Widgets Magazine

మంగళవారం (15-05-18) దినఫలాలు... ధనవ్యయం విషయంలో..

మేషం: భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ధనవ్యయం విషయంలో మెలకువ వహించండి. వ్యాపారాభివృద్ధికి చేసే కృషిలో సఫలీకృతులవుతారు. ఖర్చులు తగ్గించుకోవాలనే మీ యత్నం అనకూలించవు. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడ

astrology
raman| Last Updated: మంగళవారం, 15 మే 2018 (07:41 IST)
మేషం: భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ధనవ్యయం విషయంలో మెలకువ వహించండి. వ్యాపారాభివృద్ధికి చేసే కృషిలో సఫలీకృతులవుతారు. ఖర్చులు తగ్గించుకోవాలనే మీ యత్నం అనకూలించవు. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. సోదరీ, సోదరుల మధ్య అవగాహన ఏర్పుడుతుంది.
వృషభం: స్థిరాస్తి అమ్మకానికై చేయు ప్రయత్నాలు వాయిదా పడతాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. స్త్రీల మాటకు మంచి స్పందన లభిస్తుంది. దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి నెలకొంటుంది. సిమెంటు, ఐరన్, కలప, ఇటుక వ్యాపారులకు శుభదాయకం. ఎటువంటి క్లిష్ట సమస్యలైనా నిబ్బరంగా ఎదుర్కుంటారు.

మిధునం: కుటుంబీకుల మధ్య ముఖ్యమైన వ్యవహారాలలో ఏకీభావం కుదరదు. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికమవుతాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలలో తొందరపాటుతనం విడనాడండి. ఏ.సి., ఇన్‌వెర్టర్, ఎలక్ట్రానిక్ రంగాల వారికి పురోభివృద్ధి. ఊహించని ఖర్చులు ఎదురైనా ఆర్ధిక ఇబ్బందులు అంతగా ఉండవు.
కర్కాటకం: ఆధ్యాత్మిక, సేవా, సాంఘీక కార్య క్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉపాధ్యాయులకు బరువు, బాధ్యతలు అధికం అవుతాయి. ప్లీడర్లకు ఆశాజనకం. స్త్రీలకు అధిక శ్రమ, నిరుత్సాహం తప్పదు. పత్రిక, ప్రైవేటు సంస్ధలలోని వారికి, యాజమాన్యంతో ఏకీభావం కుదరదు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.

సింహం: ఆర్థిక లావాదేవీలు అనుకూలించవు. రాజకీయాల్లో వారు తమ ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగ రంగాల్లో వారికి వారి హోదా పెరిగే సూచనలున్నాయి. దైవదర్శనాలు చేస్తారు. కుటుంబ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు అన్నింటా తమ ప్రతిభను నిరూపించుకుంటారు.
కన్య: స్త్రీల నిర్లక్ష్యం, అజాగ్రత్త వల్ల విలువైన వస్తువులు జారిపోయేందుకు ఆస్కారం ఉంది. వైద్యులకు సంతృప్తి, ఆడిటర్లకు ఒత్తిడి. సాహస ప్రయత్నాలు విరమించండి. అనుకోని ఖర్చులు, సమయానికి ధనం అందకపోవటం వంటి చికాకులు ఎదుర్కోక తప్పదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో వారికి సామాన్యం.

తుల: స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్ధుల ఆలోచనలు పక్కదారి పట్టకుండా మెలకువతో వ్యవహరించవలసి ఉంటుంది. బంధుమిత్రుల నుంచి అపనిందలను ఎదుర్కుంటారు. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకులపరుస్తాయి.

వృశ్చికం: కొబ్బరి, పండ్ల, పూల, పానీయ, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. సర్దుబాటు ధోరణితో వ్యవహరించి కొన్ని సమస్యలను అధికమిస్తారు. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు, అనుకూలిస్తాయి.

ధనస్సు: వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది. ముఖ్యుల కోసం ధనం బాగుగా వెచ్చిస్తారు. నిర్మాణ పనులలో సంతృప్తి కానవస్తుంది. విద్యార్థులకు విద్యావిషయాల్లో ఏకాగ్రత అవసరం. చిన్న చిన్న విషయాలలో ఉద్రేకం మాని ఓర్పు, విజ్ఞతాయుతంగా వ్యవహరించవలసి ఉంటుంది.
మకరం: కాంట్రాక్టర్లకు పనివారలతో చికాకులు తప్పవు. ప్రయాణాల్లో ఒకింత నిరుత్సాహం తప్పదు. బ్యాంకు వ్యవహారాలలో అప్రమత్తత చాలా అవసరం. కొత్త వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగండి. భాగస్వామిక చర్చలు కొత్త మలుపు తిరుగుతాయి. దైవ, సేవా సంస్థలకు సహాయ సహకారాలు అందిస్తారు.

కుంభం: నిరుద్యోగుల ఆలోచనలు ఉపాథి పథకాల దిశగా సాగుతాయి. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. ఉద్యోగస్తులు తోటివారి ద్వారా శుభవార్తలు వింటారు. స్త్రీలకు బంధుమిత్రులతో విభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. నిరుద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి.
మీనం: ఏజెంట్లకు, బ్రోకర్లకు, రియల్ ఎస్టేట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. స్ధిరచరాస్తులుకొనుగోలు చేస్తారు. ఐరన్, కలప, సిమెంటు వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు పొందుతారు. విద్యార్థినులకు తోటీవారి కారణంగా ఇబ్బందులు తప్పవు. నూతన ప్రదేశ సందర్శనలు, తీర్థయాత్రలు, విదేశీయానం అనుకూలిస్తాయి.


దీనిపై మరింత చదవండి :