శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : సోమవారం, 1 ఏప్రియల్ 2019 (10:04 IST)

01-04-2019 సోమవారం దినఫలాలు - మేష రాశివారు అలా చేస్తే...

మేషం: రాజకీయ రంగాల వారికి విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. అద్దె ఇంటికోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండడం క్షేమదాయకం. ప్రత్తి, పొగాకు రంగాలలో వారికి అనుకూలమైనకాలం.
 
వృషభం: పండ్లు, పూల, కొబ్బరి, కూరగాయ, చల్లని పానీయ, చిరు వ్యాపారస్తులకు లాభదాయకం. దేవాలయ, విద్యా సంస్థలకు దానధర్మాలు చేయుట వలన మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. ధనం బాగా ఖర్చు చేస్తారు. చిన్నారులకు అవసరమైన వస్తువులు సేకరిస్తారు. నూతన పెట్టుబడులు పెట్టునపుడు మెళకువ వహించండి. 
 
మిధునం: పెంపుడు జంతులవై ప్రేమ, శ్రద్ధ చూపిస్తారు. కాంట్రాక్టర్లకు ఇప్పటి వరకు వాయిదా పడుతున్న పనులు పునఃప్రారంభమవుతాయి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. బ్యాంకింగ్ రంగాల వారు ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. రాజకీయ నాయకులు కొంత సంక్షోభం ఎదుర్కొనక తప్పదు.
 
కర్కాటకం: ఆర్థిక వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైన అధికమిస్తారు. న్యాయ, కళా రంగాల్లో వారికి ప్రోత్సాహకరం. స్త్రీలకు షాపింగ్ విషయాలలోను, వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపారాల్లో కొత్త వ్యూహాల అమలులకు అనుకూలమైన కాలం. పెంపుడు జంతువులపై ప్రేమ, శ్రద్ధ చూపిస్తారు.
 
సింహం: వాతావరణంలో మార్పు వలన వ్యవసాయ, తోటల రంగాలలో వారికి ఆందోళన తప్పదు. వాహనం కొనుగోలుకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. వైద్యులు శస్త్రచికిత్స చేయునప్పుడు మెళకువ అవసరం. తొందరపడి వాగ్దానాలు చేయడం మంచిది కాదని గమనించండి. స్త్రీలకు నాణ్యత ధరల పట్ల ఏకాగ్రత ముఖ్యం. 
 
కన్య: స్థిరాస్తి వాదాలు పరిష్కార దిశగా నడుస్తాయి. ప్రయాణాల్లో అసౌకర్యానికి లోనవుతారు. నూతన వ్యక్తులతో స్నేహం ఏర్పడుతుంది. గృహోపకరణాలు కొనుగోలుచేస్తారు. స్త్రీలు భేషజాలకు పోకుండా నిగ్రహంతో వ్యవహరించడం క్షేమదాయకం. మందులు, రసాయినిక, ఫ్యాన్సీ, సుగంధ ద్రవ్య వ్యాపారస్తులకు కలిసిరాగలదు. 
 
తుల: శారీరక శ్రమ, విశ్రాంతి లోపం వలన స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. వృత్తుల వారికి శ్రమకు తగిన ప్రతిఫలం, మంచి గుర్తింపు లభిస్తుంది. దైవకార్యాలో చురుకుగా వ్యవహరిస్తారు. సాంఘిక కార్యక్రమాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. అంతగా పరిచయం లేని వారికి ధనసహాయం చేసే విషయంలో అప్రమత్తత అవసరం.
 
వృశ్చికం: పోగొట్టుకున్న వస్తువులు తిరిగి లభించే అవకాశం ఉంది. దంపతుల మధ్య చిన్న చిన్న కలహాలు ఏర్పడుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు చేపడతారు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుట మంచిది. స్త్రీలకు ఇరుగు, పొరుగు వారితో సఖ్యత అంతగా ఉండదు. 
 
ధనస్సు: ఆడిట్, అకౌంట్స్ రంగాల వారికి ఏకాగ్రత అవసరం. గృహ భద్రత విషయంలో జాగ్రత్త అవసరం. దూరప్రయాణాల లక్ష్యం నెరవేరగలదు. ఆత్మీయులతో కలిసి విందులు, పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. వ్యాపారాభివృద్ధికి నూతన పథకాలు, ప్రణాళికలు చేపడతారు. 
 
మకరం: మీ శ్రీమతి ఆకస్మిక ప్రయాణం ఇబ్బంది కలిగిస్తుంది. ప్రముఖుల పరిచయాలు మీ ఉన్నతిని పెంచుతాయి. మీరు తీసుకున్న నిర్ణయానికి మంచి ఆదరణ లభిస్తుంది. పాత రుణాలు తీరుస్తారు. మార్కెటింగ్ రంగాలలోని వారికి ఒత్తిడి, శ్రమాధిక్యత తప్పవు. అవివాహితులకు ఆశించిన సంబంధాలు నిశ్చయమవుతాయి. 
 
కుంభం: ఉమ్మడి వ్యాపారాలు లాభదాయకంగా ఉండగలవు. సంఘంలో పేరు, ప్రఖ్యాతలు గడిస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడుతాయి. కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ విభాగం నుండి ఒత్తిడి పెరుగుతుంది. సోదరీసోదరులతో ఏకీభవం కుదరదు. ఆడంబరాలకు, బంధుమిత్రుల కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. 
 
మీనం: గృహవాస్తు దోష నివారణలు, నిర్మాణాలు అనుకూలిస్తాయి. వాదోపవాదాలకు, బ్యాంకు హామీలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. వ్యాపారాల్లో పోటీనీ తట్టుకోవడానికి బాగా శ్రమించాలి. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతంగా భావించకండి.