మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : మంగళవారం, 22 జనవరి 2019 (09:10 IST)

22-01-2019 మంగళవారం దినఫలాలు - అర్థాంతంగా నిలిపివేసిన...

మేషం: గతంలో ఒకరికిచ్చిన హామీ వలన వర్తమానంలో ఇబ్బందులు ఎదుర్కుంటారు. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ ఆలోచన ఫలిస్తుంది. వైద్యులకు మెళకువ అవసరం. ఉద్యోగస్తులకు అధికారులతో పర్యటనలు, పనిభారం, అదనపు బాధ్యతలు వంటి పరిణామాలుంటాయి. స్త్రీలకు పనివారితో చికాకులు వంటివి తప్పవు.
 
వృషభం: వైద్య రంగాల వారికి మంచి గుర్తింపు, ఆదాయం లభిస్తుంది. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు వసూలుల్లో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనలు, పరిచయం లేని వ్యక్తుల పట్ల జాగ్రత్త అవసరం. కోర్టు, ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. ప్రతీ విషయానికి ఓర్పు, సఖ్యత అవసరం. 
 
మిధునం: ఒక స్థిరాస్తి కొనుగోలుకు యత్నాలు సాగిస్తారు. సన్నిహితుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. మీ బాధ్యతలను ఇతరులకు అప్పగించడం మంచిది కాదు. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. పత్రికా వార్త సంస్థల్లోని వారికి ఒత్తిడి, చికాకులు తప్పవు. నేడు చేజారిన అవకాశం రేపు కలిసివస్తుంది. 
 
కర్కాటకం: రాజకీయనాయకులు సభలు, సమావేశాలు, బృంద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీరు ఊహించిన దానికంటే అధికంగా వ్యయం అవుతుంది. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండడం క్షేమదాయకం. ప్రయాణాలు, బ్యాంకు పనులు, ఇచ్చిపుచ్చుకునే విషయాల్లో మెళకువ వహించండి. 
 
సింహం: ఇంటర్వ్యూల్లో అనుకూల ఫలితాలు. ఇతరులకు పెద్దమొత్తంలో ధనసహాయం చేసే విషయంలో పునరాలోచన మంచిది. సొంత వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. దూరప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు. దైవదర్శనాలలో చురుకుగా పాల్గొంటారు. క్లిష్ట సమయంలో బంధుమిత్రులు జారుకుంటారు. 
 
కన్య: అర్థాంతంగా నిలిపివేసిన గృహ మరమ్మత్తులు, పనులు పునఃప్రారంభిస్తారు. స్త్రీలు ఆభరణాలు, విలువైన వస్తువుల పట్ల ఆసక్తి నెలకొంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు, సంప్రదింపులతో క్షణం తీరిక ఉండదు. ఆర్థిక, కుటుంబ, వ్యాపారా వ్యవహారాల పట్ల ఏకాగ్రత ముఖ్యం. కొత్త పనివారలతో చికాకులు ఎదుర్కుంటారు.  
 
తుల: ఏవైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తినా తాత్కాలికమేనని గ్రహించండి. అనుకున్న పనులలో ఆటంకాలు ఎదురైనా మొండి ధైర్యంతో ముందుకుసాగి పూర్తిచేస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. మీ వాహనం ఇతరుల కిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. ఐరన్, ఆటోమోబైల్, మెకానికల్ రంగాల్లో వారికి లాభదాయకం. 
 
వృశ్చికం: పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల వారికి అనుకూలం. వృత్తుల వారికి శ్రమించిన కొలదీ ఆదాయం. స్త్రీలతో మితంగా సంభాషించడం అన్ని విధాలా మంచిది. ఉద్యోగస్తులు అధికారుల నుండి మెప్పు పొందుతారు. పాత వస్తువులను కొని సమస్యలు తెచ్చుకోకండి. విద్యార్థినులకు కొత్త పరిచయాలు, వాతావరణం సంతృప్తినిస్తాయి.  
 
ధనస్సు: ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు. స్త్రీల ఏమరుపాటుతనం వలన విలువైన వస్తువులు చేజార్చుకునే అవకాశం ఉంది. రాత పరీక్షల యందు మీరు గణనీయమైన విజయాన్ని సాధిస్తారు. సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. మార్కెటింగ్, ఉద్యోగాలకు టార్గెట్ పూర్తి అవ్వడం కష్టంతరమవుతుంది. 
 
మకరం: నూనె, ఎండుమిర్చి, బెల్లం, చింతపండు, వ్యాపారస్తులకు కలిసివచ్చేకాలం. ఒక ఖర్చునిమిత్తం తెచ్చిన ధనం మరొక అవసరానికి వినియోగిస్తారు. పాత మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. రవాణా రంగాల వారికి సంతృప్తి, పురోభివృద్ధి. మీకు దగ్గరగా ఉన్న, మీకే తెలియని ఒక అవకాశం మిమ్మల్ని వరిస్తుంది.    
 
కుంభం: విద్యార్థుల అనవసర విషయాలకు దూరంగా ఉండడం మంచిది. హోటల్, క్యాటరింగ్ పనివారలకు కలిసిరాగలదు. ఎంత కష్టమైన పనైనా అవలీలగా పూర్తిచేస్తారు. నిరుద్యోగులకు ఇంటర్యూలు వచ్చినప్పడికి వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతారు. కుటుంబ విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి.   
 
మీనం: వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ వ్యాపారులకు ఒత్తిడి పెరుగుతుంది. బ్యాంకు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. సంఘంలో మీ ఉన్నతికి, పరపతికి గౌరవం, గుర్తింపు లభిస్తాయి. రాజకీయ, కళా రంగాల వారికి విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. స్త్రీలు ఆడంబరాలకు పోయి సమస్యలు తెచ్చుకోకండి.