శనివారం, 25 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : శనివారం, 6 అక్టోబరు 2018 (09:09 IST)

06-10-2018 శనివారం దినఫలాలు - ఆధ్యాత్మిక విషయాల పట్ల...

మేషం: ఆధ్యాత్మిక విషయాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. గృహోపకరణాలు కొనుగోలుచేస్తారు బ్యాంకు వ్యవహార

మేషం: ఆధ్యాత్మిక విషయాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. గృహోపకరణాలు కొనుగోలుచేస్తారు బ్యాంకు వ్యవహారాలలో హామీలు, మధ్యవర్తిత్వం వహించడం వలన మాట పడవలసివస్తుంది.
 
వృషభం: ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. అనుబంధాలలో మార్పు మీకు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి అనుకూలం. విద్యా, వైజ్ఞానిక విషయాల పట్ల ఆసక్తి పెరుగును, భాగస్వామ్య వ్యాపారస్తులకు మెళకువ అవసరం. ముఖ్యులకు బహుమతులు అందజేస్తారు. 
 
మిధునం: ప్రియతముల కోసం విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. ముఖ్యులతో ఆంతరంగిక విషయాలను చర్చిస్తారు. విద్యాభివృద్ధికై చేయు ప్రయత్నాలు ఫలించగలవు. రావలసిన ధనం చేతికందుతుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. వృత్తులలో వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఆకస్మిక మార్పులు సంభవిస్తాయి.  
 
కర్కాటకం: స్థిరాస్తి వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాలు మీకు అనకూలిస్తాయి. గృహంలో మార్పులు, చేర్పు అనుకూలిస్తాయి. స్త్రీలు బంధువర్గాల నుండి ఆహ్వానాలు అందుకుంటారు. రాజకీయన్యాయబోధన, కళా, సాంస్కృతిక రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రభుత్వ సంస్థలలో పనులు పూర్తవుతాయి. 
 
సింహం: ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. ఓర్పు, పట్టుదలతో శ్రమించిన గాని చేపట్టిన పనులు పూర్తికావు. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. ప్రత్యర్థులు మీ శక్తి సామర్ధ్యాలను గుర్తిస్తారు. రుణ విముక్తులు కావడంతో పాటు కొత్త రుణాలు అనుకూలిస్తాయి.  
 
కన్య: కోర్టు వ్యవహారాలలో ప్లీడర్లు చికాకులను ఎదుర్కుంటారు. ఫర్నీచర్ అమరికలకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కుంటారు. చేపట్టిన వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. పై అధికారులు, ప్రముఖులతో వాగ్వివాదాలకు దిగకండి. సందర్భం లేకుండా నవ్వడం వలన కలహాలు ఎదుర్కోవలసి వస్తుంది.  
 
తుల: చేతివృత్తుల వారికి ఒత్తిడి, పనిభారం తగ్గుతుంది. మీ పాత సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఒకింత నిరుత్సాహానికి గురవుతారు. స్త్రీలకు షాపింగ్‌లో నాణ్యతను గమనించాలి. బ్యాంకు లావాదేవీలు, రుణ యత్నాలకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. మిత్రులతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి.  
 
వృశ్చికం: నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథాకాలకు గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తుంది. ఆభరణాలు, విలువైన వస్తువలు అమర్చుకోవాలనే స్త్రీల కోరికలు నెరవేరగలవు. మానవత్వంతో సాగడం మీకు ఎంతో మంచిది. ప్రయాణాలు, వ్యూహాల అమలులో జాగ్రత్త అవసరం. కుటుంబంలో ప్రశాంతత చోటుచేసుకుంటుంది.  
 
ధనస్సు: ఉద్యోగ, వ్యాపారాల్లో ఆటుపోట్లు ఎదుర్కోవలసి వస్తుంది. మీ మాటలు ఇతరులకు జారవేసే వ్యక్తులున్నారన్న విషయం గమనించండి. ధనం ఎంత వస్తున్నా ఏ మాత్రం నిల్వ చేయలేకపోతారు. విద్యార్థులకు వాహనం నడుపునప్పుడు మెళకువ అవసరం. గృహ నిర్మాణాలలో స్వల్వం అడ్డంకులు, చికాకులు ఎదుర్కుంటారు. 
 
మకరం: ఇచ్చి పుచ్చుకునే వ్యవహారాలు, ఆరోగ్యం మెళకువ వహించండి. వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు ఏకాగ్రత, మెళకువ చాలా అవసరం. మీ కళత్ర మెుండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. ఉపాధ్యాయులకు పనిభారం అధికమవుతుంది.  
 
కుంభం: ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలో వారికి నిరుత్సాహం కానవస్తుంది. ఉపాధి పథకాలపై నిరద్యోగులు దృష్టి సారిస్తారు. స్త్రీలకు బంధువర్గాల నుండి ఆహ్వానం అందుతుంది. పత్రికా, మీడియారంగాల వారికి చికాకులు అధికం. తలపెట్టిన పనిలో ఆటంకాలు ఎదురైన ధైర్యం, పట్టుదలతో శ్రమించి విజయం సాధిస్తారు.  
 
మీనం: వస్త్ర, బంగారం, వెండి రంగాలలో వారికి కలిగిరాగలదు. ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తవచ్చు. రావలసిన ధనం చేతికందటంతో రుణం తీర్చాలనే మీ యత్నం నెరవేరగలదు. మీ యత్నాలకు మంచిసలహా, సహాకారం మిత్రుల వలన లభిస్తుంది. ప్రైవేటు సంస్థల్లో వారు ఓర్పు, అంకిత భావంతో పనిచేయవలసి ఉంటుంది.