శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Raman
Last Updated : శుక్రవారం, 28 సెప్టెంబరు 2018 (07:36 IST)

28-09-2018 - శుక్రవారం దినఫలాలు... విదేశాలు వెళ్ళాలనే మీ కోరిక త్వరలోనే?

మేషం: స్త్రీలు శారీరక మానసిక వేదనకు గురవుతారు. సోదరీసోదరులతో సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉంటాయి. మీరు కోరుకునే మార్పులు నిదానంగా అనుకూలిస్తాయి. కాంట్రాక్టర్లకు బిల్డర్లకు ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. నిర

మేషం: స్త్రీలు శారీరక మానసిక వేదనకు గురవుతారు. సోదరీసోదరులతో సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉంటాయి. మీరు కోరుకునే మార్పులు నిదానంగా అనుకూలిస్తాయి. కాంట్రాక్టర్లకు బిల్డర్లకు ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించే ఆస్కారం ఉంది. సద్వినియోగం చేసుకోండి. 
 
వృషభం: బ్యాంకు వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఉపాధ్యాయులకు పనిలో ఒత్తిడి, చికాకులు తప్పవు. కళత్ర మెుండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. వ్యాపారలావాదేవీలు ఊపందుకుంటాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి మిశ్రమ ఫలితాలుంటాయి. స్త్రీల ఆడంబారాలన చూసి ఎదుటివారు అపోహపడుతారు.
 
మిధునం: విదేశాలు వెళ్ళాలనే మీ కోరిక త్వరలోనే నెరవేరబోతుంది. ఏదైనా స్థిరాస్తి అమ్మకం చేయాలనే ఆలోచన స్పురిస్తుంది. ప్రభుత్వ రంగాల్లో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కానరాదు. ఉద్యోగస్తులు ఎదుటివారి తీరును గమనించి మెలగాల్సి ఉంటుంది. ఆధ్యాత్మిక, దైవ సేవా కార్యక్రమాలకు ఖర్చులు అధికంగా వెచ్చిస్తారు.
 
కర్కాటకం: ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి. కిరాణా, ఫ్యాన్సీ, వస్త్ర, బంగారం, వెండి వ్యాపారులకు పురోభివృద్ధి. క్రీడా, కళా రంగాల్లో వారికి నూతన ఆలోచనలు స్పురిస్తాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. బంధువులకు ధన సహాయం చేసే విషయంలో పునరాలోచన అవసరం.
 
సింహం: గతంలో ఒకరికిచ్చిన హామీ వలన ఇబ్బందులెదుర్కుంటారు. స్త్రీల తొందరపాటుతనం వలన బంధువర్గాల నుండి మాటపడవలసి వస్తుంది. వృత్తి రీత్యా మీ బాధ్యతలు పెరుగుతాయి. సోదరీసోదరుల పోరు అధికంగా ఉంటుంది. ఆకస్మిక ఖర్చులు, ఇతరత్రా అవసరాలు అధికమవుతాయి. విదేశీ యత్నాలు ఫలించగలవు.
 
కన్య: విద్యార్థుల మెుండివైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో రాణిస్తారు. ప్రయాణాల్లో తొందరపాటుతనం అంత మంచిది కాదని గమనించండి. కీలకమైన విషయాల్లో కుటుంబీకుల మధ్య అవగాహన నెలకొంటుంది. స్త్రీలు అదనవు సంపాదన పట్ల దృష్టి సారిస్తారు.
 
తుల: సహోద్యోగుల సహకారంతో పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక ఫలిస్తుంది. బంధువుల రాకతో గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత వహించిన సత్ఫలితాలు లభిస్తాయి.
 
వృశ్చికం: బ్యాంకులు ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. రావలసిన ధనం చేతికందటంతో పొదుపు దిశగా మీ ఆలోచనలుంటాయి. విదేశీ అవకాశాలు లభిస్తాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలవారికి మందకొడిగా ఉంటుంది. ఏ విషయంలోను ఇతురులపై ఆధారపడక స్వయం కృషిపైనే ఆధారపడడం మంచిది.
 
ధనస్సు: ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం మంచిది కాదు. రుణాలు తీరుస్తారు. ఏ విషయంలోను హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి. వైద్యులు అరుదైన శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. పత్రిగా సిబ్బందికి ఏకాగ్రత, సునిశిత పరిశీలన ప్రధానం. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారి సహాయం అందిస్తారు.
 
మకరం: పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కుంటారు. పూర్వపు మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులకు అధికారులతో సత్సంబంధాలు ఏర్పడుతాయి. అనుభవం లేని విషయాలకు దూరంగా ఉండడం మంచిది. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు. మీ కోరికలు, అవసరాలు వాయిదా వేసుకుంటారు.
 
కుంభం: వ్యాపారాభివృద్ధికి కొత్త ఆలోచనలు, పథకాలు రూపొందిస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత చోటు చేసుకుంటుంది. పనిచేసే చోట కొన్ని మార్పులు సంభవిస్తాయి. ముందుచూపుతో వ్యవహరించడం చాలా మంచిది. స్త్రీలకు తల, కాళ్లు, నరాలు, ఎముకలకు సంబంధించిన చికాకులు వంటివి ఎదుర్కుంటారు.
 
మీనం: వారసత్వపు వ్యవహారాలలో చికాకులు తప్పవు. బ్యాంకింగ్ వ్యవహారాల్లో పనులు చురుకుగా సాగుతాయి ప్రయాణాలలో అపరిచిత వ్యక్తుల పట్ల, వస్తువుల పట్ల మెళకువ అవసరం. మిత్ర బృందాల వలన సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది మెళకువ వహించండి. ప్రభుత్వ సంస్థలలోని వారి సేవలకు గుర్తింపు లభిస్తుంది.