14-09-2018 శుక్రవారం దినఫలాలు - మీ భావాలు, అభిప్రాయాలకు ఎదుటివారు...

మేషం: వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు మెళకువ అవసరం. మిమ్మల్ని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. స్త్రీలకు స్వీయఆర్జనపట్ల ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. మీ

raman| Last Updated: శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (08:56 IST)
మేషం: వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు మెళకువ అవసరం. మిమ్మల్ని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. స్త్రీలకు స్వీయఆర్జనపట్ల ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. మీ శక్తి సామర్ధ్యాలపై నమ్మకం పెంచుకుంటారు. కాలంతో పోటీపడి పనిచేస్తారు.
 
వృషభం: ఉద్యోగులు కార్మిక, విద్యుత్ లోపం వంటి ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. స్వార్దపూరిత ప్రయోజనాలు ఆశించి మీకు చేరువవ్వాలని భావిస్తునన్న వారిని దూరంగా ఉంచండి. స్త్రీల అభిప్రాయాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపార వ్యవహారాల్లో ఖచ్చితంగా మెలగండి. కొత్త పరిచయాలు మీ ఉన్నతకి నాంది పలుకుతాయి.  
 
మిధునం: హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. ఉపాధ్యాయులకు విద్యార్థుల నుండి ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. సోదరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణాలు క్షేమదాయకం కాదు. సహకార సంఘాల్లో వారికి, ప్రైవేటు సంస్థల్లో వారికి గుర్తింపు లభిస్తుంది.  
 
కర్కాటకం: స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలవారికి శ్రమ, పనిభారం అధికమవుతుంది. గృహంలో ఏదైనా వస్తువు పోయేందుకు ఆస్కారం ఉంది. స్త్రీలతో సంభాషించేటప్పుడు మితంగా వ్యవహరించండి. పోస్టల్, ఎల్.ఐ.సి ఏజెంట్లకు పురోభివృద్ధి. ఉత్తరప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉపాధ్యాయులకు ఉత్సాహం అధికం.  
 
సింహం: పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. సాంకేతిక, వైద్య రంగాల్లోని వారికి అనకూలంగా ఉంటుంది. పొదుపుపై దృష్టి కేంద్రికరిస్తారు. సంతానపరంగా మీరు తీసుకునే నిర్ణయాలు మేలు చేకూరుస్తాయి. మీ కుటుంబ విషయంలో ఇతరుల జోక్యం మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.  
 
కన్య: ఎలక్ట్రిక్ల, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాలవారికి ఆశాజనకం. పెద్దల ఆరోగ్యంలో మెళకువ వహించండి. మీ భావాలు, అభిప్రాయాలకు ఎదుటివారు విలువిస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకున్నదోకటి, జరిగేది మరొకటి అయ్యే అవకాలున్నాయి. సంతానపరంగా మీరు తీసుకునే నిర్ణయాలు మేలు చేకూరుస్తాయి. 
 
తుల: బ్యాంకింగ్ వ్యవహారాలు, మధ్యవర్తిత్వాలకు సంబంధించిన విషయాల్లో ఏకాగ్రత ముఖ్యం. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. రాజకీయ పరిచయాలు లబ్థిని చేకూరుస్తాయి. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. పత్రిక, వార్తా సంస్థలలోని వారికి ఓర్పు, అంకితభావం ముఖ్యం. 
 
వృశ్చికం: ఐరన్, ఆటోమోబైల్, ట్రాన్స్‌పోర్టు, మెకానికల్ రంగాలలో వారికి ఒత్తిడి పెరుగుతుంది. అందరికి సహాయంచేసి సమస్యలు ఎదుర్కుంటారు. దైవకార్యక్రమాల్లో పాల్గొంటారు. మీక దగ్గరగా ఉన్న మీకే తెలియని ఒక అవకాశం మిమ్మల్ని వరిస్తుంది. ఇతరులతో అతిగా మాట్లాడడం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు.  
 
ధనస్సు: విద్యార్థులకు నూతన వాతావరణం, పరిచయాలు సంతృప్తినిస్తాయి. రాజకీయనాయకుల పర్యటనల్లో ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు. వాస్తవానికి మీరు నిదానస్తులైనప్పటికీ కొంత ఉద్రేకానికి లోనవుతారు. ప్రేమికుల తొందరపాటు నిర్ణయాలు సమస్యలకు దారితీస్తాయి. ఉన్నత విద్యలకోసం చేసే యత్నం ఫలిస్తుంది. 
 
మకరం: ధన వ్యయం, విరాళాలిచ్చే విషయంలో మెళకువ వహించండి. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిదికాదు. ఏ విషయంలోను ఒంటెత్తు పోకడ మంచిదికాదు. ఊహగానాలతో కాలం వ్యర్ధం చేయక సద్వినియోగం చేసుకోండి. స్త్రీలు నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కుంటారు. 
 
కుంభం: కంప్యూటర్, ఎలక్ట్రానికల్, మెకానికల్ రంగాలవారికి సామాన్యంగా ఉంటుంది. స్త్రీలకు ప్రకటనలు, అపరిచిత వ్యక్తుల పట్ల ఏకాగ్రత అవసరం. రావలసిన ధనం అందటం వలన తాకట్టు వస్తువులను విడిపిస్తారు. కుటుంబ సభ్యులతో వివాదాలు తలెత్తుతాయి. ఇంటా, బయటా ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి.  
 
మీనం: సంఘంలో గుర్తింపు, ప్రశంసలు పొందుతారు. వృత్తి వ్యాపారులకు అన్ని విధాలా అనుకూలం. కుటుంబీకులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆశ వదిలేసుకున్న ఒక అవకాశం మీకే అనుకూలిస్తుంది. భాగస్వామిక చర్చల్లో మీ సూచనలకు మంచి స్పందన లభిస్తుంది. పుణ్యక్షేత్ర సందర్శనాలు, దూరప్రయాణాలకు అనుకూలం. దీనిపై మరింత చదవండి :