21 రోజులు ఇలా చేసి చూడండి.. ఈ ఐదు వస్తువులతో దీపం వెలిగిస్తే?
21 రోజుల పాటు సుగంధ ద్రవ్యాలతో దీపం వెలిగిస్తే సర్వశుభాలు చేకూరుతాయి. ఈతిబాధలు, ఆర్థిక నష్టాలు వంటి ఇతరత్రా ఇబ్బందులను దూరం చేసుకోవాలంటే.. ఈ ఐదు సుగంధ ద్రవ్యాలతో కూడిన పదార్థాన్ని దీపంతో కలిపి వెలిగించడం ద్వారా సర్వాభీష్టాలు చేకూరుతాయి.
ఆ ఐదు వస్తువులు ఏంటో తెలుసుకుందాం.. ఇంటి పూజ గదిలోనూ, ఇంటికి ప్రధాన ద్వారానికి ఇరువైపులా తప్పకుండా దీపం వెలిగించాలి.
ఇలా వెలిగించే దీపంలో ఆరోమా ఆయిల్స్ వాడాలి. ఇందులో భాగంగా.. యాలకుల నూనె, లవంగం నూనె, పచ్చకర్పూరం పొడి, జవ్వాదు పొడి, దవనం పొడి.. వీటినన్నింటి కొనుగోలు చేసి సమపాళ్లలో తీసుకుని అన్నింటిని బాగా కలుపుకుని.. దీపం వెలిగించేటప్పుడు రెండు చుక్కలు వదిలాలి.
ఆ నూనెతో కలిపి ఈ సుగంధ ద్రవ్యాలతో కూడిన మిక్స్ కలపడం ద్వారా మంచి వాసన రావడమే కాకుండా ఇంట ప్రతికూలతలు తొలగిపోతాయి. అనుకున్న కోరికలు నెరవేరుతాయి.
అలాగే ఈ దీపం వెలిగించిన 21 నిమిషం నుంచే శుభం జరగడం మొదలవుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.