మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : బుధవారం, 6 మార్చి 2019 (08:53 IST)

06-03-2019 బుధవారం దినఫలాలు : ఆ రాశివారు స్త్రీలపట్ల...

మేషం: బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళకువ అవసరం. స్త్రీలు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం వలన భంగపాటుకు గురవుతారు. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికమవుతుంది. పెద్దమొత్తం ధనంతో ప్రయాణాలు క్షేమం కాదు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించిన జారవిడుచుకుంటారు.
 
వృషభం: ఆఫీసులో తొందరపాటు నిర్ణయాలతో కాకా, మీ సీనియర్ల సలహాలను తీసుకుని ముందుకు సాగండి. మీ అభిరుచులకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. ఇతరులను ధన సహాయం అడగడానికి అభిజాత్యం అడ్డువస్తుంది. వృత్తుల వారికి శ్రమాధిక్యత మినహా ఆర్థిక సంతృప్తి ఆశించినంతగా ఉండదు.
 
మిధునం: హోటల్, క్యాటరింగ్ రంగాల్లోవారు పనివారలతో ఇబ్బందులు ఎదుర్కుంటారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఉద్యోగంలో శ్రమకు మంచి గుర్తింపు లభిస్తుంది. స్త్రీలకు ఇంటర్య్వూల సమాచారం అందుతుంది. రాజకీయనాయకులు సభలు, సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు.
 
కర్కాటకం: పుణ్యక్షేత్రాల దర్శనం వలన మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ప్రేమ వ్యవహారాలకు తగిన సమయం కాదు. స్త్రీలు గృహమునకు కావలసిన వస్తువుల కోసం ధనం ఖర్చుచేస్తారు. స్థిరాస్తి అమ్మకంపై ఒత్తిడి వలన ఆందోళనకు గురవుతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది.
 
సింహం: ధనం నిల్వ చేయాలనే మీ సంకల్పం నెరవేరదు. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికమవుతుంది. మీ ప్రమేయం లేకున్నా కొన్ని తప్పిదాలకు బాధ్యత వహించవలసి వస్తుంది. మీ సమర్థతపై ఎదుటివారికి నమ్మకం కలుగుతుంది.
 
కన్య: ఉద్యోగస్తులు పై అధికారులతో సంభాషించేటపుడు జాగ్రత్త వహించండి. చిన్నారుల మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. బంధువులకు ధనం సహాయం చేయడం వలన ఇబ్బందులను ఎదుర్కుంటారు. స్త్రీలకు షాపింగ్‌లోను, వస్తు నాణ్యత ఎంపికలోను ఏకాగ్రత అవసరం. దైవ, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. 
 
తుల: చిన్నారుల, ఖరీదైన వస్తువుల కొనుగోలు విషయంలో ఖర్చులు అంచనాలు మించుతాయి. శ్రీవారు, శ్రీమతి వైఖరి ఉల్లాసాన్ని కలిగిస్తుంది. బ్యాంకింగ్, చిట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. ఎవరికైనా ధనం సహాయం చేసినా తిరిగిరాజాలదు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి గుర్తింపు లభిస్తుంది.
 
వృశ్చికం: ప్రైవేటు సంస్థల వారికి, రిప్రజెంటేటివ్‌లకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. సోదరీసోదరులతో ఒక అవగాహనకు వస్తారు. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి బాగా శ్రమించవలసి ఉంటుంది. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక ఫలిస్తుంది. 
 
ధనస్సు: ఆర్థిక కుటుంబ విషయాలపట్ల దృష్టి సాగిస్తారు. కొబ్బరి, పండ్లు, పూలు, పానీయ వ్యాపారులకు కలిసివస్తుంది. విదేశీ వస్తువులు సేకరిస్తారు. బ్యాంకింగ్, చిట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. ఆలయాలను సందర్శిస్తారు. ఉద్యోగస్తులు అధికారులతో మాటపడకుండా తగిన జాగ్రత్త వహించండి. 
 
మకరం: ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన మిత్రుల సహకారం లభిస్తుంది. హోటల్, తినుబండారాలు, బేకరీ పనివారలకు లాభదాయకంగా ఉంటుంది. తొందరపాటుతనం వలన కుటుంబీకులు, అవతలి వారితో మాటపడవలసి వస్తుంది. స్త్రీలు వీలైనంత వరకు మితంగా సంభాషించడం మేలు. ఖర్చులు అధికమవుతాయి. 
 
కుంభం: వైద్య, ఇంజనీరింగ్ రంగంలోని వారికి ఏకాగ్రత ఎంతో ముఖ్యం. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. అసాధ్యమనుకున్న పనులు సునాయసంగా పూర్తిచేస్తరాు. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. స్త్రీలకు కాళ్ళు, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కుంటారు.
 
మీనం: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాలలో వారికి చికాకులు తప్పవు. మీ సంతానానికి కోరుకున్న విద్యావకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. దంపతుల సంబంధబాంధవ్యాలు బాగుగా ఉంటాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాల్లో మీదై పైచేయిగా ఉంటుంది.