గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : ఆదివారం, 5 ఆగస్టు 2018 (09:12 IST)

ఆదివారం (05-08-18) రాశిఫలాలు - మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా...

మేషం: స్త్రీలకు నూతన పరిచయాలు, వ్యాపకాలు అధిమవుతాయి. మత్స్య, కోళ్ళ, గొర్రెల వ్యాపారస్తులకు కలిగిరాగలదు. ద్విచక్రవాహనం పై దూరప్రయాణాలు మంచిది కాదని గమనించండి. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తార

మేషం: స్త్రీలకు నూతన పరిచయాలు, వ్యాపకాలు అధిమవుతాయి. మత్స్య, కోళ్ళ, గొర్రెల వ్యాపారస్తులకు కలిగిరాగలదు. ద్విచక్రవాహనం పై దూరప్రయాణాలు మంచిది కాదని గమనించండి. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం, అకాల భోజనం వలన ఆరోగ్యం మందగిస్తుంది.
 
వృషభం: స్త్రీలకు ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం. వీలైనంత వరకు మితంగా సంభాషించండి. విద్యార్థులు అల్లర్లు, ఆందోళనలకు దూరంగా ఉండడం క్షేమదాయకం. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, వ్యాపారులకు సంతృప్తి, మిత్రులతో కలసి వేడుకల్లో పాల్గొంటారు. 
 
మిధునం: మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించడం మంచిది కాదు. దేనియందు ఏకాగ్రత అంతగా ఉండదు. అదనపు రాబడి కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులు భేషజాలకు పోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లు, బిల్డర్లకు పనివారలతో చికాకులు తప్పవు.
 
కర్కాటకం: కొన్ని విషయాలు అంతగా పట్టించుకోవడం మంచిదికాదు. స్త్రీలకు వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత అవసరం. కుటుంబీకులతో కలిసి వేడుకల్లో ఉల్లాసంగా గడుపుతారు. ఏదో సాధించలేక పోయామన్న భావం మిమ్మల్ని వెన్నాడుతుంది. ముఖ్యులతో ఓర్పు, విజ్ఞతాయుతంగా వ్యవహిరించండి.
 
సింహం: స్థోమతకు మించిన వాగ్దానాలు వలన ఇబ్బందులు ఎదుర్కుంటారు. ఎలక్ట్రానికి మీడియా వారికి సదవకాశాలు లభిస్తాయి. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు.
 
కన్య: మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. హోటల్, క్యాటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కుంటారు. 
 
తుల: ఆర్ధిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. మీ సంతానంతో ఉల్లాసంగాను, ఉత్సాహంగా గడుపుతారు. సోదరీసోదరుల మధ్య తగాదాలు రావచ్చు. కంప్యూటర్ రంగంలోని వారికి అభివృద్ధి కానవస్తుంది. కొన్ని సమస్యలు చిన్నవే అయిన మనశ్శాంతి దూరం చేస్తారు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం.
 
వృశ్చికం: ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు యత్నాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రులతో కలసి విందు, వినోదాలలో పాల్గొంటారు. సమయానికి సహకరించని వ్యక్తుల వలన ఇబ్బందులెదుర్కుంటారు. ట్రాన్స్‌పోర్ట్, ట్రావెలింగ్ రంగాల వారికి పురోభివృద్ధఇ కానవస్తుంది. 
 
ధనస్సు: స్త్రీలకు పొరుగువారి నుండి ఆహ్వానం అందుతుంది. కుటుంబములో అనురాగ వాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. విలువైన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. విద్యార్ధులు క్రీడా రంగాలలో బాగా రాణిస్తారు. ఖర్చులు ఊహించినవే కావడంతో మీ అవసరాలకు కావలసిన ధనం ముందుగానే సిద్ధం చేసుకుంటారు.
 
మకరం: వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కనిపెట్టుకుని ఉండడం శ్రేయస్కరం. సొంత నిర్ణయాల వలన కలహాలు, చికాకులు తప్పవు. రాజకీయనాయకులు సాంఘిక కార్యక్రమాలలోనూ, వేడుకలలోనూ పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో ఒత్తిడి, హడావుడి ఎదుర్కుంటారు. ప్రేమికులు అతిగా వ్యవహరించడం వలన చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది.  
 
కుంభం: హోటల్, క్యాటరింగ్ రంగాల్లో వారు పనివారలతో ఇబ్బందులు ఎదుర్కుంటారు. రవాణా రంగాలలో వారికి ప్రయాణీకులతో ఒత్తిడి, చికాకులు వంటివి తలెత్తుతాయి. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. అందరికి సహాయం చేసి మాటపడతారు. కుటుంబీకులతో కలసి విందు, వేడుకలలో పాల్గొంటారు. 
 
మీనం: ప్రముఖులతో కలసి ఉల్లాసంగా గడుపుతారు. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలబడుతారు. కోళ్ళ, గొఱ్ఱె, మత్య్య వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. రావలసిన బాకీలు వాయిదాపడుట వలన ఆందోళనకు గురవుతారు.