శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

14-08-2020 శుక్రవారం రాశిఫలాలు - నృశింహ స్వామి స్తోత్రం పారాయణం చేస్తే...

మేషం : రాజకీయాలలో వారు కొన్ని అంశాలపై చర్య జరుపుట వల్ల జయం చేకూరుతుంది. ఉపాధ్యాయులకు పనిభారం అధికం. నిరుద్యోగులు చిన్న అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఉద్యోగస్తులకు పైఅధికారులతో సదావగాహన, తోటివారి సహకారం లభించదు. స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. 
 
వృషభం : ఏ పని మొదలుపెట్టినా మధ్యలో వదిలివేయకుండా పూర్తి చేయండి. అర్థాంతరంగా నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. ఏదైనా వస్తువు కొనుగోలుకు షాపింగ్ చేస్తారు. విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. వస్త్ర, ఫ్యాన్సీ, మందుల వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ది. 
 
మిథునం : ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోవడం మంచిది. కోర్టు వ్యవహారాలు వాయిదాపడటం మంచిది. పాత రుణాలు చెల్లిస్తారు. స్త్రీలకు అర్జనపట్ల ఆసక్తి, అందుకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలో వారికి పనిభారం అధికం అవుతుంది. 
 
కర్కాటకం : ఎదటివారితో ఆచితూచి సంభాషించండి. ప్రైవేటు సంస్థల్లో వారు అధికారులతో సంభాషించేటపుడు ఆత్మనిగ్రహం వహించవలసి ఉంటుంది. పాత మిత్రుల కలయికతో మీలో కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఖర్చులు అధికంగా ఉన్నా మీ అవసరాలు నెరవేరుతాయి. దూర ప్రయాణాలో ఏకాగ్రత చాలా అవసరం. 
 
సింహం : వైద్యులకు ఆపరేషన్లలో ఏకాగ్రత అవసరం. ఆకస్మిక ప్రయాణాలు వాయిదాపడతాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, చికాకులు పనిభారం అధికమవుతుంది. చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. దైవ, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
కన్య : స్త్రీలు నూతన పరిచయస్తులతో మితంగా సంభాషించడం మంచిది. నిరుద్యోగులు ఒక ప్రకటన పట్ల ఆకర్షితులవుతారు. చిన్నతరహా పరిశ్రమల వారికి అన్ని విధాలా కలిసివస్తుంది. భాగస్వామిక, జాయింట్ వెంచర్లు సంతృప్తికరంగా సాగుతాయి. సన్నిహితుల ద్వారా విలువైన సమాచారం అందుకుంటారు. 
 
తుల : రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి అధిక పర్యటనల వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. రాబడికి మించిన ఖర్చుల వల్ల చేబదుళ్లు తప్పవు. ఉద్యోగస్తులు సమర్థతను అధికారులు గుర్తిస్తారు. 
 
వృశ్చికం : ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు యధావిధిగా సాగుతాయి. రాజకీయాల వారికి పార్టీపరంగా గుర్తింపు లభిస్తుంది. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. స్త్రీలకు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. 
 
ధనస్సు : ఉద్యోగస్తులకు రావలసిన ప్రమోషన్‌లో జాప్యం తప్పదు. ఎల్.ఐ.సి ఏజెంట్లకు, బ్రోకర్లకు అధికారుల నుంచి ఒత్తిడి తప్పదు. మీ ఉన్నతిని చాటుకోవాలనే ఉద్దేశ్యంతో ధనం విరివిగా వ్యయం చేస్తారు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్త్రీలకు అయినవారి నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. 
 
మకరం : ప్రముఖుల కలయిక వల్ల కొన్ని పనులు సానుకూలమవుతాయి. దంపతుల మధ్య చిన్నచిన్న కలహాలు చోటుచేసుకుంటాయి. విద్యార్థినులకు ప్రేమ వ్యవహారాల్లో భంగపాటు తప్పదు. బిల్లులు చెల్లిస్తారు. ఉన్నతాధికారులపై దాడులు జరిగే ఆస్కారం ఉంది. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. 
 
కుంభం : ప్రైవేటు సంస్థలో వారికి యాజమాన్యం తీరు ఆందోళన కలిగిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. మీ సంతానం కోసం ఫీజులు, బిల్లులు చెల్లిస్తారు. ఉపాధ్యాయులకు విద్యార్థులతో సంబంధాలు మరింత మెరుగుపడతాయి. బ్యాంకు వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించండి. 
 
మీనం : ప్రభుత్వ మూలక ఇబ్బందులు ఎదురవుతాయి. ఆలయ సందర్శనాలతో ప్రశాంతత చేకూరుతుంది. పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం పెరుగుతుంది. రావలసిన ధనం అందటంతో తనఖా పెట్టిన వస్తువులు విడిపించుకుంటారు. స్థిరచరాస్తుల క్రయ, విక్రయాల్లో పునరాలోచన అవసరం.