శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

20-03-2020 శుక్రవారం దినఫలాలు - సత్యనారాయణ స్వామిని ఆరాధిస్తే..

మేషం : స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలోనూ, ప్రయాణాలలోనూ మెళకువ అవసరం. అనువుకానిచోట ఆధిపత్యం చెలాయించడం మంచిదికాదు. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలో వారు అచ్చు తప్పులు పడటం వల్ల మాటపడాల్సి వస్తుంది. రాజకీయాలలో వారికి విరోధులు వేసే పథకాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. 
 
వృషభం : గృహోపకరణాల పట్ల మక్కువ పెరుగుతుంది. స్త్రీలకు నూతన పరిచయాలు వ్యాపకాలు అధికం. బంధువుల ఆకస్మిక రాకవల్ల ఖర్చులు అధికమవుతాయి. స్థిర, చరాస్తుల విక్రయాలు వాయిదాపడతాయి. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. ఉన్నత విద్య, పరిశోధనలు, చర్చలు, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. 
 
మిథునం : మీకు దగ్గరగా ఉన్న మీకే తెలియని ఒక అవకాశాన్ని మిమ్మల్ని వరిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. హోటల్, తినుంబడ రంగాల్లో వారికి చికాకులు తలెత్తుతాయి. స్త్రీలకు అయినవారిని చూడాలనే ఆలోచన స్ఫురిస్తుంది. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి.  
 
కర్కాటకం : ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. రుణదాతల నుంచి ఒత్తిడి, కుటుంబంలో అశాంతి, చికాకులు అధికమవుతాయి. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళకువ అవసరం. స్త్రీలకు ఆరోగ్యపరంగా, ఇతరాత్రా చికాకులు ఎదుర్కోనక తప్పదు. 
 
సింహం : శాంతియుతంగా వ్యవహరిస్తే మీ సమస్యలు సానుకూలమవుతాయి. ఎవరికైనా ధనసహాయం చేసినా తిరిగిరాజాలదు. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి పనిలో ఒత్తిడి, చికాకులు తప్పవు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహించడం వల్ల మంచి గుర్తింపు లభిస్తుంది. వస్త్ర, వ్యాపారస్తులకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. 
 
కన్య : కొత్తగా చేపట్టిన వ్యాపారాల గురించి ఒక నిర్ణయానికి వస్తారు. ధనం విపరీతంగా వ్యయం చేసే మీ ధోరణిని మార్చుకోవడం శ్రేయస్కరం. విద్యార్థుల ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. 
 
తల : ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి, చికాకులు తప్పవు. ఉద్యోగస్తులకు బాధ్యతలతో పాటు పనిలో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. కుటుంబీకుల మధ్య కొత్త కొత్త విషయాలు చర్చకు వస్తాయి. దంపతుల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది. కాలానుగుణంగా మీ సమస్యలు పరిష్కారమవుతాయి. 
 
వృశ్చికం : పాత సమస్యలు పరిష్కార మార్గంలో నడుస్తాయి. ఒక కార్యం నిమిత్తం దూర ప్రయాణం చేయవలసి వస్తుంది. మీ కళత్రమొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. చివరి క్షణంలో చేతిలో ధనం అందక ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. ద్విచక్ర వాహనాలపై దూర ప్రయాణం మంచిదికాదని గమనించండి. 
 
ధనస్సు : కోర్టు వాదోపవాదాల్లో ఫ్లీడర్లకు చికాకులు తప్పవు. ఉద్యోగస్తుల సమర్థత, సమయస్ఫూర్తికి అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. బంధువులతో సమస్యలు తలెత్తవచ్చు. ప్రత్యర్థుల విషయంలో అప్రమత్తంగా మెలగండి. అప్పుడప్పుడు కాళ్లు, నడుం, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. 
 
మకరం : స్త్రీలకు చాలా యోగప్రదంగా ఉండగలదు. మీ ఓర్పు, విజ్ఞతకు ఇది పరీక్షా సమయమని గమనించండి. పొదుపు పథకాలు లాభిస్తాయి. దంపతుల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది. మీ పట్ల ముభావంగా ఉండే వ్యక్తులు మీ సాన్నిత్యం కోరుకుంటారు. ఒకరికి సలహా ఇచ్చి మరొకరి ఆగ్రహానికి లోనవుతారు. 
 
కుంభం : ఆలయ సందర్శనాలలో ఇబ్బందులు తలెత్తుతాయి. ప్రముఖుల కలయిక వల్ల ఆశించిన ఫలితం ఉంటుంది. రాబోయే ఆదాయానికి తగినట్టుగానే ఖర్చులు సిద్ధంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. స్త్రీలు, విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. 
 
మీనం : సంఘంలో మంచి పేరు, ఖ్యాతి గడిస్తారు. స్త్రీల పేరిట ఆస్తి కొనుగోలు చేస్తారు. ప్రత్యర్థుల విషయంలో అప్రమత్తంగా మెలగండి. ఉపాధ్యాయులకు, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. ఆర్థిక సమస్యలు క్రమంగా సర్దుకుంటాయి. ధనం బాగా అందుట వల్ల ఏకొంతైనా నిల్వచేయగలుగుతారు.