Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శుభోదయం... ఈ రోజు రాశి ఫలితాలు 09-08-2017

బుధవారం, 9 ఆగస్టు 2017 (05:31 IST)

Widgets Magazine
daily astro

మేషం : ఈ రోజు మీ ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. గృహ నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించడం ద్వారా అస్వస్థతకు లోనవుతారు. ఉద్యోగస్తులకు శుభదాయకం. ఖర్చులు పెరిగినా భారమనిపించవు. ప్రయాణాలు అనుకూలించవు. కోర్టు వాయిదాలు విసుగు కలిగిస్తాయి. 
 
వృషభం : ఈ రోజు రాబడి తగిన ఖర్చులు ఉంటాయి. వాతావరణంలో మార్పు వల్ల చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. చిన్నతరహా, కుటీల పరిశ్రమల వారికి ఆశాజనకం. ఉద్యోగస్తులు అధిక శ్రమ పడినప్పటికీ తగిన గుర్తింపు ఉండదు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. శుభకార్య యత్నంగా అడుగులు వేస్తారు. 
 
మిథునం : ఈ రోజు ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. మానసిక సంతృప్తి, ప్రశాంతత. దీర్ఘకాలిక రుణయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ప్రైవేట్  సంస్థల్లో ఉద్యోగులు ఆచితూచి ముందుకు వెళ్ళడం మంచిది. వృత్తి వ్యాపారాలు ప్రగతి పథంలో నడుస్తాయి. విద్యార్థులు అధిక ఒత్తిడి, శ్రమ ఎదుర్కొంటారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. 
 
కర్కాటకం : ఈ రోజు విద్యా సంస్థల్లో వారికి, ఉపాధ్యాయులకు అనుకూలమైనకాలం. ఏ పని చేపట్టినా ఏదో ఒక అవాంతరం ఎదురవుతుంది. పత్రిక, ప్రైవేట్ సంస్థల్లోని వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. ప్లీడరు, ప్లీడరు గుమస్తాలకు పురోభివృద్ధి కానవస్తుంది. ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగవలసి వుంటుంది. 
 
సింహం : ఈ రోజు ఆర్థికలావాదేవీలు, వ్యవహారాలు సమర్థవంతంగా నడిపిస్తారు. దైవదర్శనాల వల్ల మానసిక సంతృప్తి, ఆనందం చోటుచేసుకుంటాయి. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. నిరుద్యోగులు ఉపాధిపథకాలలో నిలదొక్కుకుంటారు. వాతావరణంలో మార్పు రైతులకు ఆందోళన కలిగిస్తుంది. 
 
కన్య : ఈ రోజు ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఏకాగ్రత, ఓర్పు అవసరం. వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, మందుల వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. ఆకస్మికంగా ప్రయాణం తలపెడతారు. ధనానికి ఇబ్బంది లేకున్నా ఆర్థిక సంతృప్తి అంతగా ఉండదు. తీర్థయాత్రలు సంతృప్తినిస్తాయి. కోర్టు వ్యవహారాలు ఏమాత్రం ముందుకుసాగవు.
 
తుల : ఈ రోజు విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యంలో సంతృప్తి కానరాదు. వృత్తి వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధించగలుగుతారు. ఇతరుల విషయాలకు, వాదోపవాదాలకు దూరంగా ఉండటం మంచిది. స్పెక్యులేషన్ రంగాల వారికి ఆశాజనకం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. 
 
వృశ్చికం: ఈ రోజు ముఖ్యుల నుంచి ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు. వస్త్ర, బంగారం, వెండి రంగాల్లో వారికి పురోభివృద్ధి. అవివాహితులలో నూతన ఉత్సాహం నెలకొంటుంది. విద్యార్థులు మానసికంగా కుదుటపడతారు. ఆత్మీయులకు విలువైన కానుకలందిస్తారు. ధనం ఖర్చుచేసే విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది.
 
ధనస్సు : ఈ రోజు ఆర్థిక విషయాల్లో కొంత ఇబ్బంది తప్పక పోవచ్చు. వృత్తి వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. అవగాహనలేని విషయాల్లో జోక్యం తగదు. ముఖ్య విషయాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. మీ అంచనాలు ఫలిస్తాయి. గృహమార్పు యత్నం అనుకూలిస్తుంది. నిరోద్యోగులు ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. 
 
మకరం : ఈ రోజు కిరణా, ఫ్యాన్సీ, వస్త్ర, బంగారం, వెండి వ్యాపారులకు పురోభివృద్ధి. రియల్ ఎస్టేట్ రంగాల్లో వారికి నూతన వెంచర్లు కలిసిరాగలవు. విందు, వినోదాలతో కాలక్షేపం చేస్తారు. బంధుమిత్రుల రాకతో గృహం కళకళలాడుతుంది. నిర్మాణ పనుల్లో ఏకాగ్రత అవసరం. రావలసిన ధనం అందుతుంది. ఆరోగ్యంలో ఒత్తిడి ఎదుర్కొంటారు.
 
కుంభం : ఈ రోజు వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో వారి కార్యకలాపాలు సాఫీగా సాగిపోతాయి. రాజకీయాల్లో వారు ప్రతిపక్షాల పట్ల ఓర్పు, నేర్పుతో వ్యవహరించాలి. చక్కని ప్రణాళికలతో విజయాన్ని సాధిస్తారు. నూతన పెట్టుబడులకు కొంత అనుకూలమైన సమయమనే చెప్పవచ్చు. నిరుద్యోగులకు ఆశాజనకం. ఆలయాలను సందర్శిస్తారు.
 
మీనం : ఈ రోజు ఊహించని ఖర్చులు ఎదురు కావడంతో మీ చేతిలో ధనం నిలువదు. ఓర్పుతో వ్యవహరించాలి. ఏ విషయంలోనూ తొందరపడకూడదు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. రుణ ఒత్తిడి తప్పదు. గృహ నిర్మాణాలు చురుకుగా సాగుతాయి. దూర ప్రయాణాలు అనుకూలం. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

భవిష్యవాణి

news

శ్రావణమాసం, సోమవారం, అమావాస్య, సూర్యగ్రహణం నాలుగూ ఒకే రోజు.. ఇలా చేయండి

శ్రావణమాసం, సూర్యగ్రహణం, అమావాస్య, సోమవారం ఈ నాలుగు ఏకంగా ఒకే రోజు రావడం అరుదు. అలాంటి ...

news

శుభోదయం... మీ రాశి ఫలితాలు 08-08-2017

మేషం : ఈ రోజు పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. చిన్న చిన్న ...

news

శుభోదయం... మీ రాశి ఫలితాలు 07-08-2017

మేషం : ఈ రోజు సోదరీమణులకు విలువైన కానుకలు అందిస్తారు. పత్రికా రంగాలలోని వారికి ఒత్తిడి, ...

news

శుభోదయం... మీ రాశి ఫలితాలు 06-08-2017

మేషం : ఈ రోజు కాంట్రాక్టర్లకు అధికమైన ఒత్తిడి తప్పదు. ఎదుటివారు మీకు సమవుజ్జీవులేనని ...

Widgets Magazine