గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : మంగళవారం, 5 జూన్ 2018 (09:05 IST)

మంగళవారం దినఫలాలు - మీ ప్రసంగాలు శ్రోతలకు....

మేషం: శాస్త్ర, సాంకేతిక రంగాలవారికి సదావకాశాలు లభిస్తాయి. పౌరుషమైన మాటలు సంబంధాల్ని దెబ్బతీస్తాయి. మీ ప్రసంగాలు శ్రోతలను ఆకట్టుకుంటాయి. సోదరీసోదరుల కలయిక, పరస్పర అవగాహన కుదరదు. ఉద్యోగయత్నంలో నిరుద్యోగ

మేషం: శాస్త్ర, సాంకేతిక రంగాలవారికి సదావకాశాలు లభిస్తాయి. పౌరుషమైన మాటలు సంబంధాల్ని దెబ్బతీస్తాయి. మీ ప్రసంగాలు శ్రోతలను ఆకట్టుకుంటాయి. సోదరీసోదరుల కలయిక, పరస్పర అవగాహన కుదరదు. ఉద్యోగయత్నంలో నిరుద్యోగులకు బిడియం, అభిమానం కూడదు. ఆలయాలను సందర్శిస్తారు.
 
వృషభం: ఓర్పు, విజ్ఞతతో మీ గౌరవం కాపాడుకుంటారు. పత్రికా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఆశాజనకం. సంఘంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వాతావరణంలో మార్పుతో రైతులు ఊరట చెందుతారు. విలాసాలు బాగా వ్యయంచేస్తారు. మీ కదలికలపై కొంతమంది నిఘావేశరన్న విషయం గమనించండి.
 
మిధునం: వస్త్ర, ఫ్యాన్సీ, మందుల వ్యాపారులు ఊపందుకుంటాయి. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీపై మంచి ప్రభావం చూపుతాయి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లోనూ, వస్తు నాణ్యతలోనూ మెళకువ అవసరం. అంతగా పరిచయం లేని వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది. బ్యాంకు వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. 
 
కర్కాటకం: ఉపాధ్యాయులకు ఆర్థిక ప్రగతితో కూడిన అవకాశాలు లభిస్తాయి. పత్రిక, వార్తా మీడియావారికి ఊహించని సమస్యలెదురవుతాయి. పాత వస్తువులను కొనుగోలు చేసి ఇబ్బందులను ఎదుర్కుంటారు. రుణాల కోసం అన్వేషిస్తారు. ఏది జరిగినా మంచికేనని భావించండి. మీ హద్దుల్లో ఉండటం అన్నివిధాలా క్షేమదాయకం. 
 
సింహం: ఒక వ్యవహారం నిమిత్తం ప్లీడర్లతో సంప్రదింపులు జరుపుతారు. పెద్దల ఆశీసులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ప్రతి చిన్నవిషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిదికాదు. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా మెలగండి.  
 
కన్య: విద్యార్థులకు మెడికల్, ఇంజనీరింగ్, టెక్నికల్ కోర్సులలో ప్రవేశం లభిస్తుంది. బంధువులు మీ నుంచి పెద్దమెుత్తంలో ధనసహాయం అర్థిస్తారు. వృత్తి, ఉపాధి పథకాల్లో స్థిరపడతారు. మీ సంతానం ఇష్టాలకు అడ్డు చెప్పటం మంచిది కాదు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. మిత్రులు అండగా నిలుస్తారు. 
 
తుల: పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ముఖ్యుల గురించి ధనం వెచ్చిస్తారు. స్త్రీలకు ఉపాధి పథకాల పట్ల, దైవ సేవా కార్యక్రమాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. కిరణా, ఫ్యాన్సీ నిత్యావసర వస్తువ్యాపారస్తులకు, స్టాకిస్తులకు పురోభివృద్ధి. విదేశీయానాలకై చేయు యత్నాలు ఒక కొలిక్కివస్తాయి.
 
వృశ్చికం: ఆర్థికస్థితి ఆశించిన విధంగా మెరుగు పడకపోవటంతో నిరుత్సాహం తప్పదు. రాజకీయాలలో వారు తొందరపడి వాగ్దానాలు చేయడం వల్ల సమస్యలు ఎదుర్కోవలసివస్తుంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాలవారికి కలిసి వచ్చేకాలం. ఏదైనా స్థిరాస్తి అమ్మకానికై చేయు యత్నం వాయిదా పడటం మంచిది.
 
ధనస్సు: ప్లీడర్లకు ఒత్తిడి, అకౌంట్స్ రంగాలవారికి పనిభారం తప్పదు. ఆకస్మికంగా ఆరోగ్యంలో చికాకులు తలెత్తుతాయి. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. ప్రేమికులకు మధ్య పెద్దల వల్ల సమస్యలు తలెత్తగలవు. ప్రభుత్వ కార్యలయాలలోని పనులు వాయిదా పడవచ్చు. కుటుంబీకులతో ఏకీభవించలేరు.
 
మకరం: వస్త్ర, బంగారు, వెండి, లోహవ్యాపారస్తులకు పనివారితో చికాకులు తప్పవు. సాహసప్రయత్నాలు విరమించండి. స్థిరాస్తి వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాల్లో ప్రముఖుల సలహా పాటించడం మంచిది. చిన్ననాటి వ్యక్తుల కలయిక సంతోషం కలిగిస్తుంది. ప్రముఖుల సిఫార్సుతో మీ పనులు సానుకూలమవుతాయి. 
 
కుంభం: ఆర్థిక, కుటుంబ సమస్యలకు చక్కని పరిష్కారమార్గం గోచరిస్తుంది. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలు సత్ఫలితాలనిస్తాయి. రుణాలు, చేబదుళ్లు ఇచ్చే విషయంలో జాగ్రత్త వహించండి. మీ సంతానం మెుండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. దంపతుల మధ్య చిన్న చిన్న కలహాలు, పట్టింపులెదురవుతాయి. 
 
మీనం: ఆర్థిక, వ్యాపార విషయాలను గోప్యంగా ఉంచండి. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. శత్రువులు మిత్రువులుగా మారి సహాయం అందిస్తారు. ఉపాధ్యాయులకు నూతన అవకాశాలు లభించగలవు. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదాపడతాయి. ఎవరికైనా ధనసహాయం చేసినా తిరిగిరాజాలదు.