Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మీ రాశి ఫలితాలు (17-07-2017)... ప్రమోషన్లు వస్తాయి....

ఆదివారం, 16 జులై 2017 (20:42 IST)

Widgets Magazine
daily astro

మేషం : వృత్తుల వారి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగస్తులకు కోరుకున్న చోటికి బదిలీ, ప్రమోషన్ వంటి శుభపరిణామాలు ఉంటాయి. కొంతమంది మీ నుంచి ధన సహాయం లేక ఇతరాత్రా సాయం అర్థిస్తారు. ఏజెంట్లు, బ్రోకర్ల విషయంలో జాగ్రత్త అవసరం. నిరుద్యోగుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. 
 
వృషభం : జీవితభాగస్వామికి అన్ని విషయాలు తెలియజేయండి. దూర ప్రయాణాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. సంతానం పైచదువుల కోసం చేసే యత్నం ఫలిస్తుంది. స్త్రీల ప్రతిభకు తగిన అవకాశం లభిస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత అవసరం. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. 
 
మిథునం : గృహంలో చేయదలచిన మార్పులు వాయిదాపడతాయి. స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. అవివాహితులకు అనుకున్న సంబంధాలు నిశ్చయం కావడంతో వారిలో పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. స్థిరాస్తి క్రయవిక్రయాలకు సంబంధించిన వ్యవహారాలలో మెళకువ అవసరం. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. 
 
కర్కాటకం : చేపట్టిన పనులు అర్థాంతరంగా ముగిస్తారు. బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. ద్విచక్రవాహనంపై దూర ప్రయాణాలు మంచిదికాదని గమనించండి. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాల్లో నష్టాలను పూడ్చుకుంటారు. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. 
 
సింహం : ఓర్పు, నేర్పులతో మీరు అనుకున్నది సాధిస్తారు. రావలసిన మొండి బాకీలు సైతం వసూలు కాగలవు. స్త్రీలకు బంధువర్గాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కుటుంబీకులతో అవగాహనా లోపిస్తుంది. ద్విచక్రవాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదు అని గమనించండి. వ్యాపారాల్లో నష్టాలను పూడ్చుకుంటారు. 
 
కన్య : నిర్మాణ పనులలో పెరిగిన వ్యయం, జాప్యం ఆందోళన కలిగిస్తాయి. దైవకార్యాల్లో పాల్గొంటారు. పాత వస్తువులను కొని సమస్యలు తెచ్చుకోకండి. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. ఉపాధ్యాయులకు చికాకులు తలెత్తుతాయి. ఏ యత్నం కలిసిరాకపోవడంతో ఒకింత నిరుత్సాహం తప్పదు. 
 
తుల : ఆర్థికస్థితి మెరుగుపడుతుంది. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. విద్యార్థులకు ఒత్తిడి, ఆందోళనలు తప్పవు. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు చేపడుతారు. నూతన పెట్టుబడులు, లీజు, ఏజెన్సీలకు అనుకూలం. చేతివృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. గృహ నిర్మాణాలు, మరమ్మతులు చేపడుతారు. 
 
వృశ్చికం : రుణ ప్రయత్నాలలో ఆటంకాలు తొలగిపోతాయి. ప్రేమ వ్యవహారాల్లో లౌక్యంగా వ్యవహరించవలసి ఉంటుంది. స్త్రీలు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి చూపుతారు. ప్రయాణాలలో ఇబ్బందులు తప్పవు. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. విద్యా సంస్థలలోని వారికి అనుకూలంగా ఉండగలదు. 
 
ధనస్సు : బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. ఖర్చులు, చెల్లింపులు ప్రయోజనకరంగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విదేశీయానం, రుణయత్నాల్లో చికాకులు తప్పవు. వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. సంఘంలో మీ మాటకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. 
 
మకరం : ఉద్యోగస్తులు పైఅధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. దూర ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. గొప్పగొప్ప ఆలోచనలు, ఆశయాలు స్ఫురిస్తాయి. లీజు, ఏజెన్సీలు, నూతన టెండర్లు అనుకూలిస్తాయి. మీ యత్నాలు కొంత ఆలస్యంగానైనా పరిపూర్ణంగా పూర్తవుతాయి. 
 
కుంభం : ఆర్థికంగా ఎదగటానికి మీరు చేసే యత్నాలు ఒక కొలిక్కివస్తాయి. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాభివృద్ధికి చేయుకృషిలో గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించునపుడు మెళకువ అవసరం. 
 
మీనం : వృత్తి, వ్యాపారుల మధ్య నూతన పరిచయాలు లాభిస్తాయి. పింఛన్, భీమా పనులు పూర్తవుతాయి. ఆధ్యాత్మిక ధోరణి నెలకొంటుంది. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్త్రీలు కలుపుగోలుగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. విదేశీయానం కోసం చేసే యత్నాలు మందకొడిగా సాగుతాయి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

భవిష్యవాణి

news

మీ రాశి ఫలితాలు(16-07-2017)... నిరుద్యోగులకు జయం...

మేషం: బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. సంఘంలో మంచి పేరు, ఖ్యాతి గడిస్తారు. వాహనం ...

news

మీ రాశి వార ఫలితాలు... 16-07-2017 నుంచి 22-07-2017 వరకు...

మేషం : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం పరిచయాలు బలపడతాయి. శ్రమాధిక్యతతో పనులు పూర్తి ...

news

మీ రాశి ఫలితాలు(15-07-2017)... ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు...

మేషం: క్లిష్ట సమస్యలను ధైర్యం ఎదుర్కొంటారు. మీ సంతానంపై చదువుల విషయంలో ఒక నిర్ణయానికి ...

news

మీ రాశి ఫలితాలు(14-07-2017)... మంచి అవకాశాలు లభిస్తాయి...

మేషం : స్త్రీలకు తల, నరాలు, ఎముకలకి సంబంధించిన చికాకులు అధికమవుతాయి. శత్రువులు మిత్రులుగా ...

Widgets Magazine