మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Raman
Last Updated : బుధవారం, 14 నవంబరు 2018 (06:53 IST)

బుధవారం (14-11-2018) దినఫలాలు - చేసే పనిలో ఏకాగ్రత, పట్టుదల...

మేషం: ఆర్థికంగా ఎదగడానికి మీరు చేసే యత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. తలపెట్టిన పనులు త్వరిగతిన పూర్తిచేస్తారు. ఖర్చులు, అనుకోని చెల్లింపుల వలన ఆటుపోట్లు తప్పవు. నూతన వస్తువులను కొనుగోలుచేస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. నూతన వ్యాపారులకు కావలసిన పెట్టుబడి సమకూర్చుకుంటారు.
 
వృషభం: సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీపై మంచి ప్రభావం చూపుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించినప్పటికి వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతారు. చేసే పనిలో ఏకాగ్రత, పట్టుదల ఎంతో ముఖ్యమని గమనించండి. విద్యార్థినులకు వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత ముఖ్యం.
 
మిధునం: ఉద్యోగస్తులు తోటివారి కారణంగా అధికారులతో మాటపడవలసి వస్తుంది. వస్త్రం, బంగారం, ఫ్యాన్సీ, మందులు, పచారీ వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది. హోటల్, క్యాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు.
 
కర్కాటకం: ఆర్థిక ఇబ్బంది లేకపోయినా సంతృప్తి కానరాదు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి లాభదాయకంగా ఉంటుంది. ఉపాధ్యాయులకు ఒక వార్త ఎంతో ఆందోళన కలిగిస్తుంది. నిరుద్యోగులకు సత్‌కాలం ప్రారంభమవుతుంది. మీ కష్టం ఫలించడంతో అనిర్వచనీయమైన ఆనందం పొందుతారు.
 
సింహం: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల్లో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. వైద్యులకు ఒత్తిడి, ఇంజనీరింగ్ రంగాల్లో వారికి చికాకు వంటివి తలెత్తుతాయి. వ్యాపార రహస్యాలు గోప్యంగా ఉంచండి. నూతన దంపతులకు సంతానప్రాప్తి. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడుతాయి.
 
కన్య: బ్యాంకు వ్యవహారాల్లో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. కంప్యూటర్ రంగాల వారికి చికాకులు వంటివి తలెత్తుతాయ. ఉద్యోగస్తుల శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. వస్త్రాలు, ఆభరణాలు, విలువైన వస్తువులు అమర్చుకోవాలనే స్త్రీల కోరిక నెరవేరుతుంది. సన్నిహితులతో కలిసి పలు కార్యక్రమాలలో పాల్గొంటారు.
 
తుల: ప్రేమికులకు సన్నిహితులు అండగా నిలుస్తారు. ఉన్నత విద్య, పరిశోధనలు, చర్చలు, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. ప్రింటింగ్ రంగాల్లో వారు అచ్చు తప్పులు పడడం వలన మాటపడతారు. ఏజెంట్లు, బ్రోకర్లు వాదోపవాదాలకు దూరంగా ఉండడం మంచిది. స్త్రీలకు బంధువులతో పట్టింపులెదురవుతాయి.
 
వృశ్చికం: ఉద్యోగస్తులకు విధినిర్వహణలో తోటివారి సహాయ సహకారాలు లభిస్తాయి. కోర్టు వ్యవహారాలు ముందుకు సాగక నిరుత్సాహం చెందుతారు. గృహ నిర్మాణాలు, మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. మీ కళత్ర మెుండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. మీ నిర్లక్ష్యం వలన కొన్ని అవకాశాలు చేజార్చుకుంటారు.
 
ధనస్సు: ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థికలావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. విద్యార్థుల మెుండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. వృత్తిపరంగా ఎదురైన సమస్యలను అధికమిస్తారు. బంధువుల కోసం ధనం ఖర్చుచేస్తారు. స్త్రీలకు ప్రతి విషయంలోను తమ మాటె నెగ్గాలన్న పట్టుదల అధికమవుతుంది.
 
మకరం: ఆకస్మికంగా దూరప్రయాణాలు అనుకూలిస్తాయి. రేషన్ డీలర్లు, ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు అధికారుల వేధింపులు అధికం. స్త్రీలు ఉపవాసాలు, శ్రమాధిక్యత కారణంగా అస్వస్థతకు గురవుతారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. బంధుత్వాల విషయంలో చాలా గుడ్డిగా వ్యవహరిస్తారు.
 
కుంభం: ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం విరమించుకోవడం శ్రేయస్కరం. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లు రాణిస్తారు. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే కోరిక బలీయమవుతుంది. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేయగల్గుతారు.
 
మీనం: పారిశ్రామికి రంగాలవారికి అభ్యంతరాలు, ఇతరత్రా చికాకులు తప్పవు. ట్రాన్స్‌పోర్ట్, ట్రావెలింగ్, మెకానికల్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. దీర్ఘకాలిక పెట్టుబడులు, వ్యాపారాల విస్తరణల ఆలోచనలు వాయిదా వేయడం మంచిది. హామీలు, బ్యాంకు పనుల్లో ఏకాగ్రత వహించండి. దైవారాధన పట్ల ఆసక్తి పెరుగుతుంది.