలు బలపడుతాయి. గృహానికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఒక అవకాశం అనుకోకుండా కలిసివస్తుంది, తక్షణం సద్వినియోగం చేసుకోవటం ఉత్తమం. ఖర్చులు అధికమవుతాయి.