శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

25-04-2021 - ఆదివారం మీ రాశి ఫలితాలు.. ఇష్టదేవతను ఆరాధిస్తే..?

ఇష్టదేవతను ఆరాధిస్తే.. మనోసిద్ధి, సంకల్పసిద్ధి చేకూరుతుంది. 
 
మేషం: మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. దంపతుల మధ్య దాపరికం అనర్ధాలకు దారితీస్తుంది. విందు, వినోదాల్లో చురుకుగా పాల్గొంటారు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఏ విషయంలోను ఒంటెత్తు పోకడ, అనాలోచితంగా మాట ఇవ్వడం మంచిది కాదు. 
 
వృషభం: స్త్రీలకు షాపింగ్‌లో దుబారా ఎక్కువగా ఉండే అవకాశం వుంది. మీ చిన్నారుల మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఆత్మీయుల నడుమ విలువైన కానుకలిచ్చిపుచ్చుకుంటారు. గృహంలో ఒక శుభకార్యం నిర్విఘ్నంగా పూర్తవుతుంది. ఇతరులకు ఉచిత సలహా ఇచ్చి ఇబ్బందులకు గురికాకండి. 
 
మిథునం: నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. ఎదురుచూడకుండానే మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి. గృహావసరాలకు నిధులు సమకూర్చుకుంటారు. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. క్రీడల పట్ల, కళల పట్ల ఆసక్తి పెరుగును. 
 
కర్కాటకం: అవగాహన లేని వ్యాపారాలు, వ్యవహారాలకు దూరంగా వుండటం మంచిదని గమనించండి. మీ ప్రయాణాలకు, కార్యక్రమాలకు స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. ఇతరులు మీ పట్ల ఆకర్షితులౌతారు. క్రయ విక్రయాల్లో మెళకువ వహించండి. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. 
 
సింహం: వ్యాపారులకు, రేషన్ డీలర్లకు అధికారుల వేధింపులు అధికం. ఆత్మీయులు, కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాల విస్తరణలు, సంస్థల స్థాపనలకు కావలసిన అనుమతులు మంజూరవుతాయి. స్త్రీలకు అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. మీడియా రంగాల వారికి ఒత్తిడి, చికాకులు అధికం. 
 
కన్య: ఫైనాన్స్, చిట్స్ వ్యాపారులకు ఖాతాదారులతో సమస్యలు తలెత్తుతాయి. స్త్రీలు గృహోపకరణ వస్తువులను సమకూర్చుకుంటారు. ముఖ్యుల కోసం మీ పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ఆత్మీయులు, కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రముఖుల కలయిక అనుకూలించినా ఆశించిన ఫలితం వుండదు.
 
తుల: రాజకీయ నాయకులకు కార్యకర్తల వల్ల చికాకులు తప్పవు. స్త్రీలకు దూర ప్రయాణాల్లో పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. యోగ, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బంధుమిత్రులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. కొబ్బరి, పండ్ల, పానీయ, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. 
 
వృశ్చికం: వాయిదా పడిన మొక్కుబడులు తీర్చుకుంటారు. కార్యసాధనలో అనుకూలత, ప్రత్యర్థి వర్గాలపై విజయం సాధిస్తారు. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ధనవ్యయం విపరీతంగా ఉన్నా సార్థకత ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం.
 
ధనస్సు: వేళతప్పి భోజనం, శారీరక శ్రమ వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. మీ ఓర్పు, నేర్పులకు ఇది పరీక్షా సమయం. వృత్తుల వారికి బాధ్యతలు పెరుగుతాయి. దైవ కార్యక్రమాల పట్ల ఏకాగ్రత అధికమవుతాయి. కష్ట సమయంలో ఆత్మీయులు చేదోడు వాదోడుగా నిలుస్తారు. స్త్రీలు పనివారలతో సమస్యలు ఎదుర్కొంటారు.
 
మకరం: రవాణా రంగంలోని వారికి లాభదాయకంగా ఉంటుంది. ప్రతి విషయంలోను ఆచితూచి వ్యవహరించండి. ఖర్చులు ప్రయోజనకరంగా ఉంటాయి. క్రయ విక్రయాల్లో ప్రతికూలతలు ఎదుర్కొంటారు. స్త్రీలకు వైద్య సలహాలు, ఔషధ సేవనం తప్పవు. నిరుద్యోగులకు ప్రకటనల విషయంలో అప్రమత్తత అవసరం.
 
కుంభం: ఆర్థికస్థితి సామాన్యంగా ఉంటుంది. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి. ఖర్చులు అవసరాలకు సరిపడు ధనం సమకూర్చుకుంటారు. గృహంలో ఒక శుభకార్యానికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి. బంధువుల ఆకస్మిక రాకతో కొంత అసౌకర్యానికి లోనవుతారు.
 
మీనం: నూతన పెట్టుబడులు, లీజు, ఏజెన్సీలకు సంబంధించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. అవివాహితులలో నూతనోత్సాహం చోటుచేసుకుంటాయి. విదేశాల్లోని క్షేమ సమాచారాలు తెలుసుకుంటారు. వృత్తుల వారికి శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది.