గురువారం, 28 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : గురువారం, 21 జూన్ 2018 (08:43 IST)

21-06-2018 గురువారం దినఫలాలు - భాగస్వామితో సున్నితంగా..

మేషం: రిప్రజెంటేటివ్‌లు, ఉపాధ్యాయులకు ఒత్తిడి పెరుగుతుంది. ఇతరులకు వాహనం ఇచ్చి ఇబ్బందులకు గురవుతారు. కాంట్రాక్టర్లకు చేపట్టిన పనులలో ఏకాగ్రత లోపం వల్ల అధికారులతో మాటపడవలసివస్తుంది. షేర్ల అమ్మకం కంటె క

మేషం: రిప్రజెంటేటివ్‌లు, ఉపాధ్యాయులకు ఒత్తిడి పెరుగుతుంది. ఇతరులకు వాహనం ఇచ్చి ఇబ్బందులకు గురవుతారు. కాంట్రాక్టర్లకు చేపట్టిన పనులలో ఏకాగ్రత లోపం వల్ల అధికారులతో మాటపడవలసివస్తుంది. షేర్ల అమ్మకం కంటె కొనుగోళ్ళే లాభదాయకం. ఏజెన్సీ, నూతన టెండర్ల విషయంలో పునరాలోచన అవసరం. 
 
వృషభం: ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి, చికాకులు వంటివి తలెత్తుతాయి. శస్త్రచికిత్సల సమయంలో డార్టర్లకు ఏకాగ్రత చాలా అవసరం. వాతావరణంలో మార్పుతో రైతులు ఊరట చెందుతారు. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధాపడటం మంచిది కాదు. ఉపాధ్యాయులకు ఆర్థిక ప్రగతితో కూడిన అవకాశాలు లభిస్తాయి. 
 
మిధునం: నిరుద్యోగులు బోగస్ ప్రకటనల వల్ల నష్టపోయే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. రాబోయే ఆదాయానికి తగినట్టుగా ప్రణాళికలు రూపొందించుకుంటారు. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారాలు సంతృప్తినిస్తాయి. ఆధ్యాత్మిక సమావేశాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి అమ్మకం పై ఒత్తిడి, ఆందోళనలకు గురవుతారు. 
 
కర్కాటకం: వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో సామాన్య ఫలితాలనే పొందుతారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటంతో నిరుత్సాహం చెందుతారు. మీ రాక బంధు మిత్రులకు సంతోషం కలిగిస్తుంది. ఖర్చులు ప్రయోజనకరంగా ఉంటాయి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాథి పథకాల్లో రాణిస్తారు. ఉద్యోగ యత్నాలు ముమ్మరం చేస్తారు.
 
సింహం: సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారాలు ఆశించినంత లాభసాటిగా ఉండవు. గృహంలో స్వల్ప మార్పులు చేపడుతారు. ఇతరుల వ్యాఖ్యాలు మీపై తీవ్ర ప్రభావం చూపుతాయి. మీ సంతానం ఉన్నతి కోసం బాగ శ్రమిస్తారు. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు కొత్త ఉత్సాహాన్నిస్తాయి.
 
కన్య: మీ జీవిత భాగస్వామితో సున్నితంగా వ్యవహరించండి. దైవ, సేవా, పుణ్య కార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. రాజకీయనాయకులు సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. స్త్రీలపై చెప్పుడు మాటల ప్రభావం అధికంగా ఉంటుంది. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం.
 
తుల: ఉద్యోగస్తులు ఒత్తిడి, ప్రలోభాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. స్థిరాస్తి కొనుగోలు యత్నాలు వేగమవుతాయి. వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్త పథకాలు రూపొందిస్తారు. ప్రముఖులతో పరిచయాలు నూతన బంధుత్వాలు ఏర్పడుతాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఒప్పందాల్లో పెద్దల సలహా పాటించడం మంచిది. 
 
వృశ్చికం: ప్రింటింక్ రంగాల వారికి బాకీలు వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలను ఎదుర్కుంటారు. వ్యాపార రంగాలవారికి అధికారుల తనిఖీలు, పనివారల నిర్లక్ష్యం ఆందోళన కలిగిస్తాయి. సంఘంలోనూ కుటుంబంలోనూ గౌరవ మర్యాదలు పొందుతారు. వసతి ఏర్పాట్ల విషయంలో చికాకులు ఎదురవుతాయి. 
 
ధనస్సు: ప్రియతములతో సఖ్యత నెలకొంటుంది. చిన్ననాటి మిత్రులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు ఊహించని ఆటంకాలెదురవుతాయి. పత్రికా సిబ్బందికి వార్తర ప్రచురణలో పునరాలోచన మంచిది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఉద్యోగస్తులకు ఉన్నత హోదాలురాగలవు.
 
మకరం: హోటల్, తినుబండారు వ్యాపారులకు లాభదాయకం. విద్యుత్, ఎ.సి. కూలర్ మెకానికల్ రంగాలలోని వారికి సంతృప్తి కానవస్తుంది. చిన్న చిన్న విషయాలపై కూడా ఆసక్తి పెరుగుతుంది. పాత సంబంధ భాంధవ్యాలు మెరుగుపడుతాయి. మీ శ్రీమతి వైఖరిలో ఆశించిన మార్పు, గృహ ప్రశాంతత పొందుతారు.
 
కుంభం: మీ కళత్ర మెుండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. స్త్రీలకు ఆరోగ్య విషయంలో ఏమరుపాటు, అశ్రద్ధకూడదు. రిప్రజెంటేటివ్‌లు తమ టార్గెట్లను అతికష్టంమ్మీద పూర్తిచేస్తారు. పొదుపు పథకాలు, స్థిరాస్తి కొనుగోలు దిశగా మీ ఆలోచనలుంటాయి.
 
మీనం: బ్యాంకింగ్ రంగాల వారికి పనిలో ఒత్తిడి, చికాకులు తప్పవు. రాజకీయ రంగాలవారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. ఉపాధ్యాయులకు ఊహించని వారి నుంచి సదవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత అవసరం. తరుచు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు.