గురువారం, 28 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : సోమవారం, 22 ఏప్రియల్ 2019 (18:12 IST)

22-04-2019 సోమవారం దినఫలాలు - కన్య రాశివారి ఆలోచనలు...

మేషం: కొత్త సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది, మెళకువ వహించండి. ఉద్యోగస్తులు యూనియన్ కార్యకలాపాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. రావలసిన ధనంలో కొంత మొత్తం వసూలు కాగలవు. దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు. స్టాక్ మార్కెట్ రంగాల వారికి నిరుత్సాహం వంటివి తప్పదు.
 
వృషభం: వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ, గృహోపకరణ వ్యాపారాలు ఊపందుకుంటాయి. శ్రమాధిక్యత మినహా ఆశించిన ఫలితాలు పొందలేరు. నిరుద్యోగులకు అవకాశం చేజారిపోయే ఆస్కారం ఉంది. ఖర్చులు, చెల్లింపులు ప్రయోజనకరంగా ఉంటాయి. భాగస్వామిక ఒప్పందాలు, ప్రముఖులతో చర్చలు సత్ఫలితాలిస్తాయి.
 
మిధునం: నిరుద్యోగులు ఉపాధి పథకాల్లో రాణిస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు. ప్రత్త్యర్థులు సైతం వీరి ఔనత్యాన్ని గుర్తిస్తారు. వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో రాణిస్తారు. చేతి వృత్తుల వారికి సంతృప్తి, పురోభివృద్ధఇ. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో పునరాలోచన అవసరం. ఆలయాలను సందర్శిస్తారు.
 
కర్కాటకం: శ్రమక ఫలితం దక్కుతుంది. ఊహించని ఖర్చులు చికాకు పరుస్తాయి. ప్రైవేటు సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. స్థిరాస్తి క్రయవిక్రయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ప్రేమికుల మధ్య పరస్పర అవగాహన కుదరదు.
 
సింహం: వ్యాపారాభివృద్ధఇకి మీరు చేసే ప్రణాళికలు పథకాలూ సత్ఫలితాలనిస్తాయి. ధనం విపరీతంగా వ్యయం అయినా ప్రయోజనకరంగా ఉంటుంది. స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. వాహన సౌఖ్యం, పదోన్నతి వంటి శుభపరిణామాలుంటాయి. ఓర్పు, కార్యదీక్షతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు.
 
కన్య: బంధుమిత్రుల రాకపోకలు అధికం. పీచు, ఫోం, లెదర్, గృహోపకరణాల వ్యాపారులకు పురోభివృద్ధఇ. ఆలోచనలు అమలు చేస్తారు. చేపట్టిన పనులు కొంత ఆలస్యంగానైనా సంతృప్తికరంగా పూర్తిచేస్తారు. కొన్ని విషయంలో కుటుంబీకుల ధోరణి చికాకు కలిగిస్తుంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాలల్లో వారికి శుభదాయకం. 
 
తుల: కంది, మిర్చి, నూనె, ధాన్యం, అపరాలు వ్యాపారులకు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. ప్రయాణాలు, దైవకార్యాలు ఉల్లాసం కలిగిస్తాయి. శ్రమాధిక్యత, అకాల భోజనం వలన ఆరోగ్యం మందగిస్తుంది. మీ యత్నాలకు ప్రముఖుల నుండి సహాయ సహకారాలు అందిస్తారు. మీ మనోవాంఛ నెరవేరే సమయం ఆసన్నమైనదని గమనించండి.
 
వృశ్చికం: స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి సదవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులు ఎదుటివారిని తక్కువ అంచనా వేయడం వలన మాటపడతారు. స్త్రీలు ఒత్తిడికి లోనైన మంచి గుర్తింపు లభిస్తుంది. భాగస్వామ్యుల మధ్య నూతన ఆలోచనలు స్పురిస్తాయి. రాజకీయాల్లో వారు విరోధులు వేసే పథకాలను తెలివితో ఎదుర్కుంటారు. 
 
ధనస్సు: చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా మీ తెలివితేటలతో పూర్తి చేయగలుగుతారు. పారిశ్రామికులకు కార్మికులతో సంబదం బాంధవ్యాలు మెరుగుపడుతాయి. లీజు, ఏజెన్సీ, ఉమ్మడి వ్యాపారులకు సంబంధించిన విషయాల్లో ఏకాగ్రత వహించండి. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, తగు ప్రోత్సాహం లభిస్తుంది. 
 
మకరం: ప్రముఖుల సహకారంతో ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు పూర్తవుతాయి. హోటల్, తినుబండారాలు, బేకరీ, పండ్ల వ్యాపారులకు లాభదాయకం. కొబ్బరి, పండ్లు, పూల, కూరగాయల వ్యాపారులకు లాభదాయకం. పారిశ్రామిక రంగం వారికి అధికారుల వేధింపులు, కార్మిక సమస్యలు అధికమవుతాయి. 
 
కుంభం: ఉద్యోగులు పదోన్నతి, స్థానమార్పిడి యత్నాలలో సఫలీకృతులవుతారు. ముఖ్యుల రాకపోకల వలన అనుకోని ఖర్చులు అధికమవుతాయి. నూతన పరిచయాలు, సంబంధ బాంధవ్యాలు మెరుగుపడుతాయి. చేపట్టిన పనులలో ఓర్పు, అధిక శ్రమ చాలా అవసరం. నిర్మాణ పనులలో సంతృప్తి, పురోభివృద్ధి కానవస్తుంది. 
 
మీనం: వ్యవసాయదారులు త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడం వలన సంతృప్తి పొందుతారు. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాలలో చురుకుగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు శ్రమాధిక్యత, మినహా ఆశించిన ఫలితాలు పొందలేరు. విద్యార్థులకు తమ ధ్యేయం వలన ఆసక్తి, శ్రద్ధ పెరుగుతాయి.