శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

24-08-2020 సోమవారం దినఫలాలు - ఈశ్వరుడుని పూజిస్తే జయం - శుభం

మేషం : వైద్య, ఇంజనీరింగ్, కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి. ప్రముఖులు, అయినవారిని కలుసుకుంటారు. మీ యత్నాల్లో పొరపాట్లు దొర్లే ఆస్కారం ఉంది. దూర ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. వ్యవసాయ రంగాల వారికి నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. 
 
వృషభం : ఆదాయ వ్యయాలకు బడ్జెట్ రూపొందించుకుంటారు. సిమెంట్, కలప, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. మీ అజాగ్రత్త వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. దైవ, సేవా కార్యక్రమాల కోసం ధనం అధికంగా ఖర్చు చేస్తారు. మీ మాటకు సర్వత్రా ఆమోదం లభిస్తుంది. 
 
మిథునం : వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలుదార్లను ఆకట్టుకుంటాయి. మీ యత్నాల్లో పొరపాట్లు దొర్లే ఆస్కారం ఉంది. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. చేపట్టిన పనుల్లో ఆటంకాలెదురైనా మొండిగా పూర్తి చేస్తారు. వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తారు. 
 
కర్కాటకం : ఫ్యాన్సీ, మందులు, ఎరువుల వ్యాపారాలకు పురోభివృద్ధి. దేవ, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీపై శకునాలు, చెప్పుడు మాటల ప్రభావం అధికం. చిట్స్, ఫైనాన్స్ రంగాల వారికి ఆటుపోట్లు తప్పవు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. చేపట్టిన పనుల్లో ఆటంకాలెదురైనా మొండిగా పూర్తిచేస్తారు. 
 
సింహం : రాజకీయాలలో వారు కొన్ని అంశాలపై చర్య జరుపుటవల్ల జయం చేకూరుతుంది. ఉపాధ్యాయులకు పనిభారం అధికం. క్రయ విక్రయాల్లో పునరాలోచన అవసరం. కోర్టు వ్యవహారాలు ప్రగతిపథంలో నడుస్తాయి. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారలు, సంప్రదింపులకు సంబంధించిన విషయాల్లో ఏకాగ్రత అవసరం. 
 
కన్య : పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికారమవుతాయి. స్థిరాస్తి వ్యవహారాలు, వాణిజ్యం ఒప్పందాలు ఒక కొలిక్కివస్తాయి. మీ ఆంతరంగిక వ్యవహారాలు గోప్యంగా ఉంచండి. మీ లక్ష్య సాధనకు పట్టుదల, ఓర్పు ముఖ్యమని గమనించండి. ప్రాప్తించబోయే ధనానికి ముందుగానే ఖర్చులు ఎదురవుతాయి. 
 
తుల : ఆలయ సందర్శనాలలో ప్రశాంతత చేకూరుతుంది. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ప్రయాణాలు అనుకూలించవు.. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. మీ సంతానం కోసం ఫీజులు, బిల్లులు చెల్లిస్తారు. 
 
వృశ్చికం : నిరుద్యోగులు ఒక ప్రకటన పట్ల ఆకర్షితులవుతారు. వృత్తి, ఉద్యోగ సమస్యలు నుంచి ఊరట లభిస్తుంది. స్త్రీలకు బంధు వర్గాలతో పట్టింపులు అధికమవుతాయి. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రభుత్వ మూలక ఇబ్బందులు ఎదురవుతాయి. సన్నిహితులు ద్వారా విలువైన సమాచారం అందుకుంటారు. 
 
ధనస్సు : ఉద్యోగరీత్యా దూర ప్రయాణాలు వాయిదాపడతాయి. వ్యాపారస్తులు ఊహించని లాభాలను సొంతం చేసుకుంటారు. రాబడికి మంచిన ఖర్చుల వల్ల చేబదుళ్లు తప్పవు. ఉపాధ్యాయులకు విద్యార్థులతో సంబంధాలు మరింత పెరుగుతాయి. స్త్రీలు నూతన పరిచయస్తులతో మితంగా సంభాషించడం మంచిది. 
 
మకరం : బ్యాంకు వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించండి. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులు సమర్థతను అధికారులు గుర్తిస్తారు. ఇతరులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ సంతానం భవిష్యత్తు గురించి కొత్త పథకాలు వేస్తారు. మీ సమర్థత, వాక్చాతుర్యం ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. 
 
కుంభం : భాగస్వామిక, జాయింట్ వెంచర్లు సంతృప్తికరంగా సాగుతాయి. ప్రముఖుల సహాయం పొందుతారు. ప్రింటింగ్ రంగాల వారికి పనివారితో చికాకులు తప్పవు. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారిక అధిక పర్యటనల వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ప్రైవేటు సంస్థల్లో వారికి యాజమాన్యం తీరు ఆందోళన కలిగిస్తుంది. 
 
మీనం : దైవ దర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు, సూచనలకు ఆమోదం లభిస్తుంది. మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. రావలసిన ధనం అందడంతో తనాఖా పెట్టిన వస్తువులు విడిపించుకుంటారు. చిన్నతరహా పరిశ్రమల వారికి అన్ని విధాలా కలిసివస్తుంది.