1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : సోమవారం, 28 ఆగస్టు 2017 (05:44 IST)

శుభోదయం .. ఈ రోజు మీ రాశి ఫలితాలు 28-08-17

మేషం : ఈ రోజు వృత్తుల వారికి శ్రమాధిక్యత మినహా ఆర్థిక సంతృప్తి ఆశించినంతగా ఉండదు. మీరు అమితంగా అభిమానించే వ్యక్తులే మిమ్మలను మోసగిస్తారు. స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. ప్రయాణాలు, బ్యాంకిం

మేషం : ఈ రోజు వృత్తుల వారికి శ్రమాధిక్యత మినహా ఆర్థిక సంతృప్తి ఆశించినంతగా ఉండదు. మీరు అమితంగా అభిమానించే వ్యక్తులే మిమ్మలను మోసగిస్తారు. స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెళకువ అవసరం. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత, ఆంక్షలు వంటివి తలెత్తుతాయి. 
 
వృషభం : ఈ రోజు ఆర్థిక ఇబ్బందులు లేకపోయినా సంతృప్తి ఉండజాలదు. వైద్యులకు ఏకాగ్రత, మెళకువ అవసరం. వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు మున్ముందు మంచి ఫలితాలనిస్తాయి. వివాహ యత్నాలలో సన్నిహితుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. పాత మిత్రుల కలయికతో మీలో కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. 
 
మిథనం : ఈ రోజు ప్రియతములు ఇచ్చే సలహా మీకు ఎంతో సంతృప్తినిస్తుంది. భాగస్వామిక వ్యాపారాల నుంచి విడిపోవాలనే ఆలోచన బలపడతుంది. విద్యార్థులకు మిత్రబృందాలు, వ్యాపకాలు అధికం కాగలవు. బంధువుల మధ్య అనురాగ వాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. మార్కెటింగ్ ఉద్యోగులకు టార్గెట్‌లు పూర్తి చేయడం కష్టంగా మారుతుంది. 
 
కర్కాటకం : ఈ రోజు ఆర్థిక విషయాల్లో ఇతరుల సలహా తీసుకోవడం మంచిది. ఇతరుల వ్యాఖ్యలు మీపై తీవ్రప్రభావం చూపుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత ముఖ్యం. దంపతుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి. కొబ్బరి, పండ్లు, పూల, పానీయ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. స్త్రీలు, వస్తువులు కొనుగోలు చేస్తారు. 
 
సింహం : ఈ రోజు వృత్తి వ్యాపారాల్లో సానుకూలతలుంటాయి. దంపతుల మధ్య చిన్నచిన్న కలహాలు చోటుచేసుకుంటాయి. ఆస్తి వ్యవహారాల్లో ముఖ్యులతో విభేదాలు తలెత్తుతాయి. ఏదైనా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కొంతకాలం వాయిదా వేయడం మంచిది. నిరుద్యోగులు, దూర ప్రయాణాలో వస్తువుల పట్ల మెళకు అవసరం. 
 
కన్య : ఈ రోజు గృహములో మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు. మీ బలహీనతలు, అలవాట్లు ఇబ్బంది కలిగించవచ్చు. బంధుమిత్రులతో కలిసి విందువినోదాలలో ఉల్లాసంగా గడుపుతారు. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. ఖర్చులు అధికంగా ఉన్నా మీ అవసరాలు నెరవేరుతాయి. 
 
తుల : ఈ రోజు రుణవిముక్తులు కావడంతో పాటు తాకట్లు విడిపించుకుంటారు. మీ సంతానం విద్యా వివాహాలకు ఖర్చులు అధికమవుతాయి. స్థిరాస్తి అమ్మకంపై ఒత్తిడి వల్ల ఆందోళనకు గురవుతారు. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోవడం మంచిది. కుటుంబీకుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. 
 
వృశ్చికం : ఈ రోజు ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. స్త్రీలకు ఆర్థికపరమైన సమస్యలు అధికమవుతాయి. కోర్టు తీర్పులు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. డబ్బు పోయినా కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. బంధువుల రాక అసౌకర్యం కలిగిస్తుంది. 
 
ధనస్సు : ఈ రోజు మీరు చేయు వృత్తి వ్యాపారాలయందు ప్రోత్సాహం, వాక్‌చాతుర్యం ఉండును. విదేశీ యత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కొంటారు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. బంధువుల కోసం ధన బాగా ఖర్చు చేస్తారు. ఉద్యోగస్తులకు తోటివారల వల్ల చికాకులు, అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది.
 
మకరం : ఈ రోజు ఆర్థికంగా పురోగమించడానికి చేయుయత్నాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఏకాగ్రత అవసరం. రాజకీయ నాయకులు, సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికం. కార్యసాధనలో శ్రమాధిక్యత, ప్రయాసలు ఎదుర్కొంటారు. 
 
కుంభం : ఈ రోజు ఆర్థిక విషయాలలో జయం చేకూరుతుంది. ఓర్పు, దీక్షతో అనుకున్నది సాధిస్తారు. విద్యార్థుల అపరిచిత వ్యక్తులతో అధికంగా సంభాషించడం శ్రేయస్కరం కాదు. స్త్రీలు పనివారితో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు బరువు, బాధ్యతలు అధికమవుతాయి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. 
 
మీనం : ఈ రోజు ఇతరులకు పెద్ద మొత్తంలో ధన సహాయం చేయునపుడు పునరాలోచన అవసరం. తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సొంతంగా వ్యాపారం చేయాలన్న మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. స్త్రీలకు స్వీయ అర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక ఫలిస్తుంది.