04-01-2019 శుక్రవారం - స్త్రీలతో సంభాషించేటపుడు...

రామన్| Last Updated: శుక్రవారం, 4 జనవరి 2019 (08:16 IST)
మేషం: సాంఘిక, సేవా కార్యక్రమాలలో చురుకుగా వ్యవహరిస్తారు. ఉద్యోగస్తుల శ్రమకు, నైపుణ్యతకు అధికారుల నుండి ప్రసంశలు లభిస్తాయి. సన్నిహితుల ద్వారా అందుకున్న ఒక సమాచారం మీకెంతో ఉపకరిస్తుంది. గతంలో నిలిపి వేసిన వ్యాపారాలు, పనులు పునఃప్రారంభించడానికి చేయు యత్నాలు కలిసివస్తాయి.

వృషభం: ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. చేపట్టిన పనుల్లో కొంత ముందు వెనుకలుగానైనను సంతృప్తి కానరాగలదు. ప్రయాణాలలో మెళకువ అవసరం. ట్రాన్స్‌పోర్ట్, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. కొంతమంది మిమ్ములను ధనసహాయం లేక హామీలు కోరవచ్చు.

మిధునం: ఉపాధ్యాయులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. హోటల్, తినుబండారాలు వ్యాపారస్తులకు పురోభివృద్ధి. ఇతరుల కారణంగా మీ కార్యక్రమాలు వాయిదా పడడంతో కొంత నిరుత్సాహానికి గురవుతారు. విద్యర్థులకు ఏకాగ్రత చాలా అవసరమని గమనించండి. నూతన పరిచయాలు ఏర్పడుతాయి.

కర్కాటకం: మార్కెటింగ్, ప్రైవేటు సంస్థల్లో వారు అధిక శ్రమ, ఒత్తిడికి గురవుతారు. చేపట్టిన పనుల్లో కొంత ముందు వెనుకలు గానైనను సంతృప్తి కానరాగలదు. ముఖ్యులతో సంభాషించేటపుడు మెళకువ వహించండి. స్థిరచరాస్తుల విషయంలో ముఖ్యుల మధ్య విభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది. మెళకువ వహించండి.


సింహం: నిరుద్యోగలకు మధ్యవర్తుల పట్ల అప్రమత్తత అవసరం. ఆలయాలను సందర్శిస్తారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి కలిసివచ్చేకాలం. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఊహించని ఖర్చులు, ఇతరత్రా చెల్లింపుల వలన చికాకులు తప్పవు.

కన్య: ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. స్త్రీలకు చుట్టుపక్కల వారితో సంబంద బాంధవ్యాలు నెలకొని ఉంటాయి. భాగస్వామికుల మధ్య నూతన విషయాలు చర్చకు వస్తాయి. బ్యాంకు పనులు వాయిదా పడుతాయి. చిన్న చిన్న విషయాలలో ఉద్రేకం మాని తెలివి తేటలతో ముందుకు సాగి జయం పొందండి.

తుల: విద్యార్థులకు తమ ధ్యేయం పట్ల ఆసక్తి, శ్రద్ధ పెరుగుతుంది. ప్రయోజనకరమైన విషయాలు చర్చించి సత్‌ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. బంధుమిత్రులతో కలిసి సరదాగా గడుపుతారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడడం మంచిది. కుటుంబీకుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి.

వృశ్చికం: నిరుద్యోగులకు శ్రమాధిక్యత మినహా ఆశించిన ఫలితాలు పొందలేరు. వ్యవసాయ దారులు త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడం వలన సంతృప్తి పొందుతారు. ఖర్చులు అధికమవుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు గోప్యంగా ఉంచండి. స్త్రీలకు సన్నిహితుల నుండి అందిన ఆహ్వానాలు సంతృప్తినిస్తాయి.

ధనస్సు: కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. సాంఘిక, సేవా కార్యక్రమాలలో చురుకుగా వ్యవహరిస్తారు. గృహోపకరణాలకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వాతావరణంలో మార్పు వలన ఆరోగ్యం మందగిస్తుంది. రావలసిన ధనం అనుకోకుండా చేతికందును.

మకరం: ఉద్యోగస్తుల శ్రమకు, నైపుణ్యతకు అధికారుల నుండి ప్రసంశలు లభిస్తాయి. సొంత వ్యాపారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలతో కలహాలు, అన్ని కార్యముల యందు విఘ్నములు ఎదుర్కుంటారు. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది.


కుంభం: స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. విద్యార్థినులకు ఏకాగ్రత లోపం వలన ఆందోళన తప్పదు. ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం తప్పదు. పాతమిత్రుల కలయికతో మీలో కొత్త ఉత్సాహం, ఆలోచనలు స్ఫురిస్తాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు.


మీనం: మీ పట్టుదల, అంకితభావం ఇతరులకు మార్గదర్శకమవుతుంది. బంధువులను కలుసుకుంటారు. వైద్యుల తొందరపాటు చర్యలు, నిర్లక్ష్యం వలన కొత్త సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి, విశ్రాంతి లోపం వంటి చికాకులు అధికమవుతాయి. గృహంలో మార్పులు, చేర్పులకై చేయు యత్నాలు ఫలిస్తాయి.దీనిపై మరింత చదవండి :