గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : సోమవారం, 3 జూన్ 2019 (11:56 IST)

02-06-2019 మీ దినఫలాల : మీ ఉన్నతిని చూసి...

మేషం : మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. కుటుంబీకుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతారు. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది.
 
వృషభం : ఆర్థిక వ్యవహారాలు కాస్త నిరాశపరిచే వీలుంది. కాంట్రాక్టర్లకు చేపట్టిన పనుల్లో పర్యవేక్షణ, ఏకాగ్రత ఎంతో ముఖ్యం. పెద్ద మొత్తం ధనంతో ప్రయాణాలు క్షేమం కాదని గమనించండి. బంధువుల రాకతో గృహంలో అసౌకర్యానికి లోనవుతారు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
 
మిథునం : చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా పనులు పూర్తికాగలవు. ప్రముఖులను కలుసుకుంటారు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమపడవలసి వస్తుంది. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఆకస్మికంగా మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. స్త్రీలకు అలంకార వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
కర్కాటకం : ఉమ్మడి ఆస్తి విక్రయాల్లో సోదరుల నుంచి అభ్యంతరాలెదుర్కుంటారు. కుటుంబీకుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. కళ, క్రీడ, సాంకేతిక రంగాల వారికి ఆదరణ లభిస్తుంది. బంధువుల రాక ఉత్సాహాన్నిస్తుంది. స్త్రీలకు పనివారితో చికాకులు తలెత్తుతాయి.
 
సింహం : ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకం. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. తలపెట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి, ఆందోళన తప్పదు.
 
కన్య : విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యుల రాకపోకలు అధికమవుతాయి. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకుల పరుస్తాయి. సంఘంలో గుర్తింపు, రాణింపులభిస్తుంది. మీ సరదాలు, కోరికలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. స్థిరాస్తి అమ్మకంపై ఒత్తిడి వల్ల ఆందోళనలకు గురవుతారు.
 
తుల : ప్రింటింగు, స్టేషనరీ రంగాలలో వారికి పనిభారం అధికమవుతుంది. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులు తోటివారితో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు. విద్యార్థులకు క్రీడా కార్యక్రమాలపట్ల ఆసక్తి అధికమవుతుంది.
 
వృశ్చికం : నిరుద్యోగులు చిన్న అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవడం మంచిది. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. బంధువుల రాకతో మీ కార్యక్రమాలు, పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది. లౌక్యంగా వ్యవహరించి ఒక అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులు తప్పవు.
 
ధనస్సు : విద్యా సంస్థల్లో శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. పాత సమస్యలు ఛేదించి ధైర్య సాహసాలతో ముందుకు సాగండి. మీ అభివృద్ధికి మంచి మంచి అవకాశాలు లభించినా వాటిని సద్వినియోగం చేసుకోవటం మంచిది. కానివేళలో బంధు మిత్రుల రాక ఇబ్బంది కలిగిస్తుంది.
 
మకరం : భార్యా, భర్తల మధ్య సరైన అవగాహన లేక మనస్పర్ధలు రావచ్చును. మీ ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. గృహ నిర్మాణాలు, మరమత్తులు మందకొడిగా సాగుతాయి. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించటం వల్ల అస్వస్థతకు లోనవుతారు. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం.
 
కుంభం : మీ సంతానం మొండివైఖరి ఎంతో చికాకు కలిగిస్తుంది. దూర ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదాపడతాయి. స్త్రీల మనోభావాలకు గుర్తింపు, ఆదరణ లభిస్తుంది. వాహనం కొనుగోలు యత్నం ఫలిస్తుంది. చిన్న చిన్న విషయాలను అంతగా పట్టించుకోవద్దు. హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులు, స్టాకిస్టులకు పురోభివృద్ధి.
 
మీనం : ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదు అని గమనించండి. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. స్నేహితులతో కలిసి పార్టీలకు వెళతారు. ఉద్యోగ యత్నంలో నిరుద్యోగులకు బిడియం, అభిమానం కూడదు. వ్యాపారాల్లో ఆటంకాలు తొలగి లాభాలు గడిస్తారు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు.