12-02-2019 - మంగళవారం మీ రాశి ఫలితాలు - రాబడికి మించిన ఖర్చులు...

astro 12
రామన్| Last Updated: మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (09:36 IST)
మేషం: నిత్యవసర వస్తు వ్యాపారులకు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. సన్నిహితులతో కలిసి దైవ, సేవాకార్యాలలో పాల్గొంటారు. స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుతాయి. ధనవ్యయం, రుణ సహాయానికి సంబంధించిన విషయాల్లో కుటుంబీకులను సంప్రదించడం మంచిది.

వృషభం: వైజ్ఞానికి, శాస్త్ర విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. చేపట్టిన వ్యావారాల్లో ఒకింత పురోగతి కనిపిస్తుంది. రాజకీయ నాయకులు సభా, సమావేశాలలో కొంత చికాకులు తప్పవు. మీ ప్రయాణాలు ఇతరుల కారణంగా వాయిదా పడడంతో నిరుత్సాహానికి లోనవుతారు. ఉత్తర ప్రత్యుత్తరాలు మీకెంతో సంతృప్తినిస్తాయి.

మిధునం: పాత వస్తువులను కొని ఇబ్బందులు తెచ్చుకోకండి. దుబారా ఖర్చులు నివారించడం సాధ్యపడక పోవచ్చు. మీ సంతానం విద్య, వివాహ విషయాల పట్ల శ్రద్ధ కనబరుస్తారు. బంధువులు, సోదరుల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి. ఏ వ్యక్తికీ పూర్తిగా బాధ్యతలు అప్పగించడం మంచిది కాదని గమనించండి.

కర్కాటకం: వస్త్ర, స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం. శారీరకశ్రమ, విశ్రాంతి లోపం వలన అస్వస్థతకు గురవుతారు. విద్యార్థుల మొండివైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. స్త్రీలలో సంపాద పట్ల ఆసక్తి మరింత బలపడుతుంది. రాబడికి మించిన ఖర్చులు వలన స్వల్ప ఒడిదుడుకులను ఎదుర్కుంటారు.

సింహం: ప్రైవేటు సంస్థలలో మదుపు చేయడం మంచిది కాదని గమనించండి. హామీలు, మధ్యవర్తిత్వాల వలన ఇబ్బందులు తప్పవు. ఒక సమస్య పరిష్కారం కావడంతో కోర్టు వాజ్యాలు ఉపసంహరించుకుంటారు. ఉద్యోగస్తుల ప్రమోషన్‌కు అధికారులు సిషార్సు చేస్తారు. స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు.

కన్య: వ్యాపార లావాదేవీలు గోప్యంగా ఉంచడం మంచిది. ఉద్యోగ రీత్యా ప్రయాణం చేయవలసివస్తుంది. వాహన చోదకులకు చికాకులు అధికం. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఇంటర్వ్యూలకు హాజరు కావలసి ఉంటుంది. మొండి బాకీలు సైతం వసూలు కాగలవు. కుటుంబీకుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు.


తుల: స్త్రీలు ఇతరులతో సంభాషించేటపుడు మెళకువ అవసరం. విద్యార్థినులకు ఒత్తిడి, ఆందోళన తప్పవు. కొన్ని అనుకోని సంఘటనలు దిగ్భ్రాంతికి గురిచేస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాల్లో నిలదొక్కుకోవడంతో పాటు అనుభవం గడిస్తారు. ట్రాన్స్‌పోర్టు, ఎక్స్‌పోర్ట్ రంగాల్లో వారికి సదవకాశాలు లభిస్తాయి.


వృశ్చికం: కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో పునరాలోచన అవసరం. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. బంధువులను కలుసుకుంటారు. బ్యాంకు వ్యవహారాలు అనుకూలిస్తాయి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. విద్యార్థులకు ప్రింటింగ్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి.

ధనస్సు: పత్రిక, మీడియా సంస్థల వారు అకారణంగా మాటపడవలసి వస్తుంది. పోస్టల్, కొరియల్ రంగాల వారికి శ్రమాధిక్యత తప్పదు. బంధుమిత్రుల మధ్య అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. ఊహించని ఖర్చులు వలనే చేబదుళ్ళు తప్పవు. విద్యార్థులకు ఏకాగ్రతలోపం, మందకొడితనం వలన చికాకులు తప్పవు.

మకరం: ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. దంపతుల మధ్య అవగాహన కుదురుతుంది. బ్యాంకు లావాదేవీలు, రుణ ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. కొబ్బరి, పండ్లు, పూల, చిరు వ్యాపారులకు అన్నివిధాలా కలిసివస్తుంది. గిట్టనివారికి హితవు చెప్పి భంగపాటుకు గురవుతారు.


కుంభం: మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు. ఇతరులకు వాహనం ఇవ్వడం వలన సమస్యలు తలెత్తుతాయి. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదా పడుతాయి. ప్లీడర్లకు ఒత్తిడి, అక్కౌంట్స్ రంగాల వారికి పనిభారం, చికాకులు అధికమవుతాయి.మీనం: గృహోపకరాణాలకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. స్త్రీలకు షాపింగ్ విషయాలలో మెళకువ అవసరం. సోదరులతో అవగాహన లోపిస్తుంది. యాదృచ్ఛికంగా పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం విరివిగా ఖర్చు చేస్తారు.దీనిపై మరింత చదవండి :